విశాఖపట్నం: విశాఖపట్నం మురళీనగర్‌లోని బాలభవన్ అనే ప్రైవేటు పాఠశాలో మంగళవారం ఉదయం ఓ పెద్ద కొండచిలువ ప్రత్యక్షమైంది. 13 అడుగుల పొడవున్న దాన్ని చూసి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు.
పాఠశాల సిబ్బంది స్నేహకిరణ్ స్వచ్చంద సంస్థ వారికి సమాచారం ఇచ్చారు. సంస్థ ప్రతినిధులు వచ్చి కొండచిలువను పట్టుకుని జూ సిబ్బందికి అప్పగించడంతో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.