వినోద్ కాంబ్లీ మళ్లీ పెళ్లికొడుకయ్యాడు! | Vinod Kambli opts for an intimate Catholic wedding with wife Andrea Hewitt | Sakshi
Sakshi News home page

వినోద్ కాంబ్లీ మళ్లీ పెళ్లికొడుకయ్యాడు!

Published Mon, May 5 2014 1:38 PM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

వినోద్ కాంబ్లీ మళ్లీ పెళ్లికొడుకయ్యాడు!

వినోద్ కాంబ్లీ మళ్లీ పెళ్లికొడుకయ్యాడు!

కొద్ది సంవత్సరాల క్రితం కోర్టు ద్వారా వినోద్, ఆండ్రియాలు తమ వైవాహిక సంబంధానికి చట్టబద్దత కల్పించుకున్నారు.

క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి పెళ్లి కొడుకయ్యాడు. శనివారం బాంద్రాలోని సెయింట్ పీటర్స్ చర్చ్ లో జరిగిన వేడుకలో తన భార్య అండ్రియా హెవిట్ కాథలిక్ సంప్రదాయ పద్దతిలో పెళ్లాడారు.
 
గతంలో కోర్టు ద్వారా వినోద్, ఆండ్రియాలు తమ వైవాహిక సంబంధానికి చట్టబద్దత కల్పించుకున్నారు. కొద్ది రోజుల క్రితం గుండె పోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన కాంబ్లీ ఆధ్యాత్మిక చింతనకు లోనయ్యారట. 
 
ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించిన కాంబ్లీ సాంప్రదాయ పద్దతిలో పెళ్లాడాలని నిర్ణయించకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి.
 
కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరైన కార్యక్రమానికి వినోద్, ఆండ్రియా కుమారుడు జీసస్ క్రిస్టియానో కూడా ముఖ్య అతిధిగా మారడం విశేషం. వినోద్, ఆండ్రియాల వివాహ వేడుకకు బాలీవుడ్ నటులు అశుతోష్ రానా, సతీమణి రేణుకా సహానీలు హాజరయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement