బడికొచ్చిన కొండచిలువ
Published Sat, Jan 7 2017 12:45 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
ఆందోల్: సంగారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో కొండచిలువ కలకలం రేపంది. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు పామును చూసి పరుగులు తీశారు. ఈ సంఘటన జిల్లాలోని ఆందోల్ మండలం చింతకుంటలో శనివారం వెలుగుచూసింది. శనివారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో కొండచిలువను చూసి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
Advertisement
Advertisement