
న్యూఢిల్లీ : గురుగ్రామ్‌కు చెందిన 35ఏళ్ల మహిళ టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్లింది. గ్యాస్‌స్టవ్ వెలిగించడానికి పక్కనే ఉన్న లైటర్‌ను చేతిలోకి తీసుకుని వెలిగించే ప్రయత్నం చేసింది. వంటగదిలోని ఓ మూలనుంచి శబ్ధం రావటంతో అటుచూసింది. అంతే ఒక్కసారిగా ఆమె వెన్నులో ఒనుకు పుట్టింది. ఏకంగా 5అడుగుల కొండచిలువను వంటగదిలో చూడటంతో ఆమె నోటమాట రాలేదు. కొద్దిసేపటికి తేరుకున్న ఆమె వంటగదిలో కొండచిలువ ఉన్న సంగతి భర్తకు, పక్కింటి వాళ్లకు చెప్పింది.
అందరూ ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. అంత మంది ఉన్నా ఒక్కరు కూడా పాము దగ్గరగా వెళ్లిచూసే ప్రయత్నం చేయలేదు. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని భావించిన ఇంటియాజమాని వణ్యప్రాణి సంరక్షణా సిబ్బందికి ఫోన్ చేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న వారు దాన్ని ఇండియన్ రాక్ పైథాన్‌గా గుర్తించారు. కొండచిలువను పట్టి సంచిలో వేసుకుని అడవిలో వదిలిపెట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment