Vijayapuri South
-
బెల్టుతో వాతలు తేలేలా కొట్టి.. ఎస్సై వాసు ఓవరాక్షన్!
సాక్షి, గుంటూరు: విజయపురి సౌత్ ఎస్సై వాసు ఓవరాక్షన్ కలకలం రేపుతోంది. ఎస్సై వాసు ఓ సివిల్ కేసులో తలదూర్చి ఒక వర్గానికి కొమ్ముకాస్తుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సివిల్ కేసుకు సంబంధించి మట్టపల్లి శ్రీనివాసరావు అనే యువకుడిని పోలీసు స్టేషన్‌కు పిలిచి ఎస్సై బెల్టుతో చితకబాదాడు. దీంతో శ్రీనివాసరావుకు ఒళ్లంతా వాతాలు తేలాయి. ఈ నొప్పుల బాధ, అవమానం తట్టుకోలేక అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో బాధితుడిని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. -
అనుపు సంబరం
-
పేద్ద.. కొండచిలువ..!
విజయపురి సౌత్: స్థానిక ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ స్టూడెంట్స్ శనివారం రాత్రి 9 అడుగుల కొండచిలువను పట్టుకున్నారు. విజయపురిసౌత్‌లోని లంకమోడులో నివాసగృహాల వద్దకు కొండచిలువ వచ్చిందన్న సమాచారాన్ని అక్కడి స్థానికులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ స్టూడెంట్స్‌కు తెలిపారు. దీంతో వారు అక్కడికి చేరుకొని కొండచిలువను పట్టి అడవిలో వదిలేశారు. -
సీతారామాలయ స్వర్ణోత్సవాలు
కనుల పండువగా జల కలశాల ఊరేగింపు విజయపురిసౌత్: సీతారామాలయంలో ఆరు రోజులుగా జరుగుతున్న స్వర్ణోత్సవాలు గురువారం ముగిశాయి. చివరిరోజు ఉదయం 7గంటలకు 108 మంది భక్తులు మేళతాళాల నడుమ కృష్ణవేణి ఘాట్ నుంచి సాగర జలకలశములతో ఊరేగింపు జరిపారు. అనంతరం మహా కుంభాభిషేకం, అవబృధోత్సవం, మహాపూర్ణాహుతి జరిపారు. 11గంటలకు ఆలయంలో సీతారామ కల్యాణం నిర్వహించారు. అనంతరం 3వేల మంది భక్తులకు అన్నదాన ం నిర్వహించారు. రాత్రి 7గంటలకు పుష్పయాగం, సహస్ర దీపాలంకరణ సేవ, మహదాశీర్వచనము, ఆచార్య సన్మానము, యజ్ఞశాలలో శ్రీరామ నామ తారక మహామంత్రజప, తర్పణ యజ్ఞములు జరిపారు. తరువాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.చంద్రశేఖరరెడ్డి, కార్యదర్శి కె.వసంతకుమార్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు సిహెచ్.నాగిరెడ్డి, కోశాధికారి కె.సత్యనారాయణ, రిటైర్డ్ సీఈ పరంధామరెడ్డి, కమిటీ సభ్యులు అల్లు వెంకటరెడ్డి, జీవీజీ కృష్ణమూర్తి, జి.అమర్‌కుమార్, ఎం.రామాంజనేయులు , ఎ.నాగరాజు, ఏడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
విజయపురి వెలవెల
విజయపురిసౌత్ : కృష్ణా పుష్కరాలకు విజయపురిసౌత్‌లోని ప్రధాన పుష్కరఘాటైన కృష్ణవేణి పుష్కర ఘాట్‌కు ప్రతిరోజు 40 నుంచి 50 వేల మంది వస్తారని అధికారులు అంచనావేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక కోసం అటెన్షన్లో ఉన్నారు. ప్రారంభంలో 200 మందికి మించి భక్తులు రాలేదు. తరువాత వస్తారని ఎదురుచూసినా గంటగంటకు భక్తులు నామమాత్రంగానే వచ్చారు. వందల సంఖ్యకే పరిమితమై సాయంత్రం 4 గంటల వరకు 1,000 మందికి మించి భక్తులు రాకపోవడంతో అంచనాలు తారుమారు కావడంపై అధికారులు ఆలోచనలో పడ్డారు. భక్తుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారిగేట్లను తాత్కాలికంగా తొలగించారు. ఉదయం నుంచి భక్తుల ఒత్తిడి లేకపోవడంతో అధికారులు కూడా వచ్చిన భక్తులకు ఎదో ఒక సూచనలు అందిస్తూ కాలం గడిపారు. విజయపురిసౌత్‌లో కీలకమైన కృష్ణవేణి పుష్కరఘాట్‌కు రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఎం చంద్రబాబు సందర్శించే అవకాశం ఉందని స్పెషల్ ఆఫీసర్ బాలాజీనాయక్ తెలిపారు. భక్తుల రాక తక్కువుగా ఉండటంతో లాంచీస్టేషన్ ప్రధాన రహదారి వెలవెలబోయింది. -
గురుకుల కళాశాలలో విద్యార్థుల ఘర్షణ
గుంటూరు జిల్లా మాచర్ల మండలంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విజయపురి సౌత్‌లోని ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాలలో సైన్స్ - ఆర్ట్స్ విద్యార్థులు గొడవపడ్డారు.దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కళాశాల వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
వలస బాటలో మత్స్యకారులు
కృష్ణానదిని నమ్ముకొని ఏటి ఒడ్డున బతుకుతున్న మత్స్యకారుల జీవితాలు నానాటికి మసకబారుతున్నాయి. ఐదు దశాబ్దాల కిందట పొట్ట చేతబట్టుకొని విశాఖ నుంచి విజయపురిసౌత్ వచ్చిన మత్స్యకారులు ప్రస్తుతం పలు అవస్థలు పడుతున్నారు. రోజు మొత్తం షికారు (వేట) చేసినా చేపలు చిక్కని దైన్యస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మత్స్యశాఖ గత రెండు ఏళ్ళుగా సాగర్ జలాశయంలో చేపపిల్లలను వదలక పోవటంతో షికారు జరగక మత్స్యకారుల కుటుంబాలు అల్లాడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందక వలస బాటపట్టాయి. విజయపురిసౌత్, న్యూస్‌లైన్ : విజయపురిసౌత్‌లోని డౌన్‌మార్కెట్, సాగర్ క్యాంప్‌లలో సుమారు 500 మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరికి చేపల వేటే ప్రధాన పోషణ. వీరిలో సగం మందికి పక్కా గృహాలు కూడా లేవు. చేపల వ్యాపారుల వద్ద కుటుంబ పోషణకు అడ్వాన్స్‌లు తీసుకొని చేపలను వారికే అమ్ముతుంటారు. ప్రతి ఏటా 50 నుంచి 60 లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు గుంటూరు, నల్లగొండ జిల్లాల్లోని నాగార్జునసాగర్ జలాశయంలో ఇరువైపుల వదులుతుండేవారు. రెండేళ్లుగా చేప పిల్లలను వదలకపోవడంతో వారి జీవనోపాధి దెబ్బతింది. సహజంగా కుటుంబంలోని మగవారంతా షికారు (చేపల వేట) చేస్తారు. అనంతరం వచ్చిన చేపలను వేరు చేసేందుకు మహిళలు సహకరిస్తారు. పెద్ద చేపలను విక్రయించి చిన్న చేపలను ఎండబెట్టడం, కూర వండుకోవటం చేస్తుంటారు. వీరంతా ప్రతి రోజు చేపలతోనే భోజనం చేస్తారు. షికారు జరగని రోజు ఏటి ఒడ్డునే పస్తులు ఉంటారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యాం భద్రతా దృష్ట్యా కృష్ణా జలాశయం ఒడ్డున ఉన్న లాంచీస్టేషన్ నుంచి సాగర్మాత దేవాలయం వరకు ప్రభుత్వం సేఫ్టీవాల్ నిర్మాణం చేపట్టడంతో మత్స్యకారులు చేపలు షికారు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరో రెండు మూడు నెలల్లో సేఫ్టీవాల్ నిర్మాణం పూర్తయితే కృష్ణా జలాశయంలోకి పుట్టీలతో ఎలా దిగాలని మత్స్యకారులు వాపోతున్నారు. దీనికి తోడు గత రెండు సంవత్సరాలుగా జలాశయంలో చేపపిల్లలను వదలక పోవటంతో చేపల వేట లేక సుమారు 200 మత్స్యకార కుటుంబాలు పుట్టీలతో సహా వివిధ ప్రాంతాలకు జీవనం కోసం తరలివెళ్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట, ఆల్మట్టి, మన రాష్ట్రంలోని వైజాగ్, కరీంనగర్, తుంగభద్ర ప్రాంతాలకు తరలివెళ్తున్నట్లు మత్స్యకారులు పేర్కొన్నారు.చేపపిల్లలను వదలలేదు... కృష్ణా జలాశయంలో గత రెండు ఏళ్ళుగా చేపపిల్లలను వదలక పోవటం వాస్తవమే. ప్రపంచ బ్యాంక్ నిధులతో 40 లక్షల చేపపిల్లలను వదలాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక లోపాల వల్ల జరగలేదు. తిరిగి టెండర్లు పిలిచి జలాశయంలో చేపపిల్లలను వదులుతాం. మత్స్యకారుల అభివృద్ధి కోసం పొదుపు పథకాలు, దేశాలమ్మ గుడి వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, జెట్టీల నిర్మాణం, చేపల మార్కెట్ల నిర్మాణం చేపడుతున్నాం. - బల రాం, జిల్లా మత్స్యశాఖ డీడీ