పదిహేడు అడుగుల కొండచిలువ పట్టివేత | Scientists Capture Record Huge Python In Florida | Sakshi
Sakshi News home page

పదిహేడు అడుగుల కొండచిలువ పట్టివేత

Published Mon, Apr 8 2019 11:37 AM | Last Updated on Mon, Apr 8 2019 11:37 AM

Scientists Capture Record Huge Python In Florida - Sakshi

శాస్త్రవేత్తల కంటపడ్డ భారీ కొండచిలువ

మియామి : ప్రపంచంలోనే తొలిసారిగా 17 అడుగుల పొడవున్న కొండచిలువను శాస్త్రవేత్తలు పట్టుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో 140 పౌండ్ల బరువుతో, 73 గుడ్ల పొదుగుతో ఈ భారీ పైథాన్‌ శాస్త్రవేత్తల కంటపడింది. దక్షిణ ఫ్లోరిడాకు చెందిన సైప్రస్‌ జాతీయ సంరక్షణ కేంద్రం నుంచి ఈ భారీ కొండచిలువను వెలికితీశామని శాస్త్రవేత్తలు చెప్పారు.

కొండచిలువను పట్టుకునేందుకు శాస్త్రవేత్తలు నూతన ట్రాకింగ్‌ టెక్నాలజీని అనుసరించారని జాతీయ సంరక్షణ కేంద్రం పేర్కొంది. రేడియో ట్రాన్స్‌మిటర్స్‌ను వాడటం ద్వారా శాస్త్రవేత్తలు పైథాన్‌ల జాడ పసిగట్టారని తెలిపింది. శాస్త్రవేత్తల బృందం కొండచిలువలను తొలగించడంతో పాటు వీటిని తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులపై పరిశోధన, జంతు సంరక్షణ కేంద్రాలను పైథాన్‌లు అడ్డాగా ఎలా మలుచుకుంటున్నాయనే దానిపై లోతైన విశ్లేషణ జరపిందని వెల్లడించింది. దక్షిణ ఫ్లోరిడాలోని మియామిలో 7,29,000 ఎకరాల విస్తీర్ణంలో సైప్రస్‌ జాతీయ సంరక్షణ కేంద్రం విస్తరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement