
అమెరికాలో ఒళ్లు గగుర్పుడిచే ఘటన చోటుచేసుకుంది. అత్యంత విషమైన 125 పాములు మధ్య ఓ వ్యక్తి విగత జీవిగా పడిఉండటం తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. మేరీలాండ్‌లోని చార్లెస్ కౌంటీ ప్రాంతంలో నివసించే 49 ఏళ్ల వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వారు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఇంట్లో వ్యక్తి మృతదేహం కిందపడి ఉండగా.. ఆ మృతదేహం చుట్టే 125 పాములు పాకుతూ కనిపించాయి.
అందులో అత్యంత విషపూరితమైన కోబ్రాలతోపాటు, 14 అడుగుల ఓ కొండచిలువ కూడా ఉంది. అయితే ఆ సర్పాలను అతడు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. సహాయక సిబ్బందితో కలిసి పోలీసులు ఆ పాములన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా అతడి మరణానికి ఇంకా కారణాలు తెలియలేదు. అయితే పాములే కాటు వేశాయా.. లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!
Comments
Please login to add a commentAdd a comment