
ధారూరు వికారాబాద్ : ఏకంగా 12 అడుగుల కొండచిలువ... దానిని మనం చూస్తేనే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అది అడవిలో ఓ మేకను పట్టేసింది. కాపరి దానిని గమనించి స్థానికుల సాయం కోరాడు. సగంవరకు మింగేసిన మేకను వెనక్కి లేగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
చివరకు చేసేది లేక రైతులు గొడ్డళ్లతో కొండచిలువను మధ్యలో నరికివేశారు. కొండచిలువ పొట్టలో ఉన్న మేకను బయటకు లాగారు. అయితే, అప్పటికే మేక చనిపోయింది. ఈ సంఘటన మంగళవారం ధారూరు మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు కట్ట కింద కట్ట మైసమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది.