
కోళ్లను మింగుతున్న కొండచిలువ
బొబ్బిలి రూరల్: మండలంలో జె.రంగరాయపురంలో ఆదివారం గ్రామానికి చెందిన పూడికూర్మారావు పశువుల శాల వద్ద ఎనిమిది అడుగుల కొండచిలువ కోళ్లగూటిలో దూరి నాలుగు కోళ్లను మింగేసింది. అనంతరం ఎటూ కదల్లేక అక్కడే ఇబ్బంది పడసాగింది. గతంలో కూడా కొండచిలువలు గ్రామంలోకి వచ్చి సందర్భాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. వేగావతి నదిలో నుంచి వచ్చి ఉండొచ్చని చర్చించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment