4 జిల్లాలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుల నియామకం | Appointment Of Ysrcp Presidents For Four Districts | Sakshi
Sakshi News home page

4 జిల్లాలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుల నియామకం

Published Thu, Sep 26 2024 6:30 PM | Last Updated on Thu, Sep 26 2024 7:29 PM

Appointment Of Ysrcp Presidents For Four Districts

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గుడివాడ అమర్‌నాథ్‌, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బూడి ముత్యాల నాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా నందిగం సురేష్, పార్టీ పీఏసీ మెంబర్‌గా ఆదిమూలపు సురేష్, విశాఖపట్నం (వెస్ట్) అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మళ్ళా విజయప్రసాద్.. పార్టీ పీఏసీ మెంబర్‌గా, రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షురాలిగా కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి నియమితులయ్యారు.

ఇదీ చదవండి: నీ ఉడత ఊపులకు భయపడం.. పవన్‌కు పేర్ని నాని స్ట్రాంగ్‌ వార్నింగ్‌

కాగా, నిన్న(బుధవారం) మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎన్టీఆర్‌ జిల్లా అధ్య­క్షుడిగా దేవినేని అవినాష్‌ నియమితు­ల­య్యారు. గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని నియ­మించారు. వెలంపల్లి శ్రీనివాస­రావును పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా నియమించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్‌రెడ్డి (వేమారెడ్డి), పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్‌కుమార్‌ నియమితులయ్యారు.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement