presidents
-
రెండు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్ నియమితులయ్యారు.జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్‌రామ్‌లను నియమించారు.కాగా, పార్టీ నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న(శుక్రవారం) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే -
నాలుగు జిల్లాలకు కొత్త అధ్యక్షులు వీళ్ళే
-
4 జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బూడి ముత్యాల నాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా నందిగం సురేష్, పార్టీ పీఏసీ మెంబర్‌గా ఆదిమూలపు సురేష్, విశాఖపట్నం (వెస్ట్) అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మళ్ళా విజయప్రసాద్.. పార్టీ పీఏసీ మెంబర్‌గా, రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షురాలిగా కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి నియమితులయ్యారు.ఇదీ చదవండి: నీ ఉడత ఊపులకు భయపడం.. పవన్‌కు పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్కాగా, నిన్న(బుధవారం) మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ నియమితులయ్యారు. గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని నియమించారు. వెలంపల్లి శ్రీనివాసరావును పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా నియమించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్‌రెడ్డి (వేమారెడ్డి), పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్‌కుమార్ నియమితులయ్యారు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్.. గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాలరెడ్డి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్‌రెడ్డి నియమితులయ్యారు.వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: చంద్రబాబు పాపాలు కడిగేందుకే పూజలు: పేర్నినాని -
మరో మూడు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. మరో మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులుగా శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.ఇదీ చదవండి: ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్కాగా, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, (ఎమ్మెల్సీ), నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఖలీల్ అహ్మద్ నియమితులయిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధనరెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ముదునూరి ప్రసాదరాజు నియమితులయ్యారు.నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, (ఎమ్మెల్సీ), నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఖలీల్ అహ్మద్ నియమితులయ్యారు.కాగా, తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో నెల్లూరు, పల్నాడు జిల్లాల నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో వైఎస్ జగన్ చర్చించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: నిండా ముంచేసి.. అరకొర సాయమంటే ఎలా బాబూ?: వైఎస్సార్సీపీ -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా, అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు.పలు విభాగాలకు అధ్యక్షులు వీరే..మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డిఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్బాషాపంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డిమున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జునయాదవ్వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతంరెడ్డిలీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్రెడ్డిసాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉషఐటీ విభాగం అధ్యక్షుడిగా పోసమరెడ్డి సునిల్వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్‌రాజు గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తి వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలు.. రామచంద్రారెడ్డి (ప్రైవేట్ స్కూళ్లు)ని, చంద్రశేఖర్‌రెడ్డి (గవర్నమెంట్ స్కూళ్లు) అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు. -
కీలక పదవులకు అధ్యక్షులను నియమించిన వైఎస్ జగన్
-
Boycott Maldives: భారత్‌తో వివాదం వేళ చైనాకు మాల్దీవుల అధ్యక్షుడు
బీజింగ్: లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవుల వివాదం కొనసాగుతున్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మిజ్జు 5 రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లారు. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరపడంతో పాటు పలు అంశాల్లో చైనాతో ఒప్పందాలు చేసుకోనున్నారు. సోమవారం ఉదయం చైనా చేరుకున్న మిజ్జు దంపతులకు చైనా సీనియర్ అధికారుల బృందం స్వాగతం పలికింది. ‘చైనా,మాల్దీవుల మధ్య సంబంధాలు ప్రస్తుతం అత్యున్నత స్థితికి చేరుకున్నాయి. మాల్దీవుల అధ్యక్షుడి చైనా పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థితికి వెళ్లనున్నాయి’అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చెప్పారు. కాగా,లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం రేగిన విషయం తెలిసిందే.దీంతో భారత పర్యాటకులు మూకుమ్మడిగా మాల్దీవుల పర్యటనలు రద్దు చేసుకోవడంతో పాటు సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవ్స్ పిలుపునిచ్చారు. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్‌గా మారింది. ఇదీచదవండి.. ప్రధాని మోదీపై వ్యాఖ్యలు సిగ్గుచేటు -
‘అధ్యక్షులు’ అసెంబ్లీకే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లోపు అసెంబ్లీ ఎన్నికల ఘట్టం పూర్తి కావాల్సి ఉంది. దీంతో రాష్ట్రంలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు తమ సీట్లను ఖరారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. కొందరు ఇప్పటికే నియోజకవర్గాల్లో పని ప్రారంభించగా, మరికొందరు తాము పోటీ చేసే స్థానాలను నిర్ధారించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశాన్ని పక్కన పెడితే.. వామపక్ష పార్టీల కార్యదర్శులతో సహా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులందరూ (ఎంఐఎం మినహా) ఈసారి అసెంబ్లీకి పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలం అవుతున్న ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారని పార్టీవర్గాలు చెబుతుండగా.. ఎంపీలుగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లీ బరిలో దిగడం ఖాయంగా కన్పిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మూడు, నాలుగు నెలలకు పార్లమెంటు ఎన్నికలు జరగనుండడంతో, ముందు అసెంబ్లీకి పోటీ చేసి ఆ తర్వాతి పరిస్థితులను బట్టి లోక్‌సభ బరిలో దిగే అంశాన్ని వీరు పరిశీలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సహా వివిధ పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నవారు ఏయే నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే చర్చ ప్రారంభమైంది. ఈసారి కూడా గజ్వేల్ నుంచే.. సీఎం కేసీఆర్ ఈసారి కూడా గజ్వేల్ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేయనున్నారని తెలంగాణ భవన్ వర్గాలు చెపుతున్నాయి. జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపించే నాటికి మారే రాజకీయ సమీకరణల ప్రకారం అవసరమైతే మెదక్ నుంచి ఆయన లోక్‌సభకు పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈసారి దుబ్బాక అసెంబ్లీకి పోటీ చేయనుండడం, పార్టీ ఏర్పాటైన నాటి నుంచి మెదక్ ఎంపీ స్థానం టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న నేపథ్యంలో అవసరమనుకుంటే కేసీఆర్ అక్కడి నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. రసకందాయంలో కొడంగల్ రేవంత్‌రెడ్డి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ స్థానం నుంచే పోటీ చేస్తారనే భావన కాంగ్రెస్ వర్గాల్లో ఉండేది. అయితే అక్కడ బీఆర్ఎస్ అసంతృప్త నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి కాంగ్రెస్ గూటిలో చేరడంతో అక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గుర్నాథ్రెడ్డి లేదా ఆయన కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి బరిలో ఉంటారని, ఈ ఒక్కసారి తమ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల పోటీచేస్తే ఇతర నియోజకవర్గాలపై కూడా కొంత ప్రభావం ఉంటుందని, మాస్ క్రేజ్ ఉన్న నాయకుడిగా ఆయన మల్కాజ్గిరి లోక్‌సభ పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొడంగల్ కాకుంటే ఎల్బీనగర్ లేదా ఉప్పల్ అసెంబ్లీ స్థానాల నుంచి రేవంత్ పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కరీంనగర్ అసెంబ్లీపై బండి కన్ను! ఇక బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తాను ఈసారి కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన సంకేతాలిచ్చారు. ఆ మేరకు కరీంనగర్ నుంచే పోటీ చేస్తారా? లేక వేములవాడ నుంచా? అనే చర్చ బీజేపీలో జరుగుతోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంత బిజీగా ఉన్నా వారంలో ఒకరోజు కరీంనగర్లో అందుబాటులో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండడంతో ఆయన కరీంనగర్ అసెంబ్లీ బరిలో నిలుస్తారనే చర్చ ఊపందుకుంది. పాలేరు నుంచి తమ్మినేని, కొత్తగూడెం నుంచి కూనంనేని వామపక్షాల విషయానికొస్తే.. ఆ పార్టీలకు బీఆర్ఎస్తో పొత్తు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులిద్దరూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు జనరల్ స్థానాల నుంచి బీఆర్ఎస్ మద్దతుతో పోటీకి దిగుతారనే చర్చ జరుగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని, పొత్తు కుదిరితే ఆ రెండు పార్టీలు అడిగే మొదటి సీట్లు ఇవేననే ప్రచారం బాగా జరుగుతోంది. కోదండరాం, ప్రవీణ్‌కుమార్, షర్మిల కూడా.. టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఈసారి అసెంబ్లీ బరిలో ఉండాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఆయన పోటీ చేయాల్సిందేనని పార్టీ నేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో తన సొంత నియోజకవర్గమైన మంచిర్యాల లేదంటే సికింద్రాబాద్, ఉప్పల్ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (ఆర్ఎస్పీ) ఉమ్మడి మహబూబ్‌నగర్ (సొంత జిల్లా) పరిధిలోని ఆలంపూర్, లేదంటే అచ్చంపేట నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇక వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. తాను ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇలావుండగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మాత్రం మరోసారి హైదరాబాద్ లోక్‌సభకే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
బ్రిటన్ పీఎంగా రిషి.. మరి ఈ దేశాలను ఏలుతోంది మనోళ్లేనని తెలుసా?
బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికై.. ఆ పదవి చేపడుతున్న మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. గడిచిన 200 ఏళ్లలో బ్రిటన్ ప్రధానుల్లో రిషి సునాక్ అత్యంత పిన్నవయస్కుడిగా గుర్తింపు పొందారు. వివిధ దేశాల అధినేతలుగా భారత సంతతి వ్యక్తుల జాబితాలో చేరారు రిషి సునాక్. ఈ సందర్భంగా దేశాల అధినేతలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతి వ్యక్తుల వివరాలు తెలుసుకుందాం.. ► ప్రవింద్ జుగ్నాథ్.. భారత సంతతికి చెందిన ప్రవింద్ జుగ్నాథ్ 2017లో మారిషస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రవింద్ పూర్వీకులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మారిషస్‌కు వలస వెళ్లారు. ఆయన హిందూ కుటుంబంలో జన్మించారు. ► పృథ్విరాజ్ సింగ్ రూపున్.. 2019లో మారిషస్ ఏడవ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు పృథ్విరాజ్ సింగ్ రూపున్. ఆయన భారత మూలలున్న ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో జన్మించారు. ► ఆంటోనియా కోస్టా.. భారత మూలలు కలిగిన ఆంటోనియా కోస్టా 2015లో పోర్చుగల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గోవాలో ఆయనను బబుష్గా పిలుస్తారు. కొంకణి భాషలో అత్యంత ప్రియమైన వ్యక్తిగా దాని అర్థం. ► ఛాన్ సంటోఖి.. చంద్రికాపెర్సాద్ ఛాన్ సంటోఖి.. సురినామిస్ దేశంలో కీలక రాజకీయ నేత. మాజీ పోలీసు అధికారి. 2020లో సురినామిస్ 9వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇండో-సురినామిస్ హిందూ కుటుంబంలో 1959లో జన్మించారు సంటోఖి. ► మొహమెద్ ఇర్ఫాన్ అలీ.. గయానా 9వ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా 2020, ఆగస్టు 2న ప్రమాణ స్వీకారం చేశారు మొహమెద్ ఇర్ఫాన్ అలీ. లియోనోరాలోని ఇండో-గయానీస్ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఇర్ఫాన్ అలీ. ► హలిమా యాకోబ్.. భారత మూలలున్న హలిమా యాకోబ్ సింగపూర్ రాజకీయ నాయకురాలు, మాజీ న్యాయవాది. 2017 నుంచి 8వ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సింగపూర్ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. హలిమా తండ్రి పూర్వీకుల కారణంగా ఆమె భారతీయ ముస్లింగా గుర్తింపు పొందారు. ► వేవల్ రామ్‌కలవాన్.. సీషెల్లోస్ రాజకీయ నాయకుడు, 2020, అక్టోబర్ 26 నుంచి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన 1961, మార్చి 15న మహేలో జన్మించారు. 1993-2011, 2016-2022 వరకు ప్రతిపక్ష ఎంపీగా కొనసాగారు. ఆయన గ్రాండ్ పేరెంట్స్ భారత్‌లోని బిహార్ రాష్ట్రానికి చెందిన వారే. ► కమలా హారీస్.. భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యాక్షురాలిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. 2019లో అధ్యక్ష పదవికి పోటీ పడినప్పటికీ.. విజయవంతం కాలేకపోయారు. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా రిషి సునాక్ -
పుతిన్- బైడెన్ల అత్యవసర భేటీ!
Russia Says Premature Talk: ఉక్రెయిన్‌పై రష్యా ఉద్రిక్తతలను శాంతింపజేయడానికి పారిస్ సమావేశం జరిగే అవకాశం ఉందని ప్రకటించిన నేపథ్యంలో రష్యా అమెరికా అధ్యక్షుల శిఖరాగ్ర సమావేశం నిర్వహించేందుకు రంగం సిద్ధమైందని రష్యా ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంది. ఈ మేరకు రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశమయ్యేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని ఫ్రెంచ్ ప్రెసిడెన్సీ సోమవారం ప్రకటించింది. ఈ శిఖరాగ్ర సమావేశం జరగాలంటే మాస్కో సైన్యం ఉక్రెయిన్ పై దాడి చేయకూడదని అమెరికా పేర్కొంది. నిజానికి ఏదైన శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడానికి ఒక నిర్ధిష్ట ప్రణాళిక ఉంటుంది. కానీ ఈ సమావేశం ఎలాంటి ప్రణాళికలు లేని అత్యవసర సమావేశంగా రష్యా అభివర్ణించింది. అయితే విదేశాంగ మంత్రుల స్థాయిలో ఈ చర్చలు కొనసాగించాలని నిర్ణయించింది. అంతేకాదు అత్యవసరం అనుకుంటే రష్యా, అమెరికా అధ్యక్షులు టెలిఫోన్ కాల్ ఏదా ఇతర పద్ధతుల ద్వారా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని రష్యా ప్రతినిధి తెలిపారు. అయితే దేశాధినేతలు సముచితంగా భావిస్తేనే ఈ సమావేశం సాధ్యమవుతుందని చెప్పారు. పైగా క్రెమ్లిన్ భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పుతిన్ అధ్యక్షత వహించబోతున్నారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురవారం యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో జరగనున్న షెడ్యూల్ చర్చలకు ముందు ఫ్రెంచ్ కౌంటర్ జీన్-వైవ్స్ లే డ్రియన్‌తో టెలిఫోన్లో మాట్లాడాలని భావిస్తున్నారు. ఉక్రెయిన్ చుట్టు రష్యా దళాలు మోహరించి ఉండటమే కాక యుద్ధ భయాల్ని విపరీతంగా పెచ్చింది. అంతేగాక తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదులకు ఉక్రెయిన్ సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ ఉద్రిక్తలకు మరింత పెరిగిపోవడానకి కారణమైంది. ప్రజల ప్రాణాలకు అపాయం కలిగించేలా ఉక్రేనియన్ సైన్యం చేస్తున్న రెచ్చగొట్టే, దూకుడు చర్యల గురించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు రష్యా ప్రతినిధి తెలిపారు. (చదవండి: చైనాతో అత్యంత క్లిష్టంగా సంబంధాలు) -
మీకు ఎడమచేతివాటం ఉందా?.. ఇవి తప్పక తెలుసుకోండి.!
మీకు ఎడమచేతివాటం అలవాటా? లేదా మీకు తెలిసిన వారిలో ఎవరైన ఉన్నారా? వీరి గురించి శాస్త్రవేత్తలు తెలియజేసే ఆసక్తికర విషయాలు ఏమిటో తెలుసుకోండి.. ►భూమిపై ఉన్న మొత్తం జనాభాలో 5 నుంచి 10 శాతం మాత్రమే ఎడమచేతివాటం వ్యక్తులు ఉన్నారు. ►కుడిచేతివాటం వ్యక్తులతోపాల్చితే వీరికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు మూడు రెట్లు ఎక్కువట. ►మెదడులో కుడి భాగాన్ని వీరు ఎక్కువగా వినియోగిస్తారు. ►యుక్తవయసులోకి 4 నుంచి 5 నెలలు ఆలస్యంగా అడుగుపెడతారు. ►ప్రముఖ టెన్నిస్ ఆటగాళ్లలో 40శాతం ఎడమచేతివాటం ఉన్నవారే ఉంటారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? ఎడమచేయి అలవాటు ఉన్నవాళ్లు బేస్‌బాల్ ఆటల్లో నిష్ణాతులట. టెన్నీస్, స్విమ్మింగ్, బాక్సింగ్ ఆటలు బాగా ఆడతారట. ►మొత్తం 26 అమెరికా అధ్యక్షుల్లో 8 మంది ఎడమచేతి వాటం ఉన్నవాళ్లే. జేమ్స్ ఎ గార్ఫీల్డ్, హెర్బర్ట్ హూవర్, హ్యారీ ఎస్ ట్రూమాన్, గెరాల్డ్ ఫోర్డ్, రోనాల్డ్ రీగన్, జార్జ్ హెచ్‌డబ్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా. ►గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లెఫ్ట్ హ్యండ్ వ్యక్తుల్లో 26 శాతం మంది ధనవంతులౌతారు. ►చరిత్రలో మంచికి కానీ చెడుకి కానీ పేరుగాంచిన వారిలో ఎడమచేతివాటం ఉన్నవాళ్లే ఎక్కువగా మంది కనిపిస్తారు. వీరిలో సృజనాత్మకత, సంగీత సామర్ధ్య లక్షణాలు కూడా ఎక్కువేనట. బోస్టన్ స్ట్రాంగ్లర్, ఒసామా బిన్ లాడెన్, జాక్ ది రిప్పర్ అందరూ ఎడమచేతి వాటం గలవారే. ►left అనే ఇంగ్లీష్ పదం ఆంగ్లో సక్సాన్ పదమైన lyft నుంచి వచ్చింది. దీనికి విరిగిన లేదా బలహీణం అని అర్థం. ►20 యేళ్ల మహిళలతో పోల్చితే 40 యేళ్లు దాటిన స్త్రీలు 128 శాతం ఎడమచేతివాటం ఉన్న శిశువులకు జన్మనిస్తున్నారట. ►ఎడమచేతివాటం వ్యక్తులు గణితం, భవన నిర్మాణ (ఆర్కిటెక్చర్), అంతరిక్ష రంగాల్లో మరింత ప్రతిభావంతులని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కుడిచేతి వారు మాటలు చెప్పడంలో నిష్ణాతుని కూడా పేర్కొన్నాయి. ►ప్రతి నలుగురు అంతరిక్ష వ్యోమగాముల్లో ఒకరు ఎడమచేతివాటం వారే! ►అమెరికా జనాభాలో 30 లక్షల మంది ఎడమచేతివాటం పౌరులున్నారు. ►వీరికి ఆస్థమా, అలర్జీల సమస్యలు అధికంగా ఉంటాయి. ►ఎడమచేతికి గాయమైతే, కుడిచేత్తో పనులు చేయడం త్వరగానే నేర్చుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ►బ్రిటీష్ రాజ కుటుంబంలో క్వీన్ మదర్, క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విలియం వీళ్లంగా ఎడమచేతివాటం వారే. కుటుంబాన్ని ముందుకు నడిపే నైపుణ్యం వీళ్లకి ఎక్కువే. ►వీరు ఇన్సోమ్నియా అనే నిద్రలేమి వ్యధికి ఎక్కువగా గురౌతారు. ►ఆగస్ట్ 13ను ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేగా జరుపుకుంటారు. ►వీరు పొడవైన పదాలను స్పీడ్‌గా టైప్ చేయగలరట. ►ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తులు కుడిచేతి వాటం వారి కంటే నీటి అడుగున ఉన్నవాటిని స్పష్టంగా చూడగలుగుతారు. ►కుడి చేతివాళ్ల కంటే వీరిలో కొంచెం కోపం ఎక్కువని జర్నల్ ఆఫ్ నెర్వస్ అండ్ మెంటల్ డిసీజ్ నిర్వహించిన అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రముఖ టెన్నీస్ ఆటగాడు జాన్ మెక్ఎన్రో చాలా కోపిష్టి. ఇతను ఎడమచేతి వాటం ఆటగాడే. ఇవన్నీ పరిశోధనల్లో తేలిన విషయాలు. ఐతే అందరిలో ఇక్కడ ఇచ్చిన అన్ని లక్షణాలు ఉండక పోవచ్చు. సాధారణంగా కనిపించే లక్షణాలను మాత్రమే పేర్కొనడం జరిగింది. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు వీరే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులను 25 మందిని నియమించినట్టు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ♦పి.మురళీమోహన్(అరకు) ♦ఆర్.చిరంజీవి(శ్రీకాకుళం) ♦కె.నిరంజనరావు(విజయనగరం) ♦కె.కృష్ణ(విశాఖపట్నం) ♦జె.ఆనంద్(అనకాపల్లి) ♦పి.శ్రీనివాస్(కాకినాడ) ♦కె.త్రినాథరావు(అమలాపురం) ♦ఎస్ఎంఎస్ హుస్సేన్(రాజమండ్రి) ♦వి.డేవిడ్‌రాజు(నరసాపురం) ♦డీవీ రామాంజనేయులు(ఏలూరు) ♦కేఎం ప్రసాద్(మచిలీపట్నం) ♦సీహెచ్ విష్ణువర్ధన్‌రావు(విజయవాడ) ♦వి.రాజశేఖర్‌రెడ్డి(గుంటూరు) ♦కె.కోటేశ్వరరావు(నర్సరావుపేట్) ♦ఎ.శ్రీనివాస్‌రావు(బాపట్ల) ♦వై.వెంకటేశ్వర్లు(ఒంగోలు) ♦కె.రామసుబ్బయ్య(నంద్యాల) ♦పి.సువర్ణరెడ్డి(కర్నూల్) ♦జి.ఉమాపతిరావు(అనంతపురం) ♦ఎ.కృష్ణమూర్తి(హిందూపురం) ♦జీవీ రాఘవరెడ్డి(కడప) ♦వై.మురళీధర్‌రెడ్డి(నెల్లూరు) ♦దొరబాబు అలియాస్ ముని బాలసుబ్రమణ్యం(తిరుపతి) ♦ఏబీ సుదర్శన్‌రెడ్డి(రాజంపేట్) ♦జి.సూర్యప్రతాప్‌రెడ్డి(చిత్తూరు) -
పంటల తరలింపు బాధ్యత తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటను గ్రామ కొనుగోలు కేంద్రాలకు తరలించడంతో పాటు వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో జిల్లా, మండల గ్రామాల రైతుబంధు సమితి అధ్యక్షులు క్రియాశీలక పాత్ర నిర్వహించాలని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి కట్టడిలో భాగంగా సీఎం ఆదేశాల మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామ కొనుగోలు కేంద్రంలో గోనెసంచులు, కాంటాలు, టార్పాలిన్ (తాడిపత్రి)లను తగు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ధాన్యం తీసుకుని వచ్చే రైతులు సామాజిక దూరం పాటించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బులు, శానిటైజర్లు, నీటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. వరి, మొక్కజొన్న కోత యంత్రాలు గ్రామాల్లోకి రావడానికి తమ అనుమతులను తీసుకోవడానికి రైతులకు సహాయ సహకారాలను అందించాలన్నారు. వెటర్నరీ మందుల దుకాణాలను, విత్తన, ఎరువుల పురుగు మందుల దుకాణాలను తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న పామాయిల్ ఉత్పత్తి కంపెనీని నడిచే విధంగా చూడాలన్నారు. రైతుబంధు సమితి సభ్యులు, తమ గ్రామాలలోని రైతులు పండించిన పంటంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న భరోసా కలిగించాలన్నారు. -
అగ్రరాజ్యాధీశుల భారతీయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు వస్తున్నారంటే ఊరూవాడా ఒకటే సంబరం. ఇంట్లో పెళ్లి జరుగుతున్న హడావుడి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధిపతి అయిన ట్రంప్‌ని సాదరంగా ఆహ్వానించడానికి అహ్మదాబాద్ ముస్తాబవుతోంది. నమస్తే ట్రంప్ అంటూ స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎంతమంది అమెరికా అధ్యక్షులు భారత్‌కి వచ్చారు ? ఆనాటి విశేషాలేంటో ఓ సారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దాం.. డ్వైట్ డి ఐసన్‌హోవర్, 1959 డిసెంబర్ 9 – 14 సరిగ్గా 60 ఏళ్ల క్రితం నాటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్‌హోవర్ తొలిసారిగా భారత్ గడ్డపై అడుగు పెట్టారు. ఆరు రోజుల పాటు మన దేశంలో పర్యటించారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆ సమయంలో ఐసన్‌హోవర్ పర్యటన ఇరు దేశాల సంబంధాల ఏర్పాటుకు వీలు కల్పించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 21 సార్లు తుపాకులు గాల్లో పేల్చి సైనిక వందనంతో ఐసన్‌హోవర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రపంచ అద్భుత కట్టడం తాజ్‌మహల్‌ని సందర్శించారు. పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రిచర్డ్ ఎం నిక్సన్, 1969 జూలై–31 1969లో రిచర్డ్ ఎం నిక్సన్ తన ఆసియా పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చారు. జులై 31న ఢిల్లీలో 22 గంటలు మాత్రమే గడిపారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీతో నెలకొన్న అపోహల్ని తొలగించుకొని, అమెరికా, భారత్ మధ్య సాన్నిహిత్యం పెంచుకోవడానికే నిక్సన్ భారత్‌కు వచ్చారని వార్తలు వచ్చాయి. ఆయన అమెరికా వెళ్లిపోయాక భారతీయులపై నీచమైన కామెంట్లు కూడా చేశారు. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో నిక్సన్ పాకిస్తాన్‌కే కొమ్ముకాశారు. జిమ్మీ కార్టర్, 1978 జనవరి 1 – 3 1978 జనవరిలో జిమ్మీ కార్టర్ భారత్‌కు వచ్చారు. అప్పట్లో మొ రార్జీ దేశాయ్ ప్రధాని గా ఉన్నారు. 1971లో బంగ్లా యుద్ధం, 1974లో భారత్ అణుపరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించడం కోసమే కార్టర్ వచ్చారు. తల్లితో కలిసి వచ్చిన ఆయన పార్లమెంటులో ప్రసంగించారు. వివిధ రాజకీయ నాయకుల్ని కలుసుకున్నారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకాలు చేయాల్సిందిగా భారత్‌పై ఒత్తిడి తెచ్చారు. కానీ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా సర్కార్ తిరస్కరించడంతో ఆయన పర్యటన ఫలప్రదం కాలేదు. బిల్ క్లింటన్, 2000 మార్చి 19–25 ఆ తర్వాత రెండు దశాబ్దాలు భారత్, అమెరికా సం బంధాల మధ్య స్తబ్ధత నెలకొంది. దానిని తొలగించడం కోసం 2000లో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సేతో కలిసి భారత్‌లో పర్యటించారు 1999 కార్గిల్ యుద్ధ సమయంలో బిల్ క్లింటన్ జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. దీంతో ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బిల్ క్లింటన్‌కి రాచమర్యాదలు చేశారు. క్లింటన్ హయాంలోనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు బలపడ్డాయి. ఆగ్రా, జైపూర్, ముంబై, ఢిల్లీలతో పాటు హైదరాబాద్‌కి కూడా క్లింటన్ వచ్చారు. ప్రతీచోటా ఆయనకు అఖండ స్వాగతం లభించింది. జార్జ్ డబ్ల్యూ బుష్, 2006 మార్చి 1–3 2006లో జార్జ్ డబ్ల్యూ బుష్, ఆయన సతీమణి లారా బుష్ భారత్‌కు వచ్చి మూడు రోజులు పర్యటించారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ బుష్ పర్యటనని గొప్పగా తీసుకున్నా, లెఫ్ట్ పార్టీలు అధ్యక్షుడి రాకను వ్యతిరేకించడంతో బుష్ పార్లమెంటుని ఉద్దేశించి ప్రసంగించలేదు. అప్పుడే రెండు దేశాల మధ్య అణు ఒప్పందం ఖరారైంది. బరాక్ ఒబామా 2010, 2015 2010, నవంబర్ 6–9 2015, జనవరి 25–27 అమెరికా, భారత్‌ల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు బరాక్ ఒబామా హయాంలోనే నెలకొన్నాయి. మహాత్మాగాంధీ బోధనల నుంచి స్ఫూర్తిని పొందిన ఆయన తన ఎనిమిదేళ్ల పాలనలోనూ భారత్‌తో సంబంధాలకు అత్యంత విలువ ఇచ్చారు. మన్మోహన్ హయాంలో 2010లోనూ , తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 2015లో పర్యటించి భారత్‌తో సంబంధాలు తమకెంత కీలకమో చాటి చెప్పారు. తొలిసారి పర్యటనలో రక్షణ రంగంలోనూ , అంతరిక్ష పరిశోధనల్లోనూ, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులోనూ భారత్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ రంగంలో వ్యూహాత్మక సంబంధాలు బలపడడానికి ఒబామాయే చొరవ తీసుకున్నారు. అంతేకాదు నిరంతరం మన్మోహన్ సింగ్‌తో టచ్‌లో ఉంటూ సన్నిహితంగా మెలిగారు ఆ తర్వాత మోదీ ప్రధాని అయ్యాక 2015 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఒబామా విచ్చేశారు. ఇలా గణతంత్ర ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు హాజరుకావడం అదే తొలిసారి. ఆ సందర్భంగా ఒబామా 400 కోట్ల ఆర్థిక సాయాన్ని కూడా భారత్‌కు ప్రకటించారు. -
ప్రధానులు వాడిన టాప్-5 కార్లు ఇవే..
భారత్ 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. వాడవాడలా మువ్వెన్నల జెండా రెపరెపలాడుతోంది. ఈ 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటోమేటివ్ ఫ్రెండ్స్‌కు మరింత ప్రత్యేకతను అందించేందుకు.. మన ప్రధానులు, అధ్యక్షులు వాడిన స్పెషల్ కార్ల జాబితాను రిపోర్టులు విడుదల చేశాయి. మన ప్రధానులు, అధ్యక్షులు వాడిన టాప్-5 కార్లేమిటో ఓ సారి చూద్దాం.. మెర్సడెస్-బెంజ్ 500 ఎస్ఈఎల్... చాలా వేగంగా దూసుకుపోయే కార్లంటే రాజీవ్ గాంధీకి చాలా ఇష్టం. తన అధికారిక కారుగా ఐకానిక్ హిందూస్తాన్ అంబాసిడర్‌ను వాడేవారు. తన వద్ద పలు స్పెషల్ కార్లను ఉంచుకునేవారు. వాటిలో రేంజ్ రోవర్ వాగ్యు నుంచి మెర్సడెస్-బెంజ్ 500 ఎస్ఈఎల్ వరకు ఉండేవి. అయితే ఎవరైనా అత్యున్నత హోదాలో ఉంటే, వారు తన కారును నడుపుకోరు. ప్రత్యేకంగా డ్రైవర్ నియమించుకుని, వారితో నడిపిస్తారు. కానీ రాజీవ్ గాంధీ అలా కాదంట. ఎంచక్కా డ్రైవర్‌ను పక్కసీట్లో కూర్చో పెట్టుకుని, తానే స్వయంగా డ్రైవ్ చేసేవారట. ఆయన దేశమంతా మెరూన్లో పర్యటించారు. పార్లమెంట్ వాహనంగా రేంజ్ రోవర్ వాగ్యును తీసుకెళ్లేవారట. మెర్సడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లిమౌసిన్.. భారత్ తొమ్మిదవ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ శంకర్ దయాల్ శర్మ బుల్లెట్, గ్రెనేడ్ ప్రూఫ్ మెర్సడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లిమౌనిస్ వాడిన తొలి అధ్యక్షుడు. మెర్సడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లిమౌసిన్, వీఆర్9-లెవల్ బాలిస్టిక్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. .44 క్యాలిబర్, సైనిక రైఫిల్ షాట్లు, బాంబులు, గ్యాస్ దాడుల నుంచి ఇది కాపాడుతోంది. అధ్యక్షుడి మెర్సడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లిమౌసిన్ వీల్‌బేస్ 3368ఎంఎం, పొడువు 5448ఎంఎం, వెడల్పు 1900ఎంఎం, ఎత్తు 1494ఎంఎం ఉండేది. 6.0 లీటరు వీ12 పెట్రోల్ ఇంజిన్‌ను ఇది కలిగి ఉంది. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ దీని ప్రత్యేకత. హిందూస్తాన్ అంబాసిడర్... అన్ని రాష్ట్రాల అధిపతులు ఐకానిక్ హిందూస్తాన్ అంబాసిడర్‌నే ఎక్కువగా ఎంచుకునేవారు. దీన్ని ప్యుగోట్‌కు అమ్మడానికి కంటే ముందస్తు వరకు కూడా ముఖ్యమంత్రులు చాలా వరకు ఈ వాహనాన్నే వాడేవారు. 1958 నుంచి 2014 వరకు ఈ అంబాసిడర్‌ను తయారు చేశారు. హిందూస్తాన్ మోటార్స్ ఆఫ్ ఇండియా దీన్ని రూపొందించేది. ఐకే గుజ్రాల్ పదవీ కాలంలో ఈ అంబాసిడర్‌ను మోస్ట్ లోయల్ వెహికిల్‌గా పరిగణించేవారు. హెచ్డీ దేవే గౌడ, అటల్ బిహారీ వాజపేయిలు అంబాసిడర్‌నే తమ వాహనంగా వాడేవారు. బీఎండబ్ల్యూ 7-సిరీస్ 760 లి.. సుదీర్ఘకాలం పాటు అంబాసిడర్‌నే అధికారిక వాహనంగా ఉంటూ వచ్చింది. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంబాసిడర్ నుంచి బీఎండబ్ల్యూ 7-సిరీస్ 760 లికి మారారు. ప్రస్తుత ప్రధాని కూడా దీన్నే తన అధికారిక వాహనంగా వాడుతున్నారు. దీని ఖరీదు సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుంది. ఈ వాహనానికి వీఆర్ 7 సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే ఏకే47ను, అధిక తీవ్రత పేలుళ్లను, అలాగే రోడ్డు పక్కన బాంబు పేలుళ్లను తట్టుకోగలదు. 7 సిరీస్ 760 లి వాహనం హెవీ షీట్ మెటల్‌ను కలిగి ఉండి, 4 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. రేంజ్ రోవర్ స్పోర్ట్... టాటా మోటార్స్‌కు చెందిన రేంజ్ రోవర్ స్పోర్ట్‌లో ప్రయాణించడానికి కూడా మోదీ ఎక్కువగా ఇష్టపడతారు. ఇటీవల ఫుల్-సైజ్ ఎస్‌యూవీని వాడటం మొదలు పెట్టారు. దీంతో తేలికగా కారులో నుంచి బయటికి వెళ్లడం, లోపలికి వెళ్లడం చేయొచ్చు. పానోరామిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుంది. దీంతో కారు బయటికి రాకుండానే ప్రధాని ప్రజలకు అభివందన చేయొచ్చు. బీఎండబ్ల్యూ 7-సిరీస్ 760 లి మాదిరిగానే రేంజ్ రోవర్ స్పోర్ట్ కూడా వీఆర్7 గ్రేడ్‌తో బాలిస్టిక్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. గ్యాస్ అటాక్ జరుగకుండా గ్యాస్-సేఫ్ ఛాంబర్ కూడా ఏర్పాటు చేశారు. థిక్ బుల్లెట్-ప్రూఫ్ విండోలు, వెహికిల్ పైన సాయుధ ప్లేట్లు ఉన్నాయి. -
వరించేదెవరినో..!
♦ రెండు జిల్లాల టీడీపీ అధ్యక్షుల నియామకంపై ఉత్కంఠ ♦ పార్టీ పదవులపై తొలగని ప్రతిష్టంభన ♦ పోటీలో పలువురు నాయకులు ♦ ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నం సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండు జిల్లాల టీడీపీ అధ్యక్షుల నియామకం విషయంలో కొంత ఉత్కంఠ నెలకొంది. ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న నేతలు జిల్లా విడిపోయిన తర్వాత పార్టీ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొంతకాలంగా రెండు జిల్లాలకు విడివిడిగా కమిటీలు వేస్తారని ప్రచారం జరగడంతో ఆయా జిల్లాల నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో టీడీపీ ప్రభ తీవ్రస్థాయిలో తగ్గిపోవడంతోపాటు అనేక మంది ముఖ్య నేతలు అధికార పార్టీలోకి వలస వెళ్లారు. దీంతో జిల్లాలో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురైంది. గత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక్క సత్తుపల్లి స్థానాన్ని గెలుపొందిన ఆ పార్టీ.. ఆ తర్వాత ఖమ్మంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క స్థానాన్ని సైతం గెలుచుకోలేకపోయింది. జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన టీడీపీ ఇప్పుడు తన ఉనికి చాటుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా విడిపోయి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలుగా ఏర్పడింది. ఈ క్రమంలో వామపక్ష పార్టీలతో సహా అనేక రాజకీయ పక్షాలు కొత్త జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే టీడీపీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు నూతన కమిటీల ఏర్పాటుకు కొంతకాలంగా కసరత్తు చేస్తున్నా.. ఆయా జిల్లాల అధ్యక్ష పదవులపై ఏకాభిప్రాయం కొరవడటం, అనేక మంది ఈ పదవి కోసం పట్టుపడుతుండటంతో ఈ నియామకాన్ని చేపట్టకుండా అధిష్టానం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. చర్చోపచర్చలు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన తుళ్లూరి బ్రహ్మయ్య కొనసాగుతుండగా.. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై పార్టీలో చర్చోపచర్చలు జరిగినా ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న తుళ్లూరి బ్రహ్మయ్యనే మరోసారి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించాలని పార్టీలోని కొందరు ముఖ్య నేతలు టీడీపీ అధిష్టానానికి సిఫార్సు చేయగా.. మరికొందరు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించి.. ప్రస్తుత ఖమ్మం జిల్లాకు చెందిన సమర్థుడైన నాయకుడికి ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చింది. అలాగే ఆది నుంచి పార్టీలో కొనసాగుతూ.. విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయం పాలకవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న పార్టీ సీనియర్ నేత, మధిరకు చెందిన వాసిరెడ్డి రామనాథం పేరును జిల్లాలోని పలువురు ముఖ్య నేతలు ప్రతిపాదించారు. ఆయనతోపాటు పార్టీ మహిళా నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, ఏలూరి శ్రీనివాసరావు సైతం ఈ పదవిని ఆశిస్తున్నారు. దీంతో వీరిలో ఎవరి పేరు ఖరారు చేయాలో ఒక పట్టాన తేల్చుకోలేక.. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసిన టీడీపీ అధిష్టానం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షుల ఎంపికను మాత్రం వాయిదా వేసింది. వాసిరెడ్డి రామనాథంకు పదవి ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేని పక్షంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీలోని మరికొందరు ముఖ్యులు అధిష్టానాన్ని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం హోరాహోరీగా పోరు సాగుతోంది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని) తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తుండగా.. పినపాక నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కొల్లేటి భవానీ శంకర్ అదేస్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. అయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షుల ఎంపిక వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించిందనే భావన పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. టీడీపీ పరిస్థితి జిల్లాలో కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది. పార్టీ జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయడంపై పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్నిబట్టి తమ రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకునేందుకు అనేక మంది సీనియర్ నేతలు సమాయత్తం అవుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే టీడీపీ ఉభయ జిల్లాల్లోనూ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కొత్తగా రెండు రాష్ట్రాల అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. గత కొద్ది రోజులుగా బీహార్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అధ్యక్షులను ఎంపికపై పెద్ద ఎత్తున కసరత్తులు సాగాయి. బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా నిత్యానందరాయ్, ఢిల్లీ అధ్యక్షుడిగా మనోజ్ తివారీని ఎంపిక చేసినట్లు బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై ఇంకా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. -
రాజకీయ రథసారథులెవరో..!
పార్టీ పగ్గాలపై నేతల ఆసక్తి అధ్యక్ష పదవుల కోసం అధిష్టానం వేట త్వరలోనే నియామకాలు సాక్షి, సిరిసిల్ల : కొత్తజిల్లా ఏర్పాటైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన సారథుల కోసం రాజకీయ పార్టీలు వేట మొదలెట్టాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించాక రాజకీయ పార్టీలకు కూడా కొత్త అధ్యక్షుల నియూమకం అనివార్యమైంది. అధికార టీఆర్ఎస్తోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు సైతం నూతన అధ్యక్షుడి నియూమకం కోసం కసరత్తు చేస్తున్నారుు. ఈవిషయంలో సీపీఎం ఒకడుగు ముందుకేసి ఇప్పటికే నూతన జిల్లా కార్యదర్శులను ప్రకటించింది. అధికార పార్టీలో అధికపోటీ.. అధికార టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష స్థానానికి పోటీ అధికంగానే ఉంది. అరుుతే, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆశిస్సులు ఎవరికి ఉంటే వారే అధ్యక్షుడు కానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న సమయంలోనూ ఈ ప్రాంతం నుంచి జిల్లాస్థాయి నాయకులెవరూ అంతగా లేరు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల అధ్యక్ష పదవికి గూడూరి ప్రవీణ్, గడ్డం నర్సయ్య, చిక్కాల రామారావు, చీటి నర్సింగరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వేములవాడ దేవస్థానం పాలకవర్గం మినహా, పెద్దగా నామినేటెడ్ పదవులు కూడా లేకపోవడంతో సహజంగానే నాయకులు జిల్లా అధ్యక్ష పదవిపై దృష్టిసారించారు. బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టేట్లయితే అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డం నర్సయ్యకు జిల్లా పగ్గాలు దక్కే అవకాశం ఉంది. నియోజకవర్గానికి కేటీఆర్ వచ్చిన నాటి నుంచి వెన్నంటి ఉన్న గూడూరి ప్రవీణ్ కాస్త ముందు వరుసలో ఉన్నారు. ఇక సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, కేటీఆర్ సమీప బంధువు చీటి నర్సింగరావు పేర్లు పరిశీలించాలంటూ పలువురు ప్రతిపాదిస్తున్నారు. కానీ జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అదే సామాజిక వర్గానికి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారా..? అనేది అనుమానమే. కాంగ్రెస్‌లో.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కటకం మృత్యుం జయం, ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపే ట వాస్తవ్యుడు. ఒకవేళ మృత్యుంజయం రాజన్న సిరిసిల్లపై ఆసక్తి కనబరిస్తే ఆయనే డీసీసీ అధ్యక్షుడిగా కొనసా గే అవకాశం ఉంది. కానీ ఆయన కరీంనగర్ మాజీ ఎమ్మె ల్యే కూడా కావడంతో కరీంనగర్ వైపు మొగ్గు చూపితే జిల్లాకు కొత్త అధ్యక్షుడు రాక తప్పదు. పార్టీ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, ఉమేశ్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, బీసీకి కేటారుుస్తే సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్లు డీసీసీ అధ్యక్ష రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీజేపీలో.. జిల్లాలో పట్టున్న బీజేపీ అధ్యక్ష స్థానానికి కాస్త పోటీ ఎక్కువగానే ఉంది. గతంలో సిరిసిల్ల మున్సిపాల్టీని కైవసం చేసుకొన్న బీజేపీ.. వేములవాడ నగరపంచాయతీ పీఠంపై తొలిజెండా ఎగురవేసింది. దీంతో సహజంగానే ఆ పార్టీ అధ్యక్ష పీఠంపై ఆసక్తి నెలకొంది. వేములవాడ నగరపంచాయతీ వైస్ చైర్మన్, పార్టీ సీనియర్ నాయకుడు ప్రతాప రామకృష్ణ, వేములవాడ దేవస్థానం మాజీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, మాజీ జెడ్పీటీసీ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి రేసులో ఉన్నారు. ప్రతాప రామకృష్ణ ఉమ్మడి కరీంనగర్‌కు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆది శ్రీనివాస్ రెండుసార్లు వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. టీడీపీలో.. జిల్లాలో ఉనికికోల్పోయిన టీడీపీకి ఇక్కడ పెద్దగా పోటీ కనిపించడం లేదు. ఉమ్మడి కరీంనగర్‌కు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నమనేని నర్సింగరావు జిల్లాలోని ముస్తాబాద్ మండల వాస్తవ్యుడు. ఆయన ఆశిస్తే జిల్లా అధ్యక్ష పదవి ఆయనను వరించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే సీపీఎం జిల్లా కార్యదర్శిగా పంతం రవికి ఆ పార్టీ పగ్గాలు అప్పగించారు. సీపీఐ కూడా తమ కార్యదర్శిని ప్రకటించనుంది. మొత్తానికి కొత్త జిల్లా రాజన్న సిరిసిల్లకు అన్ని రాజకీయ పార్టీలు తొలి అధ్యక్షులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నాయి. కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
‘ప్రథమ పౌరుల’కు పరాభవమే!
సర్పంచులకు జాతీయ పతాక ఆవిష్కరణ గౌరవం దూరం సర్కారు నిర్ణయంపై పార్టీలకు అతీతంగా సర్పంచుల ఆవేదన భవిష్యత్తులో ఆందోళనకు సన్నద్ధం సాక్షి ప్రతినిధి, కాకినాడ : స్థానిక సంస్థల్లో కీలకమైంది గ్రామ పంచాయతీ. గ్రామస్థాయిలో సర్పంచులు, మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు కూడా ఉంటారు. రాజ్యాంగంలో పంచాయతీలకు పెద్ద పీట వేశారు. రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న ఎందరో ఒకప్పుడు పంచాయతీ సర్పంచ్‌లుగా పనిచేసిన వారే. పంచాయతీ సర్పంచ్‌నే గ్రామానికి ప్రథమ పౌరుడిగా రాజ్యాంగం పేర్కొంది. ఇదే సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. గ్రామంలో ప్రథమ పౌరుడికి గౌరవం ఇవ్వాలనే సంకల్పంతో స్వాతంత్య్ర దినోత్సవం జరిగే పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసే అవకాశాన్ని సర్పంచ్‌లకు కల్పించారు. ఆ రోజు పాఠశాలల్లో జెండా వందనం చేయడాన్ని సర్పంచులు ఎంతో గౌరవంగా భావిస్తూ వస్తున్నారు. అటువంటి అవకాశాన్ని తమ నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఓ జీఓతో ఊడబీకిందని సర్పంచులు మండిపడుతున్నారు. జెండా వందనంచేసే అవకాశాన్ని తమ నుంచి ఎంపీటీసీలకు కల్పించడం ద్వారా తమను తీవ్రంగా అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జన్మభూమి కమిటీల పెత్తనం విభజన అనంతరం కూడా రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా తూర్పుగోదావరి. అటువంటి జిల్లాలో అత్యధికంగా 1069 పంచాయతీలున్నాయి. వీటిని పరిపాలనా సౌలభ్యం కోసం 774 క్లస్టర్లుగా విభజించారు. ఇన్ని పంచాయతీల పరిధిలోని పాఠశాలల్లో జెండా వందనం చేసే అవకాశాన్ని తొలిసారి కోల్పోతున్నామనే బాధ సర్పంచులందరిలో కనిపిస్తోంది. అన్నింటా అగ్రగామి పంచాయతీ సర్పంచులేనని పైకి చెబుతున్న పాలకులు తీరా ఆచరణకొచ్చేసరికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అవమానాలకు గురిచేయడం తగునా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తెలుగుతమ్ముళ్లతో జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేసి గ్రామాల్లో పరోక్ష పాలనను వారితో సాగిస్తోంది. గ్రామంలో ఒక సంక్షేమ పథకం మంజూరవ్వాలన్నా, నిధులు విడుదలవ్వాలన్నా జన్మభూమి కమిటీలకే సర్వాధికారాలు అప్పగించేసిందని ఇప్పటికే సర్పంచ్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో జరిగే జెండా వందనానికి కూడా తమను నోచుకోకుండా విద్యాశాఖ కమిషనర్ జిల్లా విద్యాశాఖకు మెమో జారీచేయడాన్ని పలువురు గర్హిస్తున్నారు. జాతీయ పతాకావిష్కరణ గౌరవాన్ని సర్పంచులకు కాక ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు అవకాశం కల్పించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని సర్పంచులు చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు. దీనిపై భవిష్యత్తులో ఆందోళనకు పార్టీరహితంగా సర్పంచ్‌లు సంసిద్ధులవుతున్నారు. త్వరలో వీరంతా సమావేశమయ్యేందుకు సమాలోచనలు జరుపుతున్నారు. ‘బాబు’ జీవో సర్పంచులను అవమానించడమే స్వాతంత్య్ర దినోత్సవం రోజున పాఠశాలల్లో జెండా ఎగరవేయకుండా చంద్రబాబు సర్కారు జీఓ జారీ చేయడం సర్పంచులను అవమానపర్చడమే. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా దారుణం. – పెంకే కృష్ణవేణి, సర్పంచ్, కందుల పాలెం,రామచంద్రపురం నియోజకవర్గం -
టీడీపీలో డమ్మి ప్రెసిడెంట్లు
-
ఉరిశిక్ష కేసుల్లో క్షమాభిక్షలే ఎక్కువ
ఇప్పటివరకు 306 మందికి క్షమాభిక్ష 131 పిటిషన్ల తిరస్కరణ న్యూఢిల్లీ: మరణశిక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లలో 306 పిటిషన్లను భారత రాష్ట్రపతులు ఆమోదించి.. పిటిషనర్లకు పడిన మరణశిక్షను రద్దుచేశారు. న్యాయ కమిషన్ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. ఉగ్రవాదం, దేశంపై యుద్ధం కేసుల్లో మినహా మిగతా కేసుల్లో మరణశిక్షను రద్దు చేయాలని సిఫార్సు చేసిన ఆ నివేదికలో.. 1950 జనవరి 26 నుంచి మంగళవారం వరకూ రాష్ట్రపతులు పరిష్కరించిన క్షమాభిక్ష పిటిషన్ల వివరాలను తెలిపింది. మొత్తం 437 క్షమాభిక్ష దరఖాస్తులు అందగా, వాటిలో 306 పిటిషన్లను ఆమోదించి, వారి మరణశిక్షను జీవితాంతం జైలుశిక్షగా మార్చారని, 131 పిటిషన్లను తిరస్కరించారని వివరించింది. మరణశిక్ష ఎదుర్కొంటున్న దోషి జీవన్మరణాల భవిష్యత్తు.. అప్పటి సర్కారు అభిప్రాయాలపైనే కాకుండా.. రాష్ట్రపతుల వ్యక్తిగత అభిప్రాయాలపై కూడా ఆధారపడి ఉందని పేర్కొంది. వివరాలు.. బాబూరాజేంద్రప్రసాద్ 181 క్షమాభిక్ష దరఖాస్తులపై నిర్ణయం తీసుకోగా.. వాటిలో కేవలం ఒక్క దరఖాస్తునే తిరస్కరించారు. ఎస్. ధాకృష్ణన్ నిర్ణయం తీసుకున్న 57 దరఖాస్తులనూ ఆమోదించారు. జాకీర్‌హుస్సేన్, వి.వి.గిరిలు తాము నిర్ణయం తీసుకున్న అన్ని క్షమాభిక్ష పిటిషన్లనూ ఆమోదించారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డిలు వారి హయాంలో ఏ ఒక్క క్షమాభిక్ష పిటిషన్‌పైనా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. 1950-1982 మధ్య ఆరుగురు రాష్ట్రపతులు కేవలం ఒకే పిటిషన్‌ను మాత్రమే తిరస్కరించి.. 262 పిటిషన్లను ఆమోదించారు. 1982-1997 మధ్య ముగ్గురు రాష్ట్రపతులు 93 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించి.. 7 పిటిషన్లను ఆమోదించారు. జైల్‌సింగ్ తను నిర్ణయించిన 32 పిటిషన్లలో 30 పిటిషన్లను తిరస్కరించారు. ఆర్.వెంకటరామన్ 50 పిటిషన్లపై నిర్ణయం తీసుకుని 45 పిటిషన్లను తిరస్కరించారు. శంకర్‌దయాళ్‌శర్మ తన ముందుకు వచ్చిన మొత్తం 18 క్షమాభిక్ష పిటిషన్లనూ తిరస్కరించారు. 1997-2007 మధ్య ఇద్దరు రాష్ట్రపతులు తమ వద్దకు వచ్చిన దాదాపు అన్ని పిటిషన్లనూ పెండింగ్‌లో పెట్టారు. కె.ఆర్.నారాయణన్ తన ముందుకు వచ్చిన ఏ ఒక్క క్షమాభిక్ష పిటిషన్ పైనా నిర్ణయమూ తీసుకోలేదు. అబ్దుల్‌కలాం కేవలం రెండు క్షమాభిక్ష పిటిషన్లపైనే నిర్ణయం తీసుకున్నారు. ఒక దాన్ని ఆమోదించి, మరొకదాన్ని తిరస్కరించారు. ప్రతిభాపాటిల్ తన హయాంలో ఐదు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించి.. 34 క్షమాభిక్ష పిటిషన్లను ఆమోదించారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇప్పటివరకూ 33 క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోగా.. వాటిలో 31 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. క్షమాభిక్ష అభ్యర్థనలపై రాష్ర్టపతులనిర్ణయాలు అంగీకారం తిరస్కారం మొత్తం బాబూ రాజేంద్రప్రసాద్ 180 1 181 సర్వేపల్లి రాధాకృష్ణన్ 57 0 57 జాకీర్‌హుస్సేన్ 22 0 22 వీవీ గిరి 3 0 3 ఫకృద్దీన్ అలీ అహ్మద్ - - - నీలం సంజీవరెడ్డి - - - జ్ఞానీ జైల్‌సింగ్ 2 30 32 ఆర్.వెంకట్రామన్ 5 45 50 శంకర్‌దయాళ్‌శర్మ 0 18 18 కేఆర్ నారాయణన్ 0 0 0 అబ్దుల్ కలాం 1 1 2 ప్రతిభాపాటిల్ 34 5 39 ప్రణబ్ ముఖర్జీ 2 31 33