
సాక్షి, బాల్కొండ(నిజామాబాద్): పలక బలపం పట్టి బడిలో ఉండాల్సిన చిట్టి తల్లికి ఎంత కష్టం వచ్చింది. హాయిగా ఆడుకోవాల్సిన వయసులో తోపుడు బండిలో చెల్లిని, నీళ్ల బిందెలను పెట్టుకుని తాము ఉంటున్న గూడెం వద్దకు తోసుకుంటూ వెళ్తుంది. బాల్కొండ మండలం బస్సాపూర్ శివారులో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఏర్పడ్డ ఇటుక బట్టీల వద్ద చిన్నారుల దుస్థితి ఇది. తాగు నీటి కోసం చిట్టి తల్లి తోపుడు బండిలో గ్రామానికి వెళ్లి నీళ్లను తీసుకు వస్తోంది.
చదవండి: మరియమ్మ లాక్ అప్ డెత్‌పై హైకోర్టు తీర్పు