Ramakant Achrekar
-
సచిన్ భావోద్వేగ ట్వీట్
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన గురువు రమాకాంత్ ఆచ్రేకర్‌కు నివాళులు అర్పించాడు. ఆచ్రేకర్ తొలి వర్ధంతిని పురస్కరించుకుని.. ‘ మీరు ఎల్లప్పుడూ మా గుండెల్లోనే ఉంటారు ఆచ్రేకర్ సర్’ అంటూ భావోద్వేగ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా తన గురువుతో కలిసి దిగిన పాత ఫొటోను షేర్ చేశాడు. ఇక వినోద్ కాంబ్లీ సైతం ఆచ్రేకర్‌ను గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు.. ‘ అసలు మీలాంటి మెంటార్ ఎవరికీ దొరకరు. కేవలం క్రికెట్ ఎలా ఆడాలో నేర్పడమే కాకుండా... నాకు జీవిత పాఠాలు కూడా బోధించారు. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా ఆచ్రేకర్ సర్’ అని ట్వీట్ చేశాడు. కాగా కేవలం ఒకే ఒక ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడినప్పటికీ తదనంతర కాలంలో గొప్ప కోచ్‌గా ఎదిగిన రమాకాంత్ ఆచ్రేకర్ గతేడాది జనవరి 2న కన్నుమూసిన విషయం విదితమే. సచిన్, వినోద్ కాంబ్లి, ప్రవీణ్ ఆమ్రే వంటి ఎంతో మంది క్రికెటర్లను తీర్చిదిద్దిన ఆయనను ద్రోణాచార్య అవార్డు వరించింది. 2010లో ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా దక్కింది. ఇక తనపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి.. స్కూటర్‌పై తనను ప్రాక్టీసుకు తీసుకువెళ్లిన ఆచ్రేకర్ అంటే సచిన్‌కు ఎంతో గౌరవం. ఈ క్రమంలో తనకు ఆచ్రేకర్‌తో ఉన్న అనుబంధం గురించి సచిన్ పలు వేదికలపై చెప్పుకొచ్చాడు. ఆచ్రేకర్ అనారోగ్యంతో బాధ పడుతున్న సమయంలో పలుమార్లు ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పాడు. ఇక వినోద్ కాంబ్లి కూడా వీలు చిక్కినప్పుడల్లా ఆచ్రేకర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటాడు.(చదవండి : నా వీడియోను షేర్ చేసిన సచిన్‌కు థాంక్స్) సచిన్ గురువుగా గుర్తింపు.. దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్‌లో అచ్రేకర్ క్రికెట్ అకాడమీ ఉండేది. ఆయన ఎంత మందికి శిక్షణనిచ్చినా ‘సచిన్ గురువు’గానే క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంది. సచిన్ కూడా తన సుదీర్ఘ కెరీర్లో లెక్క లేనన్ని సార్లు తన గురువును గుర్తు చేసుకునేవాడు. ఓనమాలు నేర్పిన నాటినుంచి తన చివరి టెస్టు ఆడే వరకు ప్రతీ దశలో ఆయన పాత్ర, ప్రభావం గురించి చెప్పడం టెండూల్కర్ ఏనాడూ మర్చిపోలేదు. క్రికెట్లో ఎదగాలంటే అప్పటి వరకు చదువుతున్న న్యూ ఇంగ్లీష్ స్కూల్ నుంచి శారదాశ్రమ్ విద్యామందిర్‌కు మారమని అచ్రేకరే తన శిష్యుడికి సూచించారు. ప్రతి ఏటా గురుపూర్ణిమ రోజున తన గురువును కలిసి ఆశీర్వచనాలు తీసుకోవడం సచిన్ అలవాటుగా ఉండేది. तुमच्या आठवणी आमच्या मनात सदैव राहतील, आचरेकर सर. You will continue to remain in our hearts, Achrekar Sir! pic.twitter.com/IFN0Z6EtAz — Sachin Tendulkar (@sachin_rt) January 2, 2020 No Mentor can ever be as incredible as you are because you did not only teach me to play cricket 🏏 in the best way possible but you also taught me real life lessons. I miss you a lot, Achrekar Sir! pic.twitter.com/UVXKhZZEUo — VINOD KAMBLI (@vinodkambli349) January 2, 2020 -
‘కోచ్ వస్తున్న సంగతి సచిన్ చెప్పలేదు..’
ముంబై : క్రికెట్ లెజెండ్, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పాఠశాల స్మృతుల్ని గుర్తుచేసుకున్నాడు. తన స్కూల్‌మేట్, టీమిండియా మాజీ క్రెకెటర్ వినోద్ కాంబ్లీతో ఉన్న ఓ పాత ఫొటోను ట్విటర్లో శనివారం పోస్టు చేశాడు. తన స్నేహితుడు కాంబ్లీని ముద్దుగా ‘కాంబ్ల్యా’అని పిలుచుకునే సచిన్.. ‘‘కాంబ్ల్యా’ ఈ ఫొటో సంపాదించాడు. ఆ పాత చిలిపి జ్ఞాపకాలు మదిలో మెదిలేలా చేశాడు. స్కూల్ డేస్ అన్నీ ఒక్కసారే కళ్లముందు కదలాడాయి’ అని ట్విటర్ పేర్కొన్నాడు. స్పందించిన కాంబ్లీ.. ఆ ఫొటో వెనకున్న కథ విప్పాడు ‘మాస్టర్..! నేనూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ కైట్ వచ్చి పిచ్ మధ్యలో పడింది. దాన్ని పక్కన పడేసి నా పని నేను చూసుకోకుండా... ఎగరేయడం మొదలెట్టాను. అది గమనించిన మా కోచ్ రమాకాంత్ అచ్రేకర్ నావైపు కోపంగా వస్తున్నారు. ఆయన వస్తున్నది నేను గమనించలేదు. సార్ రావడం చూసినప్పటికీ నువ్ నాకు చెప్పలేదు. అంతే, తర్వాతేం జరగిందో తెలుసుగా..’అని ట్వీట్ చేశాడు. (చదవండి : సచిన్, కాంబ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్) ఇక ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్లు శారదాశ్రమం విద్యామందిర్‌లో పాఠశాల విద్య చదివారు. కోచ్ ఆచ్రేకర్ సూచన మేరకే వారు ఆ స్కూళ్లో చేరడం గమనార్హం. పాఠశాల స్థాయి క్రికెట్ టోర్నీలో 1988, ఫిబ్రవరిలో జరిగిన ఓ మ్యాచ్‌లో 664 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. హరీస్ షీల్డ్ టోర్నీలో సెయింట్ జేవియర్ స్కూల్‌పై ఈ ఘనత సాధించారు. సచిన్ 326 పరుగులు చేయగా.. కాంబ్లీ 349 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. This brought back memories, Master!😀 You remember this one time when we were batting & a kite fell on the pitch. I took the kite & started flying it. You saw Achrekar Sir coming my way but didn’t tell me and we both know what happened next! 😡 🥊 Aathavtay ka? https://t.co/42a0pvoQd3 — VINOD KAMBLI (@vinodkambli349) August 3, 2019 -
‘ఇలా చేసి అచ్రేకర్‌ని అవమానించారు’
ముంబై : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కోచ్, ద్రోణాచార్య పురస్కార గ్రహీత రమాకాంత్ అచ్రేకర్ బుధవారం ముంబైలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే అచ్రేకర్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించలేదంటూ శివసేన పార్టీ.. మహారాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ఇక నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనకుండా బహిష్కరించాలంటూ సచిన్‌ను కోరింది. ఈ సందర్భంగా శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన రమాకాంత్ అచ్రేకర్ అంత్యక్రియలను ఎందుకు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించలేదం’టూ ప్రశ్నించారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం అచ్రేకర్‌ని నిర్లక్ష్యం చేసింది. ఇందుకు నిరసనగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనకుండా సచిన్ వాటిని బహిష్కరించాలి’ అని ఆ పిలుపునిచ్చారు. అచ్రేకర్ మరణానంతరం శివసేన పార్టీ పత్రిక సామ్నాలో ఆయన సేవలను కొనియాడుతూ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. అలాగే ఆయన అంత్యక్రియలు నిర్వహించిన తీరుపై విమర్శలు చేసింది. ఇది క్రికెట్‌కు అచ్రేకర్ చేసిన సేవలను తక్కువ చేయడమే కాకుండా, ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుందని మండిపడింది. శివసేనతో పాటు పలువురు సీనియర్ నాయకులు కూడా ఈ విషయం గురించి అసహనం వ్యక్తం చేశారు. అచ్రేకర్‌కు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం బాధకరం అన్నారు. 87 ఏళ్ల అచ్రేకర్ బుధవారం సాయంత్రం ముంబయిలోని తన స్వగృహంలో కన్నుమూశారు. గత సంవత్సరం గురు పూర్ణిమ రోజున సచిన్.. అచ్రేకర్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. క్రికెట్లో సాధించిన విజయాలకు తన గురువు అందించిన ప్రోత్సాహమే కారణమని ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు సచిన్. Today, #GuruPurnima, is the day we remember those who have taught us to be better versions of ourselves. Achrekar Sir, I couldn’t have done all this without you. 🙏 Don’t forget to thank your gurus and take their blessings. #AtulRanade and I just did. pic.twitter.com/FOS64baoB3 — Sachin Tendulkar (@sachin_rt) July 27, 2018 -
సచిన్ టెండుల్కర్ క్రికెట్ గురువు ఆచ్రేకర్ కన్నుమూత
-
‘దిగ్గజ గురువు’ అస్తమయం
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు అనేక మంది అంతర్జాతీయ, ఫస్ట్ క్లాస్ ఆటగాళ్లను దేశానికి అందించిన ప్రముఖ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కన్ను మూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంత కాలంగా అచ్రేకర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, బుధవారం సాయంత్రం ఆయన మృతి చెందారని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆటగాడిగా తన కెరీర్లో అచ్రేకర్ ఒకే ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడారు. 1964లో హైదరాబాద్‌లో జరిగిన మొయినుద్దౌలా గోల్డ్‌కప్ టోర్నీలో భాగంగా హెచ్‌సీఏ ఎలెవన్‌తో జరిగిన పోరులో ఆయన ఎస్బీఐ తరఫున బరిలోకి దిగారు. కొంత కాలం ముంబై సెలక్టర్‌గా కూడా పని చేశారు. సచిన్‌తో పాటు ఆయన వద్ద శిక్షణ పొందిన వారిలో వినోద్ కాంబ్లీ, ప్రవీణ్ ఆమ్రే, సమీర్ దిఘే, బల్వీందర్ సింగ్ సంధూ, చంద్రకాంత్ పండిత్, అజిత్ అగార్కర్, రమేశ్ పొవార్ అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగారు. శిక్షకుడిగా సేవలకుగాను 1990లో ‘ద్రోణాచార్య’ అవార్డు అందుకున్న అచ్రేకర్‌కు 2010లో ‘పద్మశ్రీ’ పురస్కారం దక్కింది. సచిన్‌కు ఓనమాలు... దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్‌లో అచ్రేకర్ క్రికెట్ అకాడమీ ఉండేది. ఆయన ఎంత మందికి శిక్షణనిచ్చినా ‘సచిన్ గురువు’గానే క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంది. సచిన్ కూడా తన సుదీర్ఘ కెరీర్లో లెక్క లేనన్ని సార్లు తన గురువును గుర్తు చేసుకునేవాడు. ఓనమాలు నేర్పిన నాటినుంచి తన చివరి టెస్టు ఆడే వరకు ప్రతీ దశలో ఆయన పాత్ర, ప్రభావం గురించి చెప్పడం టెండూల్కర్ ఏనాడూ మర్చిపోలేదు. క్రికెట్లో ఎదగాలంటే అప్పటి వరకు చదువుతున్న న్యూ ఇంగ్లీష్ స్కూల్ నుంచి శారదాశ్రమ్ విద్యామందిర్‌కు మారమని అచ్రేకరే తన శిష్యుడికి సూచించారు. ప్రతి ఏటా గురుపూర్ణిమ రోజున తన గురువును కలిసి ఆశీర్వచనాలు తీసుకోవడం సచిన్ అలవాటుగా మార్చుకున్నాడు. సర్ శిక్షణ ఇచ్చిన చాలా మంది విద్యార్థుల్లాగే నేను కూడా ఆయన దగ్గరే క్రికెట్లో ఏబీసీడీలు నేర్చుకున్నాను. నా జీవితంలో ఆయన పోషించిన పాత్ర గురించి మాటల్లో చెప్పడం కష్టం. ఆయన వేసిన పునాదిపైనే నేను నిలబడ్డాను. సర్ వద్ద శిక్షణ తీసుకున్న మరికొందరితో కలిసి గత నెలలో ఆయనను కలిశాం. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపాం. నేరుగా ఆడటమే కాదు తప్పులు చేయకుండా నిజాయతీగా బతకడం కూడా అచ్రేకర్ సర్ నేర్పించారు. మీ కోచింగ్‌తో మమ్మల్ని మీలో ఒకడిగా చేసుకున్నందుకు కృతజ్ఞతలు. జీవితంలోనూ చాలా బాగా ఆడారు సర్. మీరు ఎక్కడ ఉన్నా కోచింగ్ ఇస్తూనే ఉంటారు. మీ వల్ల స్వర్గంలో కూడా క్రికెట్ వికసిల్లుతుంది. – సచిన్ టెండూల్కర్ నివాళి -
సచిన్ గురువు అచ్రేకర్ ఇకలేరు
ముంబై: క్రికెట్ దిగ్గజం, సచిన్ టెండూల్కర్ గురువు రమాకాంత్ అచ్రేకర్(87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ముంబైలో దాదార్‌లోని శివాజీరాజ్ పార్కులో రమాకాంత్ ఎందరో యువ క్రికెటర్లకు కోచింగ్ ఇచ్చేవారు. లెజండరీ క్రికెట్ కోచ్‌గా పేరుగాంచిన అచ్రేకర్ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ వంటి దిగ్గజ క్రికెటర్లను తీర్చిదిద్దారు. క్రికెట్ రంగంలో అసమాన సేవలందించినందుకు గాను కేంద్రప్రభుత్వం ఆయనకు 1990లో ద్రోణాచార్య అవార్డుతో, 2010లో పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. అంతేకాకుండా ముంబైలోని జింఖాన శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా అచ్రేకర్ కు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ ను అందజేశారు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ సుధీర్ఘ కాలం పాటు కొనసాగడంలో అచ్రేకర్ పాత్ర ఎనలేనిది. గురుపౌర్ణిమ సందర్భంగా అందరూ గుడికి వెళ్లి దేవుడ్ని దర్శించుకుంటే.. సచిన్ మాత్రం తన గురువైన రమాకాంత్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటాడు. అచ్రేకర్ మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. The BCCI expresses its deepest sympathy on the passing of Dronacharya award-winning guru Shri Ramakant Achrekar. Not only did he produce great cricketers, but also trained them to be fine human beings. His contribution to Indian Cricket has been immense. pic.twitter.com/mK0nQODo6b — BCCI (@BCCI) January 2, 2019 -
సచిన్ ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ఆవిష్కరణ
-
ఇదిగో... దేవుడి ‘ఆత్మకథ'
సచిన్ ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ఆవిష్కరణ హాజరైన మాజీ క్రికెటర్లు, సన్నిహితులు ముంబై: విడుదలకు ముందే ఎన్నో సంచలనాలకు కేంద్రంగా నిలిచిన, ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ఇప్పుడు అభిమానుల చేతికి చేరింది. క్రికెట్ దిగ్గజం సచిన్ ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. దీనిని స్వయంగా విడుదల చేసిన సచిన్.... కూతురు సారా చేతుల మీదుగా అందరికంటే ముందు తన గురువు రమాకాంత్ అచ్రేకర్‌కు అందించాడు. అంతకు ముందు తన ఇంట్లో తొలి కాపీని తల్లి రజని టెండూల్కర్‌కు అందజేశాడు. ‘నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి ముందుగా ఈ పుస్తకం అందజేస్తున్నా’ అని ఈ సందర్భంగా సచిన్ ప్రకటించాడు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన హర్షా భోగ్లే, మూడు భాగాలుగా, ఆసక్తికరంగా చర్చను నిర్వహించాడు. మొదటి ప్యానెల్లో మాజీ ఆటగాడు గవాస్కర్, రవిశాస్త్రి, వెంగ్‌సర్కార్, వాసు పరాంజపే ఉండగా, రెండో ప్యానెల్లో సహచరులు ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్‌లు...మూడో ప్యానెల్లో భార్య అంజలి, సోదరుడు అజిత్‌లతో ఈ చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా వీరంతా సచిన్‌తో తమకు ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తొలి కాపీ తల్లికి... పుస్తకం విడుదల కార్యక్రమానికి ముందే సచిన్ తన ఆత్మకథ తొలి కాపీని తల్లి రజనీకి అందించాడు. ‘పుస్తకం తొలి కాపీని మా అమ్మకు ఇచ్చాను. ఆ సమయంలో తన ఆనందం వెలకట్టలేనిది’ అని సచిన్ పేర్కొన్నాడు.