పేద్ద.. కొండచిలువ..!
విజయపురి సౌత్: స్థానిక ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ స్టూడెంట్స్ శనివారం రాత్రి 9 అడుగుల కొండచిలువను పట్టుకున్నారు. విజయపురిసౌత్‌లోని లంకమోడులో నివాసగృహాల వద్దకు కొండచిలువ వచ్చిందన్న సమాచారాన్ని అక్కడి స్థానికులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ స్టూడెంట్స్‌కు తెలిపారు. దీంతో వారు అక్కడికి చేరుకొని కొండచిలువను పట్టి అడవిలో వదిలేశారు.