ఆర్ధిక చిక్కుల్లో వినోద్ కాంబ్లీ
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన చిక్కుల్లో పడ్డారు
ముంబై: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన చిక్కుల్లో పడ్డారు. బ్యాంకు వాయిదాలు చెల్లించడలేదని ప్రముఖ దినపత్రికలో ప్రకటన రావడం సంచలనం రేపింది. ఇంటి, వాహన రుణ వాయిదాలు చెల్లించడం లేదని ప్రముఖ మరాఠీ దినపత్రికలలో దోంబివ్లీ బ్యాంక్ ఓ ప్రకటన ఇచ్చింది.
ఇంటి, వాహనాల రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలమయ్యారంటూ కాంబ్లీ దంపతులకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకు అధికారులు పలుమార్లు విజ్క్షప్తి చేసినా.. వాయిదాల చెల్లించడానికి నిరాకరించినట్టు ప్రకటనలో తెలిపారు.
బ్యాంకు నిబంధనలకు లోబడి కాంబ్లీకి రుణాల్ని మంజూరు చేశాం. ఆరంభంలో కొన్ని వాయిదాలు చెల్లించారు. ఆతర్వాత వాయిదాలను చెల్లించడం ఆపివేశారు అని దాంబివ్లీ నగరి సహకారి బ్యాంక్ సీనియర్ అధికారి వెల్లడించారు.
క్రికెటర్ వినోద్ కాంబ్లీకి ఇలాంటి వివాదాలు కొత్తేమి కాదు. ఓసారి తమ అపార్ట్ మెంట్ లో తప్పతాగి గందరగోళం సృష్టించారు. అంతేకాకుండా రిటైర్మెంట్ సమయంలో ప్రసంగంలో తన పేరు సచిన్ వెల్లడించలేందంటూ వ్యాఖ్యలు చేసి వివాదానికి కేంద్ర బిందువయ్యారు.