
రాజేంద్రనగర్: అత్తాపూర్ హసన్‌నగర్‌లో సోమవారం రాత్రి భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ప్రధాన రహదారిపై ఉన్న లారీ పార్కింగ్ అడ్డా వద్ద కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో హసన్‌నగర్ లారీ అడ్డా వద్ద డ్రైవర్లు, క్లీనర్లు రోడ్డు పక్కన నిలుచుని ముచ్చటిస్తున్నారు.
ఇదే సమయంలో ఏడు అడుగుల భారీ కొండ చిలువ లారీల మధ్య నుంచి వెళుతుండగా గుర్తించిన వారు భయంతో పరుగులు పెట్టారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు స్నేక్ సొసైటీ సభ్యుడు జావిద్‌ను రప్పించి కొండచిలువను పట్టుకున్నారు. మంగళవారం కొండచిలువను జూపార్కు అధికారులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment