సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా, అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు.
పలు విభాగాలకు అధ్యక్షులు వీరే..
- మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
- రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి
- ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
- మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్‌బాషా
- పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డి
- మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్
- వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జునయాదవ్
- వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతంరెడ్డి
- లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డి
- సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష
- ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోసమరెడ్డి సునిల్
- వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్‌రాజు
- గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తి
- వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలు.. రామచంద్రారెడ్డి (ప్రైవేట్ స్కూళ్లు)ని, చంద్రశేఖర్‌రెడ్డి (గవర్నమెంట్ స్కూళ్లు)
- అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment