
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి తండ్రి గణపత్ కాంబ్లి
సాక్షి, ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి ఇంట్లో విషాదం నెలకొంది. క్రికెటర్ కాంబ్లి తండ్రి గణపత్ కాంబ్లి మంగళవారం తుదిశ్వాస విడిచారు. తన తండ్రి ఇకలేరన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కాంబ్లి వెల్లడించారు. తండ్రితో తన అనుబంధాన్ని ఆయన జ్ఞాపకాలను ఈ క్రికెటర్ ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. ‘నా ప్రతి విషయంలో ఎంతగానో ప్రోత్సహించిన వ్యక్తి మా నాన్న. క్రికెట్ ఆడేలా చేసి నాకు ఓ గుర్తింపు వచ్చేలా చేసిన నాన్న ఇకలేరు. డాడీ.. ఐ మిస్ యూ.. అండ్ లవ్ యూ ’ అని తండ్రి ఫొటోలను షేర్ చేస్తూ ఈ చేదువార్తను అభిమానులతో షేర్ చేసుకున్నారు వినోద్ కాంబ్లి.
కాంబ్లి తండ్రి గణపత్ కాంబ్లి మృతిపట్ల క్రికెటర్ అభిమానులు స్పందిస్తున్నారు. గణపత్ కాంబ్లి మృతిపట్ల సంతాపం తెలిపిన నెటిజన్లు, అభిమానులు క్రికెటర్‌కు తమ సానుభూతి వ్యక్తం చేశారు. కాంబ్లి సార్.. మీరు ధైర్యంగా ఉండండి. మీ నాన్న ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నామంటూ క్రికెటర్ కాంబ్లికి ధైర్యం చెబుతూ ట్వీట్లు చేశారు. సచిన్ బాల్య స్నేహితుడైన కాంబ్లి టీమిండియా తరపున వందకు పైగా వన్డేలు ఆడిన విషయం విదితమే.
The man who stood thick and thin beside me always, who inspired me take up https://t.co/KS6GxBJNrf father Ganpat Kambli is no more.He passed away this Morning.Papaa I will miss you. Thank you Papaa, Love you. Your son Vinod. pic.twitter.com/lRmXj8djzK
— VINOD KAMBLI (@vinodkambli349) 30 January 2018
Comments
Please login to add a commentAdd a comment