old man killed
-
వృద్ధుడి దారుణ హత్య
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట) : ఆత్మకూర్‌ఎస్ మండలం బొప్పారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఎడ్ల మాధవయ్య(60) అనే వృద్ధు డు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి ఆరుబ యట నిద్రిస్తున్న వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తులు పదునైన గొడ్డలితో తలపై నరకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు..మాధవయ్య మనుమడు(కుమార్తె కొడుకు) పెళ్లి ఈ నెల 24న కోదాడ మండలంలోని కొమరబండలో జరగనుంది. మాధవయ్య భార్య భాగ్య మ్మ పెళ్లి పనుల నిమిత్తం మూడు రోజుల క్రితం కుమార్తె ఇంటికి(కొమరబండ) వెళ్లింది. లారీక్లీనర్‌గా పనిచేస్తున్న మాధవయ్య చిన్నకుమారుడు వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి ఇంటికి చేరుకోగా తండ్రి, కొడుకు మద్యం సేవించారు. రాత్రి 10 గంటల అనంతరం మాధవయ్య ఇంటి ముందు నిద్రకు ఉపక్రమించగా.. వెంకటేశ్వర్లు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి మద్యం సేవించాడు. అనంతరం వచ్చి తండ్రి మంచానికి కొద్ది దూరంలో మరో మంచం వేసుకుని నిద్రపోయాడు. తెల్లవా రుజామున లేచిన వెంకటేశ్వర్లు తండ్రిని లేపడానికి వెళ్లగా రక్తపు మడుగులో ఉండడంతో నిర్ఘాంతపోయి, పక్క ఇంట్లో వేరుకాపురం ఉంటున్న తన అన్న జలంధర్‌ను నిద్రలేపి విషయం తెలిపాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యపై అనుమానాలు మాధవరావు హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతబడి అనుమానంతోనే హత్య జరిగినట్టు స్థానికులు అంటుండగా, వివాహేతర సంబంధం, భూతగాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్టు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ హరిక్రిష్ణ పరిశీలించారు. హత్యకు వాడిని గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ నుంచి క్లూస్ టీంను, డాగ్ స్క్వాడ్లను రప్పించి వివరాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని సూ ర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ హరిక్రిష్ణ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
గొంతుకోసి వృద్ధుడి హత్య
పర్చూరు : ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని చెరుకూరులో గురువారం రాత్రి జరిగి ఉంటుందని భావిస్తుండగా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిన నాగులు (80) గతంలో ముఠా మేస్త్రీగా పనిచేశాడు. ఎంతో మందికి ఉపాధి చూపాడు. ఆయన మనుమడు బోయిన గోపీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. గోపీ తరుచూ మద్యం కోసం ఇంట్లో డబ్బులు అడిగేవాడు. ఇవ్వకుంటే కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. గోపీ తల్లి ఇందిర గతంలో స్థానిక పోలీసుస్టేషన్లో కూడా కుమారుడిపై ఫిర్యాదు చేసింది. కొడుకు ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో తల్లిదండ్రులు వేరే ఊరులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గోపి తన భార్య బంగారు గొలుసు తీసుకొని బాపట్లలో తాకట్టు పెట్టేందుకు వెళ్లాడు. అతడి తల్లి షాపు యజమానికి ఫోన్ చేసి తాకట్టు పెట్టుకోవద్దని చెప్పింది. వేరొక షాపులో తాకట్టు పెట్టి రూ.20 వేలు తీసుకొకున్నాడు. అందులో రూ.10 వేలతో సెల్‌ఫోన్ కొన్నాడు. మిగిలిన డబ్బుతో మద్యం తాగుతున్నాడు. గురువారం రాత్రి గోపీ, తాత నాగులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇంతలో తాత నాగులు గొంతు కోసి దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ ఎం.శేషగిరిరావు మాట్లాడుతూ మనుమడు గోపి మద్యానికి బానిసై నిద్రపోతున్న తాత నాగులును గోంతుకోసి చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని చీరాల డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి కొడలు ఇందిర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ శేషగిరిరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మెట్లపై నుంచి జారిపడి వృద్ధుడి మృతి
నాయుడుపేటటౌన్ : ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారి కిందపడి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని శివాలయం సమీపంలో సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... తమిళనాడు ప్రాంతానికి చెందిన ముప్పాల నారాయణ (70) నాయుడుపేటలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి భార్య, పిల్లలు లేరు. పలు దుకాణాల్లో పనిచేస్తూ పాఠశాలలో నిద్రిస్తుంటాడు. పట్టణానికి చెందిన యద్దల ప్రతాప్‌రెడ్డి, ఇబ్రహీం కుటుంబీకులు అతనికి చేదోడుగా వాదోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ భోజన వసతి ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఇబ్రహీం పిల్లలకు బక్రీద్ పండగ సందర్భంగా వస్తువులు కొనిచ్చేందుకు ఇంటి మిద్దెపైకి మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాతు జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు ఏఎస్సై శంకర్రాజు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి నారాయణను ఆదరించిన కుటుంబీకులకు అప్పగించారు. ఆదరించిన కుటుంబాల రుణం తీర్చుకున్న మృతుడు అనాథగా ఉన్న వృద్ధుడు నారాయణను ఆదరించిన ప్రతాప్‌రెడ్డి, ఇబ్రహీం కుటుంబాల రుణం తీర్చుకునేలా చర్యలు చేపట్టడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. రెండు కుటుంబాల పేర లక్షల రూపాయల నగదును వారి పేరున ఇన్సూరెన్స్ చేసి ఉన్నాడు. దీంతో నారాయణకు అంత్యక్రియలను ఇరు కుటుంబాలు కలిసి నిర్వహించారు. అయితే మృతుడికి ప్రతాప్‌రెడ్డి తలకొరివి పెట్టి అతని రుణాన్ని తీర్చుకున్నాడు. పాఠశాలలో విద్యార్థుల బాగోగులు చూస్తుండే నారాయణ మృతి పట్ల ఆ పాఠశాల హెచ్ఎం బాబుతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
రైలుకింద పడి వృద్ధుని మృతి
ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈఘటన అనంతపురం జిల్లా డీ.హీరేహళ్ మండలం తేనాంపల్లి గేటు వద్ద మంగళవారం ఉదయం జరిగింది. మృతుడికి 60 ఏళ్ల వయసు ఉంటుందనీ, అతడు నేత్రపల్లికి చెందిన వ్యక్తి అయి ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి.. మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. -
మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య
కడెం: అదిలాబాద్ జిల్లాలో శనివారం ఓ వ్యక్తి మంత్రాల నెపంతో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ కట్టకింది గూడెం గ్రామంలో చోటు చేసుకుంది. మచ్చినేని చిన్నులు(60) అనే వృద్ధుడు చేతబడులు చేస్తున్నాడనే అనుమానంతో అతని సమీప బంధువులే కొట్టి చంపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఎవరికి ఓటేశాడో చెప్పలేదని.. వృద్ధుడి హత్య!
ఉత్తరప్రదేశ్ గూండాల రాజ్యం అనే విషయం మరోసారి రుజువైంది. ఎవరికి ఓటేశాడో చెప్పనందుకు గాను 80 ఏళ్ల వృద్ధుడిని కొంతమంది గూండాలు కొట్టి చంపారు. ఝాన్సీ - లలిత్పూర్ లోక్‌సభ స్థానానికి చెందిన జంగీ లాల్ అనే ఈ వృద్ధుడిని ఆ గూండాలు అతడి గ్రామ సమీపంలోని ఓ ఆలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ దేవుడి మీద ప్రమాణం చేసి, ఎవరికి ఓటేసినదీ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ, అతడు మాత్రం ఆ వివరాలు వెల్లడించడానికి నిరాకరించాడు. (చదవండి: బీజేపీకి ఓటేశానంటూ దొరికిపోయిన బాబు) దాంతో వాళ్లు అతడిమీద క్రూరంగా దాడిచేసి విపరీతంగా కొట్టారు. దాంతో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి, దుండగులను అరెస్టు చేశారు. కానీ, కేసు ఉపసంహరించుకోవాలని వాళ్లు తమపై ఒత్తిడి తెస్తున్నట్లు వృద్ధుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.