
అమెరికాలో భారీ పైథాన్‌ను ఓ యువకుడు పట్టుకున్నాడు. ఇది దాదాపు 19 అడుగుల పొడవు ఉంది. 56.6 కేజీల బరువు ఉంది. ఫ్లోరిడాలో ఓహియో యూనివర్శిటీకి చెందిన ఓ యువకుడు(22) దీన్ని సాహసంతో పట్టుకున్నాడు. అనంతరం అటవీ అధికారులకు అప్పగించారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. తెగ వైరల్‌గా మారింది.
యువకులు రోడ్డుపై వెళుతుండగా.. ఓ పెద్ద పైథాన్ వారిని అడ్డగించింది. భయపడిన యువకులు కాసేపు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇక లాభం లేకపోవడంతో ఓ యువకుడు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే అతని స్నేహితులు కూడా సహాయం చేయగా.. అందరూ కలిసి దాన్ని పట్టుకున్నారు. పైథాన్‌ను పట్టుకునే క్రమంలో ఆ యువకుడు పెద్ద యుద్దమే చేశాడు. కిందపడినప్పటికీ దాని తలను మాత్రం వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు.
దక్షిణ ఫ్లోరిడాలో పైథాన్‌లు ఎక్కువగా ఉంటాయని అటవీ అధికారులు తెలిపారు. 2020 అక్టోబర్‌లో 18 అడుగులు ఉన్న అత్యంత పెద్దదైనా బర్మీస్ పైథాన్ వెలుగులోకి వచ్చిందని వెల్లడించారు. ఆ తర్వాత ఇదే అత్యంత పెద్ద పైథాన్‌గా గుర్తించారు. రాత్రి సమయాల్లో సాధారణంగా రోడ్డుపైకి వస్తుంటాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. ఇప్పుడిది అవసరమా?
Comments
Please login to add a commentAdd a comment