Ranji Trophy Group
-
"అతడు త్వరలోనే టీమిండియా లోకి వస్తాడు"
Vinod Kambli Hails Yash Dhull After Ranji Ton: ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన యష్ ధుల్‌పై టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. యష్ ధుల్ త్వరలోనే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తాడని కాంబ్లీ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ తరుపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన యష్.. తమిళనాడుపై అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 150 బంతుల్లో 113 పరుగులు యష్ చేశాడు. ఇక అండర్- 19 ప్రపంచకప్ టోర్నీలో కెప్టెన్‌గా యష్ ధుల్ భారత్‌కు ప్రపంచకప్ సాధించి పెట్టిన సంగతి తెలిసిందే. "ఫస్ట్ క్లాస్ క్రికెట్లో యష్ ధుల్ తన కేరిర్‌ను ఘనంగా ఫ్రారంభించాడు. తొలి సెంచరీను తన దైన శైలిలో సాధించాడు. అతడు దేశీయ స్ధాయి, ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తాడని భావిస్తున్నాను. యష్ ఖచ్చితంగా భారత్ తరుపున త్వరలోనే అరంగేట్రం చేస్తాడు. కంగ్రాట్స్ మిస్టర్ ధూల్" అని కాంబ్లీ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ యష్ ధుల్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా! -
ఆంధ్రాకు 3 పాయింట్లు
సాక్షి, విజయనగరం: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆంధ్ర జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫలితంగా గుజరాత్‌తో జరిగిన రంజీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తమ తొలి మ్యాచ్‌లో పటిష్ట ముంబైపై కూడా ఆధిక్యాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం నాలుగో రోజు ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 24/1 ఓవర్‌నైట్ స్కోరుతో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన గుజరాత్ రోజు ముగిసే సమయానికి 90 ఓవర్లలో నాలుగు వికెట్లకు 254 పరుగులు చేసింది. అంతకుముందు గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేయగా ఆంధ్ర 421 పరుగులకు ఆలౌటయ్యింది. దీంతో 113 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. హైదరాబాద్‌కు మరోసారి నిరాశ సాక్షి, హైదరాబాద్: అనుకున్నట్టుగానే హైదరాబాద్ జట్టుకు మరోసారి నిరాశ ఎదురైంది. కేరళతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయిన ఈ జట్టు ఒక్క పాయింట్‌తోనే సరిపెట్టుకుంది. -
జార్ఖండ్ 295/4
హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్ రాంచీ: హైదరాబాద్‌తో బుధవారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో జార్ఖండ్ నిలకడైన ప్రదర్శన కనబర్చింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. సౌరభ్ తివారీ (192 బంతుల్లో 100; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించడం విశేషం. ఇషాన్ కిషన్ (118 బంతుల్లో 66; 11 ఫోర్లు), ఇషాంక్ జగ్గీ (134 బంతుల్లో 58 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు.