
పందెం కోడిపుంజుని మింగి కదలలేని స్థితిలో ఉన్న కొండచిలువ
ఎన్టీఆర్: మండలంలోని మునగపాడు గ్రామ శివారులో పందెం పుంజులను పెంచేందుకు గ్రామానికి చెందిన కలగాని రమేష్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా మినీ కోళ్లఫారం నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఫారంలో పందెం పుంజులు కనిపించకుండా పోతున్నాయి. ఈ క్రమంలో కోళ్ల దొంగను పట్టుకునేందుకు నిర్వాహకుడు ఫారంపై నిఘా ఉంచాడు.
సోమవారం మధ్యాహ్నం పందెం పుంజులను దొంగిలిస్తున్న దొంగను చూసి నిర్వాహకుడు అవాక్కయ్యాడు. తన పందెం పుంజులను దొంగిలిస్తున్నది కొండచిలువ అని గమనించాడు. అప్పటికే ఓ కోడిపుంజుని మింగి కదలలేని స్థితిలో ఉన్న కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్న రమేష్, గ్రామస్తుల సాయంతో సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment