కడెం:
అదిలాబాద్ జిల్లాలో శనివారం ఓ వ్యక్తి మంత్రాల నెపంతో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ కట్టకింది గూడెం గ్రామంలో చోటు చేసుకుంది.
మచ్చినేని చిన్నులు(60) అనే వృద్ధుడు చేతబడులు చేస్తున్నాడనే అనుమానంతో అతని సమీప బంధువులే కొట్టి చంపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.