లక్నో: మీరట్‌లోని ఓ బట్టల షోరూమ్‌లో భారీ పైథాన్ కలకలం సృష్టించింది. షాప్‌లో దూరిన కొండచిలువ వినియోగదారులను భయాందోళనకు గురిచేసింది. దాదాపు 14 అడుగులు, 18 కిలోల బరువు ఉన్న పైథాన్‌ను అటవీ అధికారులు సంరక్షించి అడవిలో విడిచిపెట్టారు.
#उत्तर_प्रदेश #मेरठ: दुकान में विशालकाय अजगर निकला..!!
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) December 5, 2023
अजगर देख बाजार में मची अफरा-तफरी..!!
वन विभाग की टीम ने अजगर को पकड़ा..!!
मेरठ के लालकुर्ती पैठ बाजार का मामला..!! #ViralVideo pic.twitter.com/SwSLAwSpOt
షోరూమ్‌లో దూరిన పైథాన్‌ను ఓ వినియోగదారుడు గుర్తించి యజమానికి తెలియజేశాడు. మొదట యజమాని దాన్ని ఎలుకగా భ్రమించాడు. కానీ వినియోగదారుడు పట్టువీడకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ పైథాన్‌ను చూసిన సిబ్బంది, వినియోగదారులు షోరూం నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.
అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు దాన్ని సురక్షితంగా సంరక్షించారు. అనంతరం అడవిలో విడిచిపెట్టారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని వెల్లడించారు.
ఇదీ చదవండి: కర్ణిసేన చీఫ్ గోగామేడి హత్య కేసులో నిందితులు వీరే..!
Comments
Please login to add a commentAdd a comment