
రాష్ట్రస్థాయి క్యారం పోటీలకు జిల్లా క్రీడాకారులు
నిజామాబాద్ : జిల్లా క్యారం సంఘం ఆధ్వర్యంలో ఈనెల 10న జిల్లా కేంద్రంలోని హునాని క్యారం కోచింగ్ సెంటర్‌లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు మహారాష్ట్రలో జరుగనున్న ప్రశాంత్ రణాడే స్మారక టోర్నీకి ఈ క్రీడాకారులు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సంతోష్‌కుమార్ ఎంపికైన వారిని శుక్రవారం అభినందించారు. కార్యక్రమంలో నిర్వహణ కార్యదర్శి శశిధర్, జాన్‌సన్, విజయ్ పాల్గొన్నారు.
ఎంపికైన వారి వివరాలు
పురుషుల విభాగం : అబ్దుల్, అమీర్, సలీం, నసురుల్లా, షకీర్, గంగాదాస్, మోహినొద్దీన్
మహిళ విభాగం : శ్రీ చందన