
సాక్షి, కోల్‌కతా : పులిని దూరం నుంచి చూడాలనుకుంటే చూస్కో.. లేదు పులితో ఫోటో దిగాలనుకుంటే దిగు కానీ.. నాతో మాత్రం దిగేందుకు ట్రై చేయోద్దని కొండచిలువ ఒకటి ఓ అటవిశాఖ అధికారికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. 18 అడుగుల పొడవు, 40 కేజీల బరువున్న భారీ కొండచిలువ నుంచి ఓ ఫారెస్ట్ ఆఫీసర్ అదృష్టవశాత్తూ కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పించుకున్నాడు. అతనికి భూమ్మీద ఇంకా నూకలున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంకాలం కోల్‌కతాకు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్పాయిగురి గ్రామంలోకి ఓ కొండచిలువ ప్రవేశించింది. ఈ విషయాన్ని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో సంజయ్ దత్త అనే అటవీ అధికారి అక్కడికి చేరుకొని స్థానికుల సహాయంతో కొండచిలువను తన మెడలో వేసుకున్నారు. అంతటితో ఆగకుండా సంజయ్ దానితో పాటు గ్రామస్తులు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పైథాన్ సంజయ్ మెడను చుట్టే ప్రయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు దానిని లాగి పట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిచ్చి పీక్ స్టేజీకి వెళ్లడమంటే ఇదేనేమో మరీ..
Comments
Please login to add a commentAdd a comment