ప్రధానులు వాడిన టాప్‌-5 కార్లు ఇవే.. | 2018 Independence Day: Top 5 Cars Used By Prime Ministers And Presidents Of India | Sakshi
Sakshi News home page

ప్రధానులు, అధ్యక్షులు వాడిన టాప్‌-5 కార్లు ఇవే..

Published Wed, Aug 15 2018 12:03 PM | Last Updated on Wed, Aug 15 2018 6:36 PM

2018 Independence Day: Top 5 Cars Used By Prime Ministers And Presidents Of India - Sakshi

భారత్‌ 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది. వాడవాడలా మువ్వెన్నల జెండా రెపరెపలాడుతోంది. ఈ 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటోమేటివ్‌ ఫ్రెండ్స్‌కు మరింత ప్రత్యేకతను అందించేందుకు.. మన ప్రధానులు, అధ్యక్షులు వాడిన స్పెషల్‌ కార్ల జాబితాను రిపోర్టులు విడుదల చేశాయి. మన ప్రధానులు, అధ్యక్షులు వాడిన టాప్‌-5 కార్లేమిటో ఓ సారి చూద్దాం..

మెర్సడెస్‌-బెంజ్‌ 500 ఎస్‌ఈఎల్‌...

చాలా వేగంగా దూసుకుపోయే కార్లంటే రాజీవ్‌ గాంధీకి చాలా ఇష్టం. తన అధికారిక కారుగా ఐకానిక్‌ హిందూస్తాన్‌ అంబాసిడర్‌ను వాడేవారు. తన వద్ద పలు స్పెషల్‌ కార్లను ఉంచుకునేవారు. వాటిలో రేంజ్‌ రోవర్‌ వాగ్యు  నుంచి మెర్సడెస్‌-బెంజ్‌ 500 ఎస్‌ఈఎల్‌ వరకు ఉండేవి. అయితే ఎవరైనా అత్యున్నత హోదాలో ఉంటే, వారు తన కారును నడుపుకోరు. ప్రత్యేకంగా డ్రైవర్‌ నియమించుకుని, వారితో నడిపిస్తారు. కానీ రాజీవ్‌ గాంధీ అలా కాదంట. ఎంచక్కా డ్రైవర్‌ను పక్కసీట్లో కూర్చో పెట్టుకుని, తానే స్వయంగా డ్రైవ్‌ చేసేవారట. ఆయన దేశమంతా మెరూన్‌లో పర్యటించారు. పార్లమెంట్‌ వాహనంగా రేంజ్‌ రోవర్‌ వాగ్యును తీసుకెళ్లేవారట.

మెర్సడెస్‌ బెంజ్‌ ఎస్‌-క్లాస్‌ లిమౌసిన్..

భారత్‌ తొమ్మిదవ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్‌ శంకర్‌ దయాల్‌ శర్మ బుల్లెట్‌, గ్రెనేడ్‌ ప్రూఫ్‌ మెర్సడెస్‌ బెంజ్‌ ఎస్‌-క్లాస్‌ లిమౌనిస్‌ వాడిన తొలి అధ్యక్షుడు. మెర్సడెస్‌ బెంజ్‌ ఎస్‌-క్లాస్‌ లిమౌసిన్‌, వీఆర్‌9-లెవల్‌ బాలిస్టిక్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. .44 క్యాలిబర్, సైనిక రైఫిల్ షాట్లు, బాంబులు, గ్యాస్ దాడుల నుంచి ఇది కాపాడుతోంది. అధ్యక్షుడి మెర్సడెస్‌ బెంజ్‌ ఎస్‌-క్లాస్‌ లిమౌసిన్‌ వీల్‌బేస్‌ 3368ఎంఎం, పొడువు 5448ఎంఎం, వెడల్పు 1900ఎంఎం, ఎత్తు 1494ఎంఎం ఉండేది. 6.0 లీటరు వీ12 పెట్రోల్‌ ఇంజిన్‌ను ఇది కలిగి ఉంది. 7 స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌ దీని ప్రత్యేకత. 

హిందూస్తాన్‌ అంబాసిడర్‌...

అన్ని రాష్ట్రాల అధిపతులు ఐకానిక్‌ హిందూస్తాన్‌ అంబాసిడర్‌నే ఎక్కువగా ఎంచుకునేవారు. దీన్ని ప్యుగోట్‌కు అమ్మడానికి కంటే ముందస్తు వరకు కూడా ముఖ్యమంత్రులు చాలా వరకు ఈ వాహనాన్నే వాడేవారు. 1958 నుంచి 2014 వరకు ఈ అంబాసిడర్‌ను తయారు చేశారు. హిందూస్తాన్‌ మోటార్స్‌ ఆఫ్‌ ఇండియా దీన్ని రూపొందించేది. ఐకే గుజ్రాల్‌ పదవీ కాలంలో ఈ అంబాసిడర్‌ను మోస్ట్‌ లోయల్‌ వెహికిల్‌గా పరిగణించేవారు. హెచ్‌డీ దేవే గౌడ, అటల్‌ బిహారీ వాజపేయిలు అంబాసిడర్‌నే తమ వాహనంగా వాడేవారు. 

బీఎండబ్ల్యూ 7-సిరీస్‌ 760 లి..

సుదీర్ఘకాలం పాటు అంబాసిడర్‌నే అధికారిక వాహనంగా ఉంటూ వచ్చింది. కానీ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంబాసిడర్‌ నుంచి బీఎండబ్ల్యూ 7-సిరీస్‌ 760 లికి మారారు. ప్రస్తుత ప్రధాని కూడా దీన్నే తన అధికారిక వాహనంగా వాడుతున్నారు. దీని ఖరీదు సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుంది. ఈ వాహనానికి వీఆర్‌ 7 సర్టిఫికేషన్‌ ఉంటుంది. అంటే ఏకే47ను, అధిక తీవ్రత పేలుళ్లను, అలాగే రోడ్డు పక్కన బాంబు పేలుళ్లను తట్టుకోగలదు. 7 సిరీస్‌ 760 లి వాహనం హెవీ షీట్‌ మెటల్‌ను కలిగి ఉండి, 4 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. 

రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌...


టాటా మోటార్స్‌కు చెందిన రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌లో ప్రయాణించడానికి కూడా మోదీ ఎక్కువగా ఇష్టపడతారు. ఇటీవల ఫుల్‌-సైజ్‌ ఎస్‌యూవీని వాడటం మొదలు పెట్టారు. దీంతో తేలికగా కారులో నుంచి బయటికి వెళ్లడం, లోపలికి వెళ్లడం చేయొచ్చు. పానోరామిక్‌ సన్‌రూఫ్‌ కూడా ఉంటుంది. దీంతో కారు బయటికి రాకుండానే ప్రధాని ప్రజలకు అభివందన చేయొచ్చు. బీఎండబ్ల్యూ 7-సిరీస్‌ 760 లి మాదిరిగానే రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ కూడా వీఆర్‌7 గ్రేడ్‌తో బాలిస్టిక్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. గ్యాస్‌ అటాక్‌ జరుగకుండా గ్యాస్‌-సేఫ్‌ ఛాంబర్‌ కూడా ఏర్పాటు చేశారు. థిక్‌ బుల్లెట్‌-ప్రూఫ్‌ విండోలు, వెహికిల్‌ పైన సాయుధ ప్లేట్లు ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement