బీజింగ్: లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవుల వివాదం కొనసాగుతున్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మిజ్జు 5 రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లారు. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరపడంతో పాటు పలు అంశాల్లో చైనాతో ఒప్పందాలు చేసుకోనున్నారు. సోమవారం ఉదయం చైనా చేరుకున్న మిజ్జు దంపతులకు చైనా సీనియర్ అధికారుల బృందం స్వాగతం పలికింది.
‘చైనా,మాల్దీవుల మధ్య సంబంధాలు ప్రస్తుతం అత్యున్నత స్థితికి చేరుకున్నాయి. మాల్దీవుల అధ్యక్షుడి చైనా పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థితికి వెళ్లనున్నాయి’అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ చెప్పారు.
కాగా,లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం రేగిన విషయం తెలిసిందే.దీంతో భారత పర్యాటకులు మూకుమ్మడిగా మాల్దీవుల పర్యటనలు రద్దు చేసుకోవడంతో పాటు సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవ్స్ పిలుపునిచ్చారు. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment