మాలె: భారత్, మాల్దీవుల వివాదం తర్వాత మాల్దీవుల పర్యాటకంలో భారత్ వాటా తగ్గిపోయింది. గతంలో మాల్దీవుల విదేశీ పర్యాటకంలో మూడవ స్థానంలో ఉండే భారత్ వివాదం అనంతరం ఐదవ స్థానానికి పడిపోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో మాల్దీవుల టూరిజంలో భారత దేశ వాటా 7.1 శాతంగా ఉండి 3వ స్థానంలో ఉంది.
ఇదే సమయంలో చైనా కనీసం మాల్దీవుల టూరిజంలో అధిక వాటా కలిగిన దేశాల జాబితాలో కనీసం టాప్ టెన్‌లో కూడా లేదు. అలాంటిది వివాదం తర్వాత మాల్దీవుల టూరిజంలో చైనా, బ్రిటన్‌ల వాటా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు చైనా మూడవ స్థానానికి, బ్రిటన్ అయిదవ స్థానానికి ఎగబాకాయి.
జనవరి 2వ తేదీన ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. దీనిపై మాల్దీవుల మంత్రులు బహిరంగ విమర్శలు చేశారు. దీంతో భారత పర్యాటకుల్లో చాలా మంది మాల్దీవుల టూర్లు రద్దు చేసుకున్నారు. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు ట్రెండింగ్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment