
కర్రలతో కొండచిలువ నోటిని పొడిచి చంపిన దృశ్యం
కాపర్లు వెంటనే కర్రలు, కత్తులతో కొండచిలువపై దాడి చేసి దాన్ని చంపారు. కొండచిలువ నోటిని చీల్చి మేకపిల్లని క్షేమంగా బయటకు తీశారు.
కొయ్యూరు: విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ సింగరాలపాడు అడవిలో శనివారం కొండచిలువ మేకపిల్లను మింగింది. సింగరాలపాడుకు చెందిన మేకల కాపర్లు మేతకోసం మేకలను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. సుమారు ఆరు అడుగుల పొడవున్న కొండచిలువ ఒక మేక పిల్లని మింగింది. కాపర్లు వెంటనే కర్రలు, కత్తులతో కొండచిలువపై దాడి చేసి దాన్ని చంపారు. కొండచిలువ నోటిని చీల్చి మేకపిల్లని క్షేమంగా బయటకు తీశారు.