
మాజీ క్రికెటర్ కు మళ్లీ చిక్కులు
ముంబై: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లితో మరోసారి చిక్కులు కొనితెచ్చుకున్నాడు. పనిమనిషిపై దాడి చేసి వేధింపులకు పాల్పర్డారనే ఆరోపణలతో కాంబ్లి, ఆయన ఆండ్రియాపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీతం అడినందుకు తనపై కాంబ్లి, ఆయన భార్య దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పనిమనిషి తెలిపింది.
తనను మూడు రోజుల పాటు చీకటి గదిలో బంధించారని చెప్పింది. మళ్లీ తమ ఇంటి దరిదాపుల్లో కనబడొద్దని హెచ్చరించి విడిచిపెట్టారని వెల్లడించింది. తనకు రెండేళ్లుగా జీతం ఇవ్వం లేదని తెలిపింది. కాంబ్లి ఇంట్లో పనిచేస్తున్నా అక్కడే ఉంటున్నట్టు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కాంబ్లి, ఆండ్రియాలపై ఐపీసీ సెక్షన్ 342, 504, 506, 34 కింద కేసులు నమోదు చేశారు.