సాక్షి, హైదరాబాద్: చిన్ననాటి స్నేహితులు.. భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లిల మధ్య వివాదాలు సమసిపోయాయాని, ‘గత నెల చిన్ననాటి మిత్రుడు సచిన్‌తో తొలి సెల్ఫీ అంటూ’ కాంబ్లీ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మాస్టర్ బ్లాస్టర్ కూడా ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అంటూ శుక్రవారం తన మిత్రులతో దిగిన ఫోటోను ఇన్‌స్ట్రాగ్రమ్‌లో పోస్టు చేశాడు.
గత నెల జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సచిన్, కాంబ్లి, అటుల్ కస్బేకర్ అజిత్ అగార్కర్‌లు హాజరయ్యారు. ఈసందర్భంగా తీసుకున్న ఓ సెల్ఫీని సచిన్ ‘క్రికెట్ నాకు ఇచ్చిన అత్యంత అద్భుతమై విషయాల్లో జీవీతాంతం తోడుండే మిత్రులను ఇవ్వడం ’అనే టైటిల్‌తో షేర్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
ఇక దాదాపు ఎనిమిదేళ్ల కిందట స్నేహితుడు సచిన్ పై కాంబ్లి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తన కెరీర్ పతనం అవుతున్నప్పుడు ప్రొఫెషన్ పరంగా గానీ, వ్యక్తిగతంగా కానీ సచిన్ తనకు అండగా ఉండలేదని.. ఎలాంటి మద్ధతు తెలపలేదని ఓ టీవీ షోలో తన అవేదన వ్యక్తం చేస్తూ కాంబ్లి కన్నీటి పర్యంతమవడాన్ని ఏ క్రికెట్ ప్రేమికుడు అంత సులువుగా మరిచిపోలేదు.
కాంబ్లి వ్యాఖ్యలపై సచిన్ స్పందించకుండా ఉన్న మాట వాస్తవమే. అలాగనీ స్నేహితుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సందర్భంలోనూ సచిన్ వెళ్లి కలవలేదు. ఆపై తన ఆటో బయోగ్రఫీ విడుదలకు గానీ, సచిన్ వీడ్కోలు కార్యక్రమానికి సైతం కాంబ్లికి ఆహ్వానం అందకపోవడం గమనార్హం. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అందరూ భావించారు.
Comments
Please login to add a commentAdd a comment