
చిత్తూరు, కేవీబీపురం : గొర్రెల పాకలో కొండచిలువ కలకలం సృష్టించింది. మండలంలోని పూడిసీకేపురం గ్రామానికి చెందిన రైతుకు సుమారు 40 గొర్రెలు ఉన్నాయి. రోజు వారీగా గొర్రెలను మేపుకుని ఇంటివద్దనున్న పాకలో తోలాడు. కొంత సమయానికే పాకలో అలజడి మొదలైంది. గొర్రెలు అరవడం ప్రారంభించాయి. పరిశీలించగా సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించింది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా తిరగబడడంతో కొట్టిచంపేశాడు. భారీ కొండ చిలువను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.