
కాన్బెర్రా: సాధారణంగా మనలో చాలా మంది పాములంటే తెగ భయపడిపోతుంటారు. ఒకవేళ పొరపాటున కంటపడితే వెంటనే అక్కడి నుంచి మాయమైపోతారు. ఆ తర్వాత అక్కడి, దరిదాపుల్లోకి వెళ్లటానికి సాహసం చేయరన్న విషయం తెలిసిందే. అయితే, ఒక్కొసారి పాములు, కొండ చిలువలు ఆహరం కోసం లేదా ఆవాసం కోసం మనిషి ఇళ్లలోనికి ప్రవేశిస్తున్న సంఘటనలను మనం తరచుగా చూస్తునే ఉంటాం. అయితే, తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి ఆస్ట్రేలియాలో జరిగింది.
వివరాలు.. కాన్బెర్రాలోని గ్రాజ్‌లో 65 ఏళ్ల ఒక వ్యక్తి ఉదయం 5 గంటలకు నిద్రలేచాడు. ప్రతిరోజు మాదిరిగా తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూంకు వెళ్లాడు. ఈ క్రమంలో గత సోమవారం అతడు ఒక షాకింగ్ సంఘటన ఎదుర్కొన్నాడు. బాత్రూంలో కూర్చున్నప్పుడు ఒక కొండ చిలువ మూత్ర విసర్జన చేసే ప్రాంతంలో కాటు వేసింది. దీంతో షాక్ కు గురైన ఆవ్యక్తి తేరుకుని వెంటనే బేసిన్ కింద చూశాడు. అక్కడ 5 అడుగుల కొండ చిలువను చూసి భయంతో వణికిపోయాడు. వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు.
ఆ తర్వాత జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే, తన ఇంటిపక్కన ఉండే 24 ఏళ్ల యువకుడు కొండ చిలువల్ని, పాములను పెంచుతున్నాడని గుర్తించారు. అతని అపార్ట్ మెంట్లో దాదాపు 11 రకాల విషపూరిత పాములు ఉన్నాయని పోలీసులు కనుగొన్నారు. అయితే, ఈ కొండ చిలువ కాటుతో ప్రాణానికి పెద్దగా ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు. ఆ వృద్ధుడిని, కాటు వేసిన కొండ చిలువ కొన్ని రోజుల ముందు తప్పిపోయిందని ఆ యువకుడు విచారణలో తెలిపాడు.
కొండ చిలువ బాత్రూంలో కాటువేసిన తర్వాత అది కాలువ లోనికి వెళ్లి తప్పించుకుంది.ఆ యువకుడు నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వెంటనే పాములను పట్టేవారికి సమాచారం అందించారు. కాగా, ఆగ్నేయాసియాలో ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువలు ఉంటాయి. ఇవి మానవులకు పెద్దగా హని కల్గించవు.
Comments
Please login to add a commentAdd a comment