
చెరువులో వలలో చిక్కిన కొండచిలువ
సాక్షి, బాల్కొండ: బాల్కొండ అలీం చెరువులోని చేపలు బయటకు వెళ్లకుండా అలుగుకు కట్టిన వలలో పెద్ద కొండ చిలువ చిక్కింది. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వల దగ్గరికి వెళితే బుసలు కొట్టడంతో వలలోనే బంధించారు. ఈ చెరువులో ఇప్పటి వరకు 8 కొండ చిలువలను చంపినట్లు మత్స్యకారులు తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పూడికతీత పనులు సక్రమంగా చేపట్టలేదన్నారు. పిచ్చి మొక్కలు అధికంగా ఉండడంతో చెరువు కొండ చిలువలకు ఆవాసంగా మారిందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment