న్యూఢిల్లీ: లాక్‌డౌన్ వల్ల చిన్ననాటి ఆటలు మళ్లీ ఆడుకునే అవకాశం దొరికింది. అవుట్‌డోర్ గేమ్స్‌కు స్వస్థి పలుకుతూ ఇంట్లో ఆటలకే జై కొడుతున్నారు. అలనాటి ఆటల నుంచి నేటి తరం గేమ్స్ వరకు అన్నింటినీ ఓ పట్టు పడుతున్నారు. అందులో ఏకాగ్రతను పెంచే క్యారమ్, చెస్ వంటి ఆటలు కూడా ఉన్నాయి. మరి క్యారమ్ బోర్డ్ ఆడాలంటే ఏం కావాలి? అన్న ప్రశ్న వస్తే క్యారమ్, కాయిన్స్, వీలైతే కాయిన్స్ సులువుగా జారేందుకు కాసింత పౌడర్ కూడా అని ఠపీమని సమాధానమిస్తారు. అయితే అవేవీ లేకుండా కూడా ఇది ఆడొచ్చంటున్నారు కొంతమంది స్నేహితుల గ్యాంగ్. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది సాధ్యమేనని చేసి నిరూపించారు కూడా. వివరంగా చెప్పాలంటే ఓ వ్యక్తికి పెరట్లో కొద్దిమందితో కలిసి మానవ క్యారమ్ ఆడితే ఎలా ఉంటుంది? అని ఆలోచన తట్టింది. (ప్రాణాలకు తెగించి కాపాడిన కుక్క)
వెంటనే తన ఫ్రెండ్స్‌తో కలిసి మానవ క్యారమ్ బోర్డ్ ఆట ఆడి చూపించాడు. అందుకోసం ఖాళీ నేలపై పెద్దగా క్యారమ్ ఆకారాన్ని గీశాడు. కాకపోతే ఇందులో కాయిన్స్, స్ట్రైకర్‌కు బదులుగా మనుషులను పెట్టాడు. (స్థలాన్ని బట్టి కాయిన్స్ అంటే మనుషుల సంఖ్యను పెంచుకునేందుకు అవకాశం ఉంది) తర్వాత స్ట్రైకర్ స్థానంలో ఓ మనిషిని నిల్చోబెట్టి ఆటగాడు అతడిని ముందుకు తోస్తాడు. అతను కొంచెం వేగంగా తోసిన దిశ వైపుగా వెళతాడు. దీంతో అక్కడ ఎవరైనా మనుషులు(కాయిన్స్) ఉంటే వాళ్లు ముందుకు తోసుకుంటూ వెళ్లి హోల్‌లో పడతారు. ప్రస్తుతం ఈ వెరైటీ క్యారం బోర్డ్ టిక్‌టాక్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా మరో విశేషమేంటంటే క్యారమ్ బోర్డ్ ఆటను మొట్టమొదటి సారిగా భారత్‌లోనే కనుగొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఇది వివిధ దేశాలకు పాకింది. (లాక్‌డౌన్: వాషింగ్ మెషీన్‌లో దాక్కున్న యువతి)
Comments
Please login to add a commentAdd a comment