
సాక్షి, నారాయణవనం(చిత్తూరు) : స్థానికంగా బుధవారం సాయంత్రం ఓ కొండచిలువ హల్‌చల్ చేసింది. స్థానిక పశువైద్యశాల సమీపంలో నీరులేని బావిలో రెండు నాగుపాము పిల్లలతో పాటు పెద్ద కొండచిలువను గ్రామస్తులు గుర్తించారు. బావి నుంచి బయటకు వచ్చిన కొండచిలువ పిల్ల పక్కనే ఉన్న మహమ్మద్‌కు చెందిన మేకపిల్లను మింగడానికి ప్రయత్నించింది. యజమాని చాకచక్యంతో మేకపిల్లను కాపాడి, పుత్తూరు అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేశారు. వారు స్పందించకపోవడంతో కొండచిలువను సమీపంలోని అరుణానదిలో ముళ్లపొదల్లో వదిలేసినట్లు ఆయన చెప్పారు.