జీవితంలో ఫెయిల్ అయ్యే వారికంటే.. సక్సెస్ ఉన్న వారినే సమాజం ఎక్కువగా ఇష్ట పడుతుందనేది జగమెరిగిన సత్యం. అందుకే బల్బును కనిపెట్టే క్రమంలో వెయ్యిసార్లు ఫెయిల్ అయినప్పటికీ పట్టువదలకుండా దాన్ని ఆవిష్కరించిన థామస్ అల్వా ఎడిసన్, ఎగరాలనే కోరికను నిజం చేసిన రైట్ బ్రదర్స్ ఎంతో మందికి ఆదర్శం. ఇక సుధా చంద్రన్ పేరు వింటే చాలు ఎంతో మంది ఉత్తేజితులవురారు. వికలాంగులకనే కాదు.. ఆమె ఎంతో మందికి ఓ స్ఫూర్తి. మనిషి తనలో ఉండే లోపాన్ని సాకుగా తీసుకుని ఆగిపోకూడదని ఎంతో మంది నిరూపించారు.
ముంబై: Sachin Tendulkar.. భారత క్రికెట్ ప్రపంచంలో ఓ దేవుడు. ఆయన తరచూ స్ఫూర్తిదాయకమైన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా అంగవైకల్యం ఉన్న ఓ వ్యక్తి వీడియోను సచిన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో హర్షద్ గోతంకర్ అనే వ్యక్తికి రెండు చేతులు ఉండవు. కానీ ఆయన కాళ్లతో క్యారమ్ ఆడతూ అబ్బురపరిచాడు. అది కూడా క్యారమ్ బోర్డ్‌లో ఉన్న ఒక్కో కాయిన్‌ను గురి తప్పకుండా పడగొడతాడు.
‘‘అసాధ్యాన్ని.. సాధ్యం చేయడానికి మధ్య వ్యత్యాసం ఓ నిర్ణయంలో ఉంటుంది. ఆ విషయాన్ని హర్షద్ గోతంకర్ చేయగలను అని చేసి చూపిస్తున్నాడు. అతడి ప్రేరణను ప్రేమిద్దాం.. ఆ సంకల్పం నుంచి మనమందరం ఏం చేయవచ్చో.. నేర్చుకుందాం.’’ అంటూ సచిన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘సూపర్.. ప్రతిభ మాత్రమే అద్భుతాలను సృష్టించలేదనే దానికి ఇది రుజువు. విజయం సాధించాలంటే నిరంత సాధన, కృషి ఉండాలి. తనను తాను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి.’’ అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. మరో నెటిజన్ ‘‘ఇది జీవితానికి ఓ ప్రేరణ! ఇదే నా వందనం’’ అంటూ కామెంట్ చేశాడు.
The difference between impossible & POSSIBLE lies in one’s determination.
— Sachin Tendulkar (@sachin_rt) July 26, 2021
Here's Harshad Gothankar who chose i-m-POSSIBLE as his motto.
Love his motivation to find ways to make things possible, something that we can all learn from him. #MondayMotivation pic.twitter.com/Cw6kPP4uUz
Comments
Please login to add a commentAdd a comment