carrom board
-
కేక పుట్టిస్తున్న.. సచిన్ టెండూల్కర్ ట్వీట్..!
జీవితంలో ఫెయిల్ అయ్యే వారికంటే.. సక్సెస్ ఉన్న వారినే సమాజం ఎక్కువగా ఇష్ట పడుతుందనేది జగమెరిగిన సత్యం. అందుకే బల్బును కనిపెట్టే క్రమంలో వెయ్యిసార్లు ఫెయిల్ అయినప్పటికీ పట్టువదలకుండా దాన్ని ఆవిష్కరించిన థామస్ అల్వా ఎడిసన్, ఎగరాలనే కోరికను నిజం చేసిన రైట్ బ్రదర్స్ ఎంతో మందికి ఆదర్శం. ఇక సుధా చంద్రన్ పేరు వింటే చాలు ఎంతో మంది ఉత్తేజితులవురారు. వికలాంగులకనే కాదు.. ఆమె ఎంతో మందికి ఓ స్ఫూర్తి. మనిషి తనలో ఉండే లోపాన్ని సాకుగా తీసుకుని ఆగిపోకూడదని ఎంతో మంది నిరూపించారు. ముంబై: Sachin Tendulkar.. భారత క్రికెట్ ప్రపంచంలో ఓ దేవుడు. ఆయన తరచూ స్ఫూర్తిదాయకమైన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా అంగవైకల్యం ఉన్న ఓ వ్యక్తి వీడియోను సచిన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో హర్షద్ గోతంకర్ అనే వ్యక్తికి రెండు చేతులు ఉండవు. కానీ ఆయన కాళ్లతో క్యారమ్ ఆడతూ అబ్బురపరిచాడు. అది కూడా క్యారమ్ బోర్డ్‌లో ఉన్న ఒక్కో కాయిన్‌ను గురి తప్పకుండా పడగొడతాడు. ‘‘అసాధ్యాన్ని.. సాధ్యం చేయడానికి మధ్య వ్యత్యాసం ఓ నిర్ణయంలో ఉంటుంది. ఆ విషయాన్ని హర్షద్ గోతంకర్ చేయగలను అని చేసి చూపిస్తున్నాడు. అతడి ప్రేరణను ప్రేమిద్దాం.. ఆ సంకల్పం నుంచి మనమందరం ఏం చేయవచ్చో.. నేర్చుకుందాం.’’ అంటూ సచిన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘సూపర్.. ప్రతిభ మాత్రమే అద్భుతాలను సృష్టించలేదనే దానికి ఇది రుజువు. విజయం సాధించాలంటే నిరంత సాధన, కృషి ఉండాలి. తనను తాను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి.’’ అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. మరో నెటిజన్ ‘‘ఇది జీవితానికి ఓ ప్రేరణ! ఇదే నా వందనం’’ అంటూ కామెంట్ చేశాడు. The difference between impossible & POSSIBLE lies in one’s determination. Here's Harshad Gothankar who chose i-m-POSSIBLE as his motto. Love his motivation to find ways to make things possible, something that we can all learn from him. #MondayMotivation pic.twitter.com/Cw6kPP4uUz — Sachin Tendulkar (@sachin_rt) July 26, 2021 -
వీళ్లలా క్యారమ్ బోర్డ్ ఎవరూ ఆడలేరు
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల చిన్ననాటి ఆటలు మళ్లీ ఆడుకునే అవకాశం దొరికింది. అవుట్డోర్ గేమ్స్‌కు స్వస్థి పలుకుతూ ఇంట్లో ఆటలకే జై కొడుతున్నారు. అలనాటి ఆటల నుంచి నేటి తరం గేమ్స్ వరకు అన్నింటినీ ఓ పట్టు పడుతున్నారు. అందులో ఏకాగ్రతను పెంచే క్యారమ్, చెస్ వంటి ఆటలు కూడా ఉన్నాయి. మరి క్యారమ్ బోర్డ్ ఆడాలంటే ఏం కావాలి? అన్న ప్రశ్న వస్తే క్యారమ్, కాయిన్స్, వీలైతే కాయిన్స్ సులువుగా జారేందుకు కాసింత పౌడర్ కూడా అని ఠపీమని సమాధానమిస్తారు. అయితే అవేవీ లేకుండా కూడా ఇది ఆడొచ్చంటున్నారు కొంతమంది స్నేహితుల గ్యాంగ్. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది సాధ్యమేనని చేసి నిరూపించారు కూడా. వివరంగా చెప్పాలంటే ఓ వ్యక్తికి పెరట్లో కొద్దిమందితో కలిసి మానవ క్యారమ్ ఆడితే ఎలా ఉంటుంది? అని ఆలోచన తట్టింది. (ప్రాణాలకు తెగించి కాపాడిన కుక్క) వెంటనే తన ఫ్రెండ్స్‌తో కలిసి మానవ క్యారమ్ బోర్డ్ ఆట ఆడి చూపించాడు. అందుకోసం ఖాళీ నేలపై పెద్దగా క్యారమ్ ఆకారాన్ని గీశాడు. కాకపోతే ఇందులో కాయిన్స్, స్ట్రైకర్‌కు బదులుగా మనుషులను పెట్టాడు. (స్థలాన్ని బట్టి కాయిన్స్ అంటే మనుషుల సంఖ్యను పెంచుకునేందుకు అవకాశం ఉంది) తర్వాత స్ట్రైకర్ స్థానంలో ఓ మనిషిని నిల్చోబెట్టి ఆటగాడు అతడిని ముందుకు తోస్తాడు. అతను కొంచెం వేగంగా తోసిన దిశ వైపుగా వెళతాడు. దీంతో అక్కడ ఎవరైనా మనుషులు(కాయిన్స్) ఉంటే వాళ్లు ముందుకు తోసుకుంటూ వెళ్లి హోల్లో పడతారు. ప్రస్తుతం ఈ వెరైటీ క్యారం బోర్డ్ టిక్‌టాక్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా మరో విశేషమేంటంటే క్యారమ్ బోర్డ్ ఆటను మొట్టమొదటి సారిగా భారత్‌లోనే కనుగొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఇది వివిధ దేశాలకు పాకింది. (లాక్డౌన్: వాషింగ్ మెషీన్లో దాక్కున్న యువతి) -
క్యారం సెంటర్లపై పోలీసుల దాడులు
నిజామాబాద్ క్రైం : నగరంలోని ఆరు క్యారం సెంటర్లపై దాడులు చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ నార్త్ సీఐ బుచ్చయ్య తెలిపారు. 5వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో గల క్యారం బోర్డు సెంటర్లలో నిత్యం బెట్టింగ్‌లపై క్యారం ఆడుతున్నారనే సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి ఆరు క్యారం సెంటర్లపై దాడులు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బెట్టింగ్‌లపై క్యారం ఆడుతున్న 26 మందిని అదుపులోకి తీసుకుని రూ. 1,720 నగదు, 16 సెల్ఫోన్లు, 8 క్యారం బోర్డులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
రాష్ట్రస్థాయి క్యారం పోటీలకు జిల్లా క్రీడాకారులు
నిజామాబాద్ : జిల్లా క్యారం సంఘం ఆధ్వర్యంలో ఈనెల 10న జిల్లా కేంద్రంలోని హునాని క్యారం కోచింగ్ సెంటర్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు మహారాష్ట్రలో జరుగనున్న ప్రశాంత్ రణాడే స్మారక టోర్నీకి ఈ క్రీడాకారులు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సంతోష్‌కుమార్ ఎంపికైన వారిని శుక్రవారం అభినందించారు. కార్యక్రమంలో నిర్వహణ కార్యదర్శి శశిధర్, జాన్సన్, విజయ్ పాల్గొన్నారు. ఎంపికైన వారి వివరాలు పురుషుల విభాగం : అబ్దుల్, అమీర్, సలీం, నసురుల్లా, షకీర్, గంగాదాస్, మోహినొద్దీన్ మహిళ విభాగం : శ్రీ చందన