
చిన్న పాము కనిపిస్తేనే భయంతో వణికిపోతాం. అమాంతం అక్కడి నుంచి పారిపోతాం. మళ్లీ కొద్ది రోజుల వరకు ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసించం. అయితే రోడ్డుపై ఒక వ్యక్తి చేతిలో కొండచిలువ, భుజంపై రామ చిలుకతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని చోటుచేసుకొంది. వివరాలు.. ఒక రోజు హేలీరోబిన్ అనే మహిళ తన మిత్రులతో కోసం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి చూస్తొంది. అప్పుడు రోడ్డుకు ఆవల ఉన్న ఒక వ్యక్తిని చూసి, ఆశ్చర్యపోయింది. వెంటనే తన చేతిలోని మొబైల్ తీసుకొని రికార్డు చేసింది..
కాగా, ఒక వ్యక్తి తన చేతిలో ఒక పెద్ద కొండచిలువను, భుజంపై రామచిలుకతో ఎంచక్కా నడుచుకొంటు వెళ్తున్నాడు. అతడిలో ఏమాత్రం భయంలేదు. తీరిగ్గా డ్యాన్స్ చేసుకొంటూ, ఫోన్ బయటకు తీసి మాట్లాడుకొంటూ వెళ్తున్నాడు. కొండ చిలువను ఒక చేతిలో నుంచి మరొక చేతిలోకి మార్చుకొంటూ ఏదో బటన్ నొక్కాల్సి వచ్చిన క్రమంలో కొండ చిలువను కిందపడేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది. దీన్ని చూసిన నెటిజన్లు ఏదో ర్యాంప్వాక్ చేస్తున్నట్లు ఏంటా నడక అని సరదా కామెంట్లు పెడుతున్నారు
చదవండి: బాత్రూమ్‌లో ఐదడుగుల కొండచిలువ
Comments
Please login to add a commentAdd a comment