విశాఖపట్నం జిల్లా సీలేరు మండలం దారకొండ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఓ వ్యక్తి మృతదేహాం వెలుగు చూసింది.
ప్రభుత్వ పాఠశాలలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వెలుగు చూసింది. విశాఖపట్నం జిల్లా సీలేరు మండలం దారకొండ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఓ వ్యక్తి మృతదేహాన్ని విద్యార్థులు కనుగొని స్థానికులకు చెప్పారు. స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు మృతుడి వయస్సు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. అతడు గ్రామానికి చెందిన వ్యక్తి కాదని తెలిసింది. మృతుడి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.