
Vinod Kambli Hails Yash Dhull After Ranji Ton: ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన యష్ ధుల్‌పై టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. యష్ ధుల్ త్వరలోనే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తాడని కాంబ్లీ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ తరుపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన యష్.. తమిళనాడుపై అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 150 బంతుల్లో 113 పరుగులు యష్ చేశాడు. ఇక అండర్- 19 ప్రపంచకప్ టోర్నీలో కెప్టెన్‌గా యష్ ధుల్ భారత్‌కు ప్రపంచకప్ సాధించి పెట్టిన సంగతి తెలిసిందే.
"ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో యష్ ధుల్ తన కేరిర్‌ను ఘనంగా ఫ్రారంభించాడు. తొలి సెంచరీను తన దైన శైలిలో సాధించాడు. అతడు దేశీయ స్ధాయి, ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తాడని భావిస్తున్నాను. యష్ ఖచ్చితంగా భారత్ తరుపున త్వరలోనే అరంగేట్రం చేస్తాడు. కంగ్రాట్స్ మిస్టర్ ధూల్" అని కాంబ్లీ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ యష్ ధుల్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది.
చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా!