
బీజింగ్ : సీరియస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అనుకోని అతిథి అది కూడా ఆ సమావేశంతో సంబంధం లేని వారు వస్తే కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. ఆ అతిథి కాస్తా ఏ పామో, పులో అయితే ఆ పరిస్థితి ఇక వర్ణణాతీతం. మీటింగ్ సంగతి దేవుడేరుగు ముందైతే కాలుకి బుద్ధి చెప్పి పరుగందుంకుంటారు. ఇలాంటి సంఘటనే జరిగింది చైనాలో. వివరాలు.. చైనా నాన్నింగ్ సిటీలోని ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంకు సిబ్బంది మీటింగ్‌లో భాగంగా సమావేశమయ్యారు.
మీటింగ్ జరుగుతుండగా.. ఇంతలో ఆ గదిలోని పైకప్పు నుంచి ఓ ఐదు అడుగుల పైథాన్ కిందపడిపోయింది. ఇద్దరు ఉద్యోగుల మధ్య పైథాన్ పడడంతో.. సిబ్బంది అందరూ భయంతో పరుగులు పెట్టారు. ఈ గందరగోళానికి జడిసిన ఆ పైథాన్ కూడా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ లోపు సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు బ్యాంకు వద్దకు చేరుకుని.. ఆ పైథాన్‌ను పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. అక్కడ ఉన్న సీసీ టీవీలో ఈ దృశ్యాలన్ని రికార్డయ్యాయి. దాంతో ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment