
వైఎస్సార్‌సీపీ రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్ నియమితులయ్యారు.
జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్‌రామ్‌లను నియమించారు.
కాగా, పార్టీ నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న(శుక్రవారం) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల వైఎస్సార్‌సీపీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే