
చెన్నై: థాయ్‌ల్యాండ్ దేశం నుంచి చెన్నైకి తీసుకువచ్చిన కొండచిలువలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని తిరిగి ఆ దేశానికి తరలించారు. వాటిని తీసుకువచ్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి థాయ్‌ల్యాండ్ దేశం నుంచి వచ్చిన విమానంలో విలువైన వస్తువులు తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ప్రయాణికులపై నిఘా పెట్టారు.
ఆ సమయంలో థాయ్‌ల్యాండ్‌కు పర్యాటక వీసాలో వెళ్లి చెన్నైకి వచ్చినా దిండుగల్‌కు చెందిన వివేక్ (29) వద్ద తనిఖీ చేయగా, ఐదు కొండ చిలువ పిల్లలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు తిరిగి థాయ్‌ల్యాండ్‌కు పంపించారు. వివేక్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ విషయం ప్రయాణికులకు తెలియడంతో షాకయ్యారు.
చదవండి: Flipkart: కొత్త సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఆఫర్లు, డిస్కౌంట్ల విషయంలో తగ్గేదేలే!
Comments
Please login to add a commentAdd a comment