
గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్..
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్.. గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాలరెడ్డి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్‌రెడ్డి నియమితులయ్యారు.
వైఎస్సార్‌సీపీ నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: చంద్రబాబు పాపాలు కడిగేందుకే పూజలు: పేర్నినాని