హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్
రాంచీ: హైదరాబాద్‌తో బుధవారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో జార్ఖండ్ నిలకడైన ప్రదర్శన కనబర్చింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. సౌరభ్ తివారీ (192 బంతుల్లో 100; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించడం విశేషం. ఇషాన్ కిషన్ (118 బంతుల్లో 66; 11 ఫోర్లు), ఇషాంక్ జగ్గీ (134 బంతుల్లో 58 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు.
జార్ఖండ్ 295/4
Published Thu, Jan 22 2015 12:56 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement