
ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్.. ఇప్పుడు రెండో టెస్టులోనూ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్రూక్ కేవలం 109 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇది అతడికి నాలుగో టెస్టు సెంచరీ కావడం గమనార్హం.
బ్రూక్ ప్రస్తుతం డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అతడు 169 బంతుల్లో 184 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. బ్రూక్ ఇన్నింగ్స్‌లో 5 సిక్స్‌లు, 24 ఫోర్లు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్ 100.8 సగటుతో 807 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉండడం విశేషం. ఈ క్రమంలో ఓ అరుదైన ఘతనను బ్రూక్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో తొలి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లలో అతడు 807 పరుగులు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ(798పరుగులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కాంబ్లీ రికార్డు బ్రేక్‌చేశాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు నష్టపోయి 315 పరుగులు చేసింది. క్రీజులో రూట్(101),బ్రూక్ (184) పరుగులతో ఉన్నారు.
చదవండి: T20 WC: అప్పుడు ధోని.. ఇప్పుడు హర్మన్! దురదృష్టం అంటే టీమిండియాదే?
Comments
Please login to add a commentAdd a comment