market prices
-
నారికేళం ‘ధర’హాసం
సాక్షి అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధర పతనమై రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నాఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేయించింది. దీంతో కొబ్బరి ధరలు అమాంతంగా పెరిగాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తరువాత పచ్చి కొబ్బరి వెయ్యి కాయలకు రూ.రెండు వేల వరకు ధర పెరగ్గా.. ఎండు కొబ్బరి క్వింటాల్‌కు రూ.500 చొప్పున పెరగడం విశేషం. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. ఉభయ గోదావరి జిల్లాలలోనే అత్యధికంగా 1.78 లక్షల ఎకరాల్లో ఉంది. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం సగటున 106.9 కోట్ల కాయల దిగుబడిగా వస్తోంది. ఇందులో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.03 లక్షల ఎకరాలు, కాకినాడ జిల్లాలో 20 వేల ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 18,754 ఎకరాల్లో సాగు కొబ్బరి సాగవుతోంది. నాఫెడ్ కేంద్రాలు.. వరుస పండుగలతో.. రాష్ట్రంలో కొబ్బరి మార్కెట్ ధరలు అంబాజీపేట మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. కొబ్బరి ధరలు పతనం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కోనసీమ జిల్లాలో నాఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేయించింది. ప్రస్తుతానికి అంబాజీపేట మార్కెట్ యార్డు కేంద్రంగా కార్యకలాపాలకు అధికారులు సిద్ధమయ్యారు. తొలిసారి ఆర్బీకేల ద్వారా కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మిల్లింగ్ కోప్రా (ఎండు కొబ్బరి)ను క్వింటాల్‌ను రూ.10,860, బాల్ కోప్రా (కురిడీ కొబ్బరి గుడ్డు) క్వింటాల్ రూ.11,750 చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో కొబ్బరి మార్కెట్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఈ పరిస్థితుల్లో స్థానిక వ్యాపారులు దిగి వచ్చి ధరలు పెంచారు. మరోవైపు దసరా, దీపావళి, కార్తీక మాసం రావడంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు జోరందుకున్నాయి. దీంతో పచ్చికాయ, ముక్కుడు కాయల ధరలు పెరిగాయి. ప్రస్తుత మార్కెట్లో వెయ్యి కాయల ధర రూ.8 వేల నుంచి రూ.8,500 వరకు ఉంది. గడచిన 10 రోజులలో ధర రూ.2 వేల వరకు పెరగడం విశేషం. -
ముగిసిన రబీ ఉత్పత్తుల కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: రబీ ఉత్పత్తుల సేకరణ ముగిసింది. రైతులకు మద్దతు దక్కని పంట ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం రికార్డు స్థాయిలో సేకరించింది. ధరల స్థిరీకరణ ద్వారా ఏటా ప్రతి సీజన్లోను మార్కెట్లో మద్దతు ధర లభించని పంట ఉత్పత్తులను సేకరిస్తూ నాలుగేళ్లుగా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. అదేరీతిలో 2022–23లో ఖరీఫ్, రబీ సీజన్లలో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఫలితంగా మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మద్దతు ధరకు మించి పెరిగాయి. సీఎం యాప్ ద్వారా రోజూ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తూ కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఖరీఫ్ 2021 సీజన్ చివరిలో మార్కెట్ ధరలు తగ్గడంతో ప్రభుత్వాదేశాలతో 3,513 మంది రైతుల నుంచి రూ.24.61 కోట్ల విలువైన 8,384 టన్నుల సజ్జలు, పెసలు, మొక్కజొన్న, రాగులు, కందులు సేకరించారు. గడిచిన ఖరీఫ్–2022 సీజన్లో సజ్జలు మినహా మిగిలిన పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధరలు దక్కడంతో రైతులకు మంచి లాభాలొచ్చాయి. సజ్జలను మాత్రమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశారు. 564 మంది రైతుల నుంచి రూ.3.94 కోట్ల విలువైన 1,676 టన్నులు కొనుగోలు చేశారు. రబీ 2021–22 సీజన్లో 33,566 మంది రైతుల నుంచి రూ.426 కోట్ల విలువైన 84,773 టన్నుల శనగలు, జొన్నలు, పసుపు, పెసలు సేకరించారు. ఇటీవల ముగిసిన రబీ 2022–23 సీజన్లో 39,479 మంది రైతుల నుంచి రూ.510.74 కోట్ల విలువైన 1,39,262 టన్నుల శనగలు, మొక్కజొన్న, పసుపు సేకరించారు. ప్రధానంగా 28,112 మంది రైతుల నుంచి రూ.336.83 కోట్ల విలువైన 63,132 టన్నుల శనగలు, 9,110 మంది రైతుల నుంచి రూ.139.52 కోట్ల విలువైన 71,110 టన్నుల మొక్కజొన్న, 2,257 మంది రైతుల నుంచి రూ.34.39 కోట్ల విలువైన 5,020 టన్నుల పసుపు సేకరించారు. శనగలకు సంబంధించి నూరుశాతం చెల్లింపులు చేయగా, మొక్కజొన్న రైతులకు రూ.139.06 కోట్లు, పసుపు రైతులకు రూ.7.48 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ.27.37 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. గడిచిన రబీ సీజన్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో మొక్కజొన్న ధర రూ.1,500 నుంచి రూ.2 వేలకుపైగా పెరిగింది. అదేరీతిలో కందులు, పెసలు, మినుములు వంటి అపరాల ధరలు కూడా రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,322.15 కోట్ల విలువైన 9.01 లక్షల టన్నుల పరిమాణం కలిగిన 12 రకాల పంట ఉత్పత్తులను సేకరించగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏకంగా రూ.7,712.32 కోట్ల విలువైన 21.56 లక్షల టన్నుల పరిమాణం కలిగిన 17 రకాల పంట ఉత్పత్తులను సేకరించింది. గతంలో ఏన్నడూ లేనివిధంగా అరటి, పత్తి, పొగాకు, బత్తాయి. టమాటా పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు సేకరించి రైతులకు అండగా నిలిచింది. -
దెబ్బకు దిగొచ్చిన ప్రైవేటు బంకులు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్‌ను రిటైల్‌గా విక్రయించే రిలయన్స్ బీపీ, నయారా ఎనర్జీ సంస్థలు ఏడాది తర్వాత మార్కెటింగ్ ధరలను అనుసరిస్తున్నాయి. ఇంతకాలం ఇవి ప్రభుత్వరంగ ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీ పెట్రోల్ బంకులతో పోలిస్తే కాస్త అధిక రేట్లకే అమ్మకాలు సాగించాయి. అయినా కానీ, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే గణనీయ నష్టాలను చవిచూశాయి. దీనికి కారణం ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఏడాదికి పైగా ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు దిగి రావడంతో రిలయన్స్–బీపీ, నయారా ఎనర్జీ, షెల్ సంస్థలు ప్రభుత్వరంగ సంస్థలు అనుసరిస్తున్న మార్కెట్ ధరలకే విక్రయించడం మొదలుపెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా గత ఆరు వారాల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. దీంతో నష్టాలు కూడా తగ్గిపోవడంతో పీఎస్‌యూ పెట్రోల్ బంకుల్లో విక్రయించే రేట్లనే రిలయన్స్ బీపీ, షెల్, నయారా అనుసరిస్తున్నాయి. నయారాకు దేశవ్యాప్తంగా 86,855 పెట్రోల్ పంపులు ఉన్నాయి. మార్చి నెల నుంచే మార్కెట్ రేట్లకు విక్రయాలు మొదలు పెట్టింది. రిలయన్స్ బీపీ సంస్థకు 1,555 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఈ నెల నుంచి డీజిల్‌ను మార్కెట్ ధరలకు (ప్రభుత్వరంగ సంస్థలు పాటించే) విక్రయాలు చేస్తోంది. రిలయన్స్ బీపీ సంస్థ ప్రత్యేకమైన డీజిల్‌ను మన దేశంలో విక్రయిస్తోంది. మన దేశ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా, మెరుగైన మేలేజీ వచ్చేలా అడిటివ్స్ కలిపి విక్రయిస్తోంది. -
ఎమ్మెస్పీకి మించి మార్కెట్ ధరలు
సాక్షి, అమరావతి: గతంలో విత్తుకునే సమయంలో ఉండే ధర పంటలు కోతకోసే నాటికి ఉండేది కాదు. దీంతో కాస్త మంచిరేటు వచ్చేవరకు మార్కెట్ గోదాముల్లో నిల్వచేసుకుని, ‘రైతుబంధు’ పథకం కింద రుణాలు తీసుకుని సాగుకోసం పెట్టిన అప్పులను తీర్చుకునేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో పండే ప్రధాన వ్యవసాయ, ఉద్యాన పంటలకు గతంలో ఎన్నడూలేని రీతిలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లకు మించి మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. కల్లాల నుంచి నేరుగా కొనేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. ఫలితంగా తాము పండించిన పంట ఉత్పత్తులను నిల్వచేసుకునేందుకు గోదాముల వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. రుణాలు పొందేందుకు ఆసక్తి చూపడంలేదు. ఈ వాస్తవాలను తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా ఈనాడు కట్టుకథలను అచ్చేస్తూ నిత్యం అభాసుపాలవుతోంది. ఏటా బడ్జెట్ కేటాయింపులు.. కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులకు మంచి ధర లభించేంత వరకు వారికి అండగా నిలిచేందుకు ఉద్దేశించిందే రైతుబంధు పథకం. మార్కెట్ గోదాముల్లో నిల్వచేసిన పంట ఉత్పత్తులపై గరిష్టంగా రూ.2 లక్షల వరకు అందించే రుణంపై 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఆ తర్వాత 181వ రోజు నుంచి 270 రోజుల వరకు 12శాతం చొప్పున వడ్డీ వసూలుచేస్తారు. ఈ పథకానికి 2019–20లో రూ.70 కోట్లు, 2020–21లో రూ.70 కోట్లు, 2021–22లో రూ.80 కోట్లు కేటాయించగా, గడిచిన 2022–23లో ఏకంగా రూ.90 కోట్లు కేటాయించింది. 2019–20లో ఈ పథకం కింద తమ పంట ఉత్పత్తులను నిల్వచేసుకోవడం ద్వారా 1,826 మంది రూ.17.23 కోట్ల రుణాలు పొందగా, 2020–21లో 517 మంది రూ.71లక్షలరుణాలు పొందారు. ఎమ్మెస్పీకి మించి మార్కెట్ ధరలు సీఎం యాప్ ద్వారా గ్రామస్థాయిలో పంట ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఎమ్మెస్పీకి మించి ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుంటూ ధరలు పెరిగేలా చేస్తోంది. సాధారణ, గ్రేడ్–ఏ రకం ధా న్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఫలితంగా ఇతర పంట ఉత్పత్తులకు కూడా మంచి రేటు పలుకుతోంది. కోతల దశలోనే ఎమ్మెస్పీకి మించి ధరలు పలుకుతుండడంతో మంచి ధర కోసం పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వచేసుకోవడం, రైతుబంధు పథకం కింద రుణాలు పొందాలన్న ఆసక్తి రైతుల్లో కనిపించడంలేదు. కళ్లెదుట వాస్తవాలిలా ఉంటే.. రైతుబంధు పథకాన్నే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసినట్లు, పంట నిల్వచేసుకునే రైతులకు రుణాలివ్వడానికి ప్రభుత్వం ముఖం చాటేసినట్లుగా ఈనాడు విషప్రచారం చేస్తుండడంపట్ల రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుబంధుకు ఏటా కేటాయింపులు మార్కెట్లో మించి ధరలు లభిస్తుండడంవల్లే గోదాముల్లో దాచుకునేందుకు రైతులు ముందుకు రావడంలేదు.అలాగే రైతులెవ్వరూ రైతుబంధు పథకం కింద రుణం పొందేందుకు ముందుకు రావడం లేదు. దీనిని రద్దు చేయడంగానీ, ఏటా నిధుల కేటాయింపులు ఆపడంగానీ చేయలేదు. రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – రాహుల్ పాండే, కమిషనర్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ -
అమాంతంగా పెరిగిన నిమ్మ ధర.. రేటు ఎంతంటే..?
హనుమంతునిపాడు/కనిగిరి రూరల్: నిమ్మ రైతు పంట పండింది. నిన్న మొన్నటి వరకూ సరైన ధరల్లేక దిగాలుగా ఉన్న రైతుకు మార్కెట్ ధరలు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. వారం రోజుల కిందట వరకూ కిలో రూ.10 నుంచి రూ.15 పలికింది. నేడు మార్కెట్లో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30 వరకూ పలుకుతున్నాయి. నాణ్యత పెరగడంతో పాటు ఉత్పత్తి తగ్గడంతో నిమ్మకు డిమాండ్ పెరిగింది. రానున్న రోజుల్లో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలోనే అత్యధికంగా నిమ్మతోటల సాగు కనిగిరి నియోజకవర్గంలోనే జరుగుతోంది. వ్యాపారులు, రైతుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల వరకు నిమ్మ సాగవుతోంది. ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే సుమారు 32 వేల ఎకరాల వరకు సాగు ఉన్నట్లు అంచనా. అందులో హెచ్ఎం పాడు మండలంలో 20 వేల ఎకరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత సీఎస్ పురం, వెలిగండ్ల మండలాల్లో దాదాపు 12 వేల ఎకరాల వరకు సాగవుతోంది. యర్రగొండపాలెం, చీమకుర్తి, దర్శి, చినారికట్ల, కొణిజేడు తదితర ప్రాంతాల్లో నిమ్మ సాగు చేస్తున్నట్టు సమాచారం. టీడీపీ హాయంలో వర్షాలు లేక చాలా వరకు నిమ్మ తోటలను రైతులు నరికేశారు. వర్షాలు పడక, బోర్ల కింద సాగుచేసిన పంటలకు పెట్టుబడులు పెరిగి వాటికి గిట్టుబాటు ధరల్లేక అల్లాడారు. చాలా మంది తోటలపైనే కాయలు వదిలేశారు. అయినప్పటికీ జిల్లాలో హెచ్ఎం పాడులోనే అత్యధికంగా నిమ్మ సాగు ఉంది. ఈ మండలంలోని ఎర్రనేలలో పండే నిమ్మకు ఎక్కువ శాతం గిరాకీ ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కలిసి వచ్చిన కాలం... ప్రస్తుత కాలంలో వర్షాలు పడి భూగర్భ జలాలు పెరగడంతో రైతులు మళ్లీ నిమ్మతోటల సాగుకు ముందుకొచ్చారు. ఫలితంగా లేత తోటలు అధికంగా ఉండి ముదురు తోటలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో దిగుబడి రోజుకు నాలుగు, ఐదు లారీలు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు లారీల లోడు మాత్రమే మార్కెట్‌కు వస్తోంది. దీంతో సీజన్ ప్రారంభం కావడం, డిమాండ్‌కు తగిన సరుకు అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా రూ.10 నుంచి రూ.15 వరకు ధర పెరిగింది. గతంలో ఆటోలు, కూలీల ఖర్చులకుపోను నామ్‌కే వాస్తే ఆదాయంతో దిగాలు చెందుతున్న రైతన్నకు ఒక్కసారి ధరలు పెరగడంతో వారి మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో నిమ్మ ధర రూ.25 నుంచి రూ.30 మధ్య పలుకుతోంది. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వేసవిలో రూ.50కి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. కనిగిరి టూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు... కనిగిరి పట్టణంలో సుమారు 6 వరకు హోల్‌సేల్ వ్యాపార దుకాణాలున్నాయి. సీజన్లో రోజుకు సుమారు 5 నుంచి 6 లారీలు 50 వేల టన్నుల నిమ్మకాయలను చెన్నై, హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఎక్కువగా చెన్నై, బెంగళూరు మార్కెట్‌కు వెళ్తాయి. అయితే ప్రస్తుతం 2 లారీల నిమ్మకాయలు మాత్రమే మార్కెట్‌కు వస్తున్నాయి. ప్రస్తుతం కేజీ రూ.30 వరకు తీసుకుంటున్నాం వారం రోజుల వరకు కూడా పండు కాయ కేజీ రూ.10కి, పచ్చి కాయ రూ.15కి కొనేవాళ్లం. ప్రస్తుతం కాయ ఎగుమతికి డిమాండ్ రావడం, సరుకు దిగుబడి, ఉత్పత్తి తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పండు కాయ రూ.15కు, పచ్చికాయ రూ.28 నుంచి రూ.30 వరకూ కొనుగోలు చేస్తున్నాం. ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. మార్చి నెలాఖరునాటికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. – నర్సయ్య, హోల్ సేల్ వ్యాపారి -
గిట్టుబాటు ధర అందేలా కృషిచేస్తా
సాక్షి, హైదరాబాద్: పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెటింగ్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని శుక్రవారం రైతు సమన్వయ సమితి కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఆయనను చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..తాను సమర్ధవంతంగా పనిచేస్తాననే నమ్మకంతో కేసీఆర్ ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. రైతులను సంఘటితం చేయడమే రైతు సమన్వయ సమితి లక్ష్యమన్నారు. త్వరలో రాష్ట్రంలోని సమన్వయ సభ్యులందరితో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతు సమన్వయ సమితి సభ్యుల విధులు, బాధ్యతలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కృషిచేస్తామన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ..పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా విజయం సాధిస్తారని చెప్పారు. తెలంగాణ రైతులు అదృష్టవంతులని హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. సమితి చైర్మన్‌గా రాజేశ్వర్‌రెడ్డి రైతుల సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకముందన్నారు. పల్లా బాధ్యతల స్వీకారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతు సమస్వయ సభ్యు లు అభినందనలు తెలిపారు. ఆయనకు అభినందనలు తెలిపిన వారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, మంత్రులు పాల్గొన్నారు. -
కందులు కొనేదేవరు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో పండించిన పంటలను కొనే దిక్కు లేకుండాపోయింది. పూర్తిస్థాయిలో రైతుల వద్ద కందులు కొనాల్సిన మార్క్‌ఫెడ్ సంస్థ అర్ధంతరంగా చేతులెత్తిసింది. దీంతో రైతులు పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కొనుగోలు చేసిన పంటకు కూడా నాణ్యత ప్రమాణాల పేరిట ఇబ్బందులకు గురి చేసిన మార్క్‌ఫెడ్ ఇక నుంచి కందుల కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన కందులను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక ఎంతకో కొంతకు ప్రైవేటులో అమ్ముకొని నష్టపోతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం లక్షా 90 వేల ఎకరాలు కాగా..ఇందులో దాదాపు 30 వేల ఎకరాల వరకు కంది సాగు చేశారు. దాదాపు లక్షా 88 వేల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని ఆదిలాబాద్, జైనథ్, ఇచ్చోడ, బోథ్, బేల, తాంసి, నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ కేంద్రాల్లో నాఫెడ్ ద్వారా కందులను మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జనవరి 22న కొనుగోళ్లు ప్రారంభించారు. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.5,675 చెల్లించారు. కానీ కనీసం నెల రోజులు కూడా కందులు కొనుగోలు చేయకుండా అర్ధంతరంగా నిలిపివేశారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 61,457.50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. అయితే గతేడాది మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా 3,81,729 క్వింటాళ్ల కందులు కొన్నారు. నాఫెడ్ ద్వారా 15,681 క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్ ద్వారా 2,14,399 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు దిగుబడి వస్తుందన్న అంచనా వేసిన పంటలో ఈ ఏడాది కనీసం 50 శాతం కూడా కంది పంటను కొనుగోలు చేయకపోవడం గమనార్హం. అర్ధంతరంగా కొనుగోళ్లు నిలిపివేత జిల్లాలో మార్క్‌ఫెడ్ అధికారులు నాఫెడ్ ద్వారా 9 మార్కెట్ యార్డుల్లో కందుల కొనుగోళ్లను జనవరి 22 తర్వాత ప్రారంభించారు. సెలవు దినాలు వదిలేస్తే కనీసం 15 రోజులు కూడా కొనుగోలు చేయలేదు. హైదరాబాద్ మార్క్‌ఫెడ్ అధికారుల ఆదేశాల మేరకు 58 వేల క్వింటాళ్ల టార్గెట్ కాగా అదనంగా రెండు వేల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రైతుల వద్ద దాదాపు 80 వేల క్వింటాళ్లకు పైగా కందులు ఇంకా నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండా శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జైనథ్, బేల మార్కెడ్ యార్డులలో కొనుగోళ్లు నిలిపివేయడంలో రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. డబ్బులు చెల్లించని వైనం.. కంది పంటను కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్ అధికారులు ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా డబ్బులు చెల్లించలేదు. దీంతో కార్యాలయం చుట్టు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. పంటను కోసిన కూలీలకు డబ్బులు చెల్లించేందుకు అవస్థలకు గురవుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో 61,150 క్వింటాళ్లకుగాను 34,70,68,812 డబ్బులు చెల్లించాల్సి ఉంది. కొనుగోలు చేసి 20 రోజులు గడుస్తున్నా అధికారులు డబ్బులు మాత్రం అకౌంట్లో జమ చేయకపోవడంతో రైతులు బ్యాంకులు, కార్యాలయం చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నారు. రెండు రోజుల్లో జమచేస్తాం కొనుగోలు చేసిన కందులకు సంబంధించి రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమచేస్తాం. 61 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా నాఫెడ్ నుంచి రూ.17 కోట్లు వచ్చాయి. మిగతా డబ్బులు వచ్చిన వెంటనే జమ చేస్తాం. నాఫెడ్ ద్వారా 58 వేల క్వింటాళ్లను కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వగా 61వేల క్వింటాళ్లు కొనుగోలు చేశాం. రైతుల వద్ద ఉన్న కందులను కొనుగోలు చేసేందుకు ఉన్నతాధికారులకు నివేదించాం. అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాక మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తాం. – పుల్లయ్య, మార్క్‌ఫెడ్, మేనేజర్ ఆదిలాబాద్ -
అసలు సమస్య అసమర్థ మార్కెట్లే!
రెండు దశాబ్దాలుగా ఇండియాలో వ్యవసాయోత్పత్తుల ధరలు మారకుండా స్తంభించిపోయాయని ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘం సర్వే వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్బణం అదుపులో ఉండేలా చేయడానికి ఇన్నేళ్లుగా రైతులకు ఉద్దేశపూర్వకంగానే 15 శాతం తక్కువగా ధరలు చెల్లిస్తున్నారు. అయితే, అంతే స్థాయిలో వారికి మేలు చేయడానికి అవసరమైన సొమ్ము నేరుగా చెల్లించే పద్ధతి అమల్లో లేకపోవడంతో భారత రైతులు కష్టాల కొలిమిలో చిక్కుకుపోతున్నారు. ఓ పక్క ఉత్పత్తి ఖర్చులు పెరగడం, వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం, ధరల్లో విపరీత మార్పులు రావడంతో అసమర్థ వ్యవసాయ మార్కెట్లకు భారత రైతు బలి అవుతున్నాడు. దాదాపు 40 ఏళ్లుగా భారత రైతులు టమాటాలు పండిస్తూ పొందుతున్న సగటు ధర మారలేదు. 1978లో లభించిన ధరకూ 2018 ధరకూ పెద్దగా తేడా లేదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇంకా టమాటా ధర స్పల్పంగా తగ్గినట్టే. పంట ఖర్చులు కూడా రాకపోవడంతో గత రెండేళ్లలో ఆగ్రహించిన రైతులు పండించిన టమాటాలను వీధుల్లో పారబోయడం మనం చూస్తున్నదే. 1980ల ఆరంభంలో సైతం రైతులు టమాటాలను పశువులకు దాణాగా పెట్టడం లేదా రోడ్లపై వదిలి రావడం నాకింకా గుర్తుంది. సరుకు రవాణా, వ్యాపారులు బహిరంగంగా పాల్గొనడంపై ఆంక్షలు ఉండటంతో దేశంలో నిజమైన జాతీయ మార్కెట్ లేదు. దీంతో వ్యవసాయోత్పత్తులకు దేశంలో సమర్థంగా పనిచేసే మార్కెట్ ఇంకా అవతరించలేదనే చెప్ప వచ్చు. కేవలం ఆరు శాతం రైతులకు కనీస మద్దతు లభిస్తుండగా, మిగి లిన 94 శాతం కర్షకులు మార్కెట్లపైనే ఆధారపడుతున్నారు. తక్కువ ధరలకే వ్యవసాయోత్పత్తులు దొరకడం మార్కెట్ సామర్థ్యానికి ప్రతి బింబం కాదు. ఈ విషయంలో మరింత అవగాహన కోసం అమెరికాలో ఈ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. అమెరికా మార్కెట్ ధరల విష యంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా వ్యవసాయోత్పత్తుల మార్కెట్లలో పోటీతత్వం ఎక్కువ. ఇక్కడ పెద్ద వ్యాపారులు, సంస్థలు సునాయాసంగా పనిచే యడం సర్వసాధారణం. భవిష్యత్తులో క్రయవిక్రయాలకు సంబంధించి ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ధరలు రైతులకు అనుకూలంగా ఉంటాయి. అమెరికా రైతు మైక్ కాలిక్రాట్ తన బ్లాగ్‌లో వ్యాసం రాస్తూ, ‘‘44 ఏళ్ల క్రితం నా తండ్రి 1974 డిసెంబర్ 2న ఒక బుషల్ (25.4 కిలోలు) మొక్కజొన్నను 3.58 డాలర్లకు అమ్మాడు. 2018 జనవరిలో నేను రెండు సెంట్లు తగ్గించి 3.56 డాలర్లకు విక్రయించాను’’ అని వివరించాడు. కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌కు చెందిన రైతు ఫిలిప్ షా ఈ ఏడాది జనవరి ధరతో పోల్చితే మరో నాలుగు సెంట్లు తగ్గించి 2018 సెప్టెంబర్ 12న మొక్కజొన్నను 3.52 డాలర్లకు అమ్మానని ఓ ట్వీట్లో వెల్లడించారు. ‘‘1974లో మొక్కజొన్న పంట ప్రారంభించిన రైతు ఎవరైనా తాను రిటైరయ్యే సమయానికి కూడా పాత ధరకే అమ్ముకోక తప్పదు’’ అని మైక్ తన బ్లాగ్‌లో అభిప్రాయపడ్డాడు. ఈ మార్కెట్లు అంత సమర్థంగా పనిచేసేవైతే, వ్యవసాయోత్పత్తుల ధరలు ఇంత అడ్డగోలుగా చలనం లేకుండా ఉండకూడదు. మొక్కజొన్న పండించే రైతుకు దక్కాల్సిన ధర ఎంతో 44 ఏళ్లుగా ఈ మార్కెట్లు నిర్ణయించడంలో విఫలమయ్యాయని పైవివరాలు చెబుతున్నాయి. అంటే ఇవి సమర్థ మార్కెట్లు కాదనే చెప్పాలి. పై అమెరికా రైతు చెప్పి నట్టు, ఇదే సమయంలో విత్తనాలు, భూమి, పరికరాలు, ఎరువులు, ఇంధనం ధరలు బాగా పెరుగుతున్నాయిగానీ ఉత్పత్తుల ధరలు మాత్రం మారలేదు. ఇంతకన్నా బాధాకరమైన అంశం ఏముంటుంది. అమెరికాలోనూ 1960 నుంచీ వాస్తవ ధరలు తగ్గాయా? అమెరికా వ్యవసాయ శాఖ ప్రధాన ఆర్థికవేత్త రాబర్ట్ జొహాన్సన్ 2018 వ్యవసాయ ఆర్థిక, విదేశీ వాణిజ్య వేదిక సమావేశంలో ప్రసంగిస్తూ, ‘‘ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే వాస్తవ వ్యవసాయోత్పత్తుల ధరలు 1960 నుంచీ బాగా తగ్గిపోయాయి. అమెరికాలో ఇలాగే జరుగు తోంది. మీరు విన్నది నిజమే. రైతుకు న్యాయమైన ధర మార్కెట్లో చెల్లించలేకపోవడంతో ఏటా ప్రతి రైతుకూ అమెరికా ప్రభుత్వం సబ్సిడీ కింద 50 వేల డాలర్లు అందిస్తోంది,’’అని వివరించారు. రెండు దశాబ్దా లుగా ఇండియాలో వ్యవసాయోత్పత్తుల ధరలు మారకుండా స్తంభించి పోయాయని ఇటీవల ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘం(ఓఈసీడీ) సర్వే వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్బణం అదుపులో ఉండేలా చేయ డానికి ఇన్నేళ్లుగా రైతులకు ఉద్దేశపూర్వకంగానే 15 శాతం తక్కువగా ధరలు చెల్లిస్తున్నారు. అయితే, అంతే స్థాయిలో వారికి మేలు చేయడానికి అవసరమైన సొమ్ము నేరుగా చెల్లించే పద్ధతి అమల్లో లేకపోవడంతో భారత రైతులు కష్టాల కొలిమిలో చిక్కుకుపోతున్నారు. ఓ పక్క ఉత్పత్తి ఖర్చులు పెరగడం, వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గి పోవడం, ధరల్లో విపరీత మార్పులు రావడంతో సమర్థంగా పనిచేయని వ్యవసాయ మార్కెట్లకు భారత రైతు బలి అవుతున్నాడు. అయితే, అనవసర ఆంక్షలు తొలగించి వ్యవసాయ మార్కెట్లను మరింత సరళతరం చేయడం ద్వారానే రైతులకు సరైన ధరలు దక్కేలా చూడవచ్చనే భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. అప్పుడే వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు లభ్యమౌతాయనేది అందరికీ ఆమోదయోగ్యమైన అభిప్రాయం. అయితే, స్వేచ్ఛ విపణికి పేరుపొందిన అమెరికాలోని మార్కెట్లలో సైతం వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోయే స్థాయిలో వ్యవసాయోత్పత్తుల ధరలు పెరగడం లేదు. ఈ విషయం ఎవరూ బహిరంగంగా అంగీకరిం చకపోవడం విశేషం. ఖరీఫ్ పంట కోతల కాలం మొదలైంది. ఫలితంగా మూంగ్ పెసలు, మినుములు, వేరుశనగలు, సజ్జలు, జొన్నల ధరలు ఇప్పటికే మార్కెట్లలో కనీస మద్దతు ధర కన్నా తక్కువ పలుకుతు న్నాయి. పెసల ధరల విషయమే తీసుకుందాం. క్వింటాలు పెసల కనీస మద్దతు ధర రూ. 6,975 కాగా, మధ్యప్రదేశ్‌లోని పప్పు ధాన్యాల మార్కె ట్లలో కిందటి వారం ధరలు కేవలం రూ.3,900–4,400 మధ్య ఊగిస లాడాయి. మహారాష్ట్రలో క్వింటాలు పెసలకు లభించే గరిష్ట ధర రూ. 4,900. ఇక మినుముల విషయానికి వస్తే, కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,600 ఉండగా, మహారాష్ట్ర వ్యవసాయోత్పత్తుల మండీల్లో రైతులకు లభించే ధర క్వింటాలుకు రూ. 3,900 నుంచి రూ. 4,200 మధ్యనే ఉంటోంది. పప్పు ధాన్యాల క్రయవిక్రయాల సీజన్ ఆరంభంలోనే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది. మరి మార్కెట్‌కు ఈ పప్పుధాన్యాల రవాణా అత్యధిక స్థాయికి చేరుకున్నప్పుడు వీటి ధరలు ఎంతగా క్షీణించిపోతాయో ఊహించుకోవచ్చు. గడచిన రెండేళ్ల అనుభ వాలను బట్టి చూస్తే, దేశవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తుల మార్కెట్లలో పప్పు ధాన్యాల ధరలు 20 నుంచి 40 శాతం వరకూ పడిపోయాయి. ఈ లెక్కన ఈ సంవత్సరం పప్పుధాన్యాల ధరలు పెరుగుతాయని అంచనా వేయడం అత్యాశే అవుతుంది. అసలు సమస్య అసమర్థ మార్కెట్లే! రైతులను అప్పుల విష వలయం నుంచి కాపాడటంలో వ్యవసాయ మార్కెట్లు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (ప్రధానమంత్రి రైతుల ఆదాయ పరిరక్షణ పథకం–పీఎం ఆశా) ప్రారంభించడం అంటే రైతులకు అవస రాలు తీర్చేస్థాయిలో కనీస ఆదాయం సమకూర్చాలన్న వాస్తవాన్ని గుర్తించనట్టు లెక్క. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి, ఇతర రంగాలకు ఆదాయంలో ఉన్న వ్యత్యాసాలను తగ్గించడానికి కీలక చర్యగా ఈ పథకాన్ని పరిగణించవచ్చు. రైతులకు తగినంత ఆదాయం వచ్చేలా చూడటం నేటి తక్షణావసరంగా ప్రభుత్వం గుర్తించింది. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం–ఆశా) పథకంలో భాగంగా వాస్తవానికి ప్రభుత్వం మూడు పథకాలను అమలు చేస్తుంది. ప్రస్తుత వ్యవసాయ కనీస మద్దతు ధరల పథకాన్ని కొనసా గిస్తుంది. అలాగే, మధ్యప్రదేశ్ ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసిన వ్యవసాయోత్పత్తుల ధరల లోటు చెల్లింపుల పథకాన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు. మూడో పథకం కింద వ్యవసాయో త్పత్తుల సేకరణ రంగంలోకి ప్రైవేటు వ్యాపారులను, సంస్థలను ప్రయో గాత్మకంగా అనుమతిస్తారు. ఇది నూనె గింజల రంగంతో మొదలవు తుంది. ఈ పథకం అమలును అత్యంత క్షుణ్ణంగా పరిశీలించి, అంచనా వేయాల్సి ఉంటుంది. రైతుల సమస్యలను ప్రభుత్వాలు అమలు చేస్తున్న కనీస మద్దతు ధరలే పరిష్కరించి, వారిని ఒడ్డున పడేయలేవని గత అనుభవాలే చెబుతున్నాయి. వ్యవసాయోత్పత్తులకు ప్రభుత్వం అధిక కనీస మద్దతు ధర ప్రకటించినా (ఇది రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నదాని కన్నా తక్కువగా ఉన్నాగాని) మార్కెట్లో అమ్ముకునే వీలున్న మొత్తం సరుకులో 25 శాతం కొనుగోలు చేస్తామన్న సర్కారీ వాగ్దానం అమలు చేయడం అంత తేలిక కాదు. తగినన్ని పంటల మార్కెట్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగలిగినప్పుడే ఇది సాధ్యమౌతుంది. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక్కటి చొప్పున 42,000 వ్యవసాయోత్ప త్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) మండీల(మార్కెట్లు) అవసరం ఉండగా, భారతదేశంలో కేవలం 7,600 మండీలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏపీఎంసీల నిర్వహణలోని మార్కెట్లను విపరీతంగా విస్తరించాల్సిన అవసరం ఓ పక్క ఉండగా, పంట ఉత్పత్తుల ధరలకు మద్దతు ఇవ్వ డానికి తగినంత ఆర్థిక ఏర్పాట్లు అత్యంత కీలకం. కనీస మద్దతు ధరల కోసం వచ్చే రెండు సంవత్సరాల కోసం కేంద్ర బడ్జెట్లో కేటాయించిన రూ. 15,053 కోట్లు ఏమాత్రం చాలదు. 2008లో సంక్షోభంలో చిక్కు కున్న భారత కార్పొరేట్ రంగాన్ని కాపాడటానికి రూ.1,86,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కల్పించారు. దీన్నింకా ఉపసంహరించలేదు. అలాంటప్పుడు, వ్యవసాయోత్పత్తుల సేకరణకు తగినంత మద్దతు ధరలతో అలాంటి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో అర్థంకావడం లేదు. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
‘మాస్’ ఓ గుదిబండే..!
సాక్షి, హైదరాబాద్ : గోధుమ, వరి మినహాయించి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ల పరిధిలోకి వచ్చే ఇతర పంటల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన మార్కెట్ హామీ పథకం(మాస్)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండించిన పంటలను ఎంఎస్పీకి కొనుగోలు చేసే వ్యవస్థను బలోపేతం చేసేందుకే మాస్‌ను తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రైతుల నుంచి ఎంఎస్పీకి పంటను కొనుగోలు చేశాక, ఆయా ఉత్పత్తులను తిరిగి వివిధ సంస్థలకు ఎప్పుడు అమ్మాలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి. పంటలను బయట విక్రయించేప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఎంఎస్పీ విలువలో 40–50% వరకు నష్టం వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. అయితే 50% కంటే ఎక్కువ నష్టం వస్తే రాష్ట్రాలే భరించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధన రాష్ట్రాలకు గుదిబండగా మారే ప్రమాదముందన్న విమర్శలున్నాయి. రాష్ట్రల సంస్థలకు భారీగా నష్టం..: రైతుల నుంచి కొనుగోలు చేశాక పంటను అమ్మే క్రమంలో ఆయా రాష్ట్రాల సంస్థలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అనుసరించాల్సిన వ్యవసాయ ప్రణాళికపై కేంద్రం ఇటీవల రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాస్ పథకంపై దిశానిర్దేశం చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్ పాల్గొన్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి నూతనంగా ధరల లోటు సేకరణ పథకం(పీడీపీఎస్) కూడా కేంద్రం ప్రారంభిస్తోంది. రైతు ఉత్పత్తి చేసిన పంటకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర, మార్కెట్లో లభించే వాస్తవ ధరకు మధ్య తేడాను ఈ పథకం కింద కేంద్రం అందజేయనుంది. వ్యవసాయ మార్కెట్లో రిజిస్టర్ చేయించుకున్న రైతులకు ఇది వర్తింపజేస్తారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు సహా ఇతర పంటలకు ఏటా కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తుంది. సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం.. : సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు నూతన మార్గదర్శకాలను ఖరారు చేసింది. పరంపరాగత్ క్రిషి వికాస్ యోజన (పీకేవీవై) కింద దీన్ని అమలు చేస్తారు. క్లస్టర్ల పరిమాణాన్ని 2,500 ఎకరాలకు పెంచారు. సేంద్రీయ ఉత్పత్తుల మార్కెట్ తదితర అంశాలకు సంబంధించి రాష్ట్రాలు వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్రం మార్గదర్శకాల్లో సూచించింది. సాధారణ వ్యవసాయ పద్ధతి నుంచి సేంద్రీయం వైపు మరలడం, పెట్టుబడి రాయితీల వంటి వాటికి ఇచ్చే సాయాన్ని రైతు ఖాతాలో జమ చేస్తుంది. నేరుగా మార్కెట్ చేసుకునేందుకు ఆర్థిక సాయం చేస్తుంది. రాష్ట్రానికి అదనంగా 50 సేంద్రీయ వ్యవసాయ క్లస్టర్లు ఇచ్చేందుకు కేంద్రం అనుమతించిందని కమిషనర్ జగన్మోహన్ తెలిపారు. వ్యవసాయం వైపు యువకులు ఆకర్షితులయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. -
అంతకు మించి
జిల్లాకు వరప్రదాయినిగా మారిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఫలాలు రైతులకు అందుతున్నాయి. రబీలో సాగు చేసిన వేరుశనగ పంట రైతు చేతికి వచ్చింది. బీడు భూముల్లో కృష్ణా జలాలు పారగా రైతులు తమ రెక్కల కష్టంతో పసిడి పంటలుపండించారు. దీంతో జిల్లాలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లన్నీ రబీ వేరుశనగతో కిటకిటలాడుతున్నాయి. సాక్షి, నాగర్‌కర్నూల్ : రబీ పంటలు చేతికొచ్చాయి. జిల్లాలో ఎక్కడ చూసినా వేరుశనగ రైతుల సందడే కనిపిస్తోంది. ట్రాక్టర్లు, ఆటోలు, ఎద్దుల బండ్లన్నీ మార్కెట్‌యార్డుల చెంతకే వెళ్తున్నాయి. వారంపదిరోజులుగా అయితే వేలాది బస్తాల వేరుశనగ ప్రతిరోజూ ఆయా మార్కెట్లకు తరలి వస్తుందంటే నమ్మశక్యం కావడంలేదు. సరుకును కొనేందుకు స్థానిక వ్యాపారులే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకకు చెందిన వారు సైతం ఇక్కడ నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగానే మార్కెట్లలో ధర లభిస్తోంది. జిల్లా లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ.5వేలకు పైగా ధర లభిస్తుండటంతో రైతుల ము ఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఈ ధర రై తుల కష్టాలను పూర్తిగా తీర్చనప్పటికీ ఆ రువేల పైచిలుకు ధర లభిస్తే రైతులకు కొంత లాభం చేకూరే అవకాశాలున్నాయి. కలిసొచ్చిన తుంపర సేద్యం ఆరుగాలం శ్రమించే జిల్లా రైతాంగానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువల ద్వారా కృష్ణా జలాలు పొలాల గుండా పారాయి. 2017 అక్టోబర్ నుంచి కాలువల నుంచి నీరు పారుతుండటంతో రైతులు ధైర్యంగా రబీ పంటకు శ్రీకారం చుట్టారు. దీనికితోడు భూగర్భ జలాలు మెరుగు పడటంతో తుంపర సేద్యం ద్వారా వేరుశనగను భారీగా సాగు చేశారు. సాధారణ సాగు విస్తీర్ణం 69వేల 887 ఎకరాలు కాగా ఈసారి లక్షా 30వేల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలోనే కందనూలు జిల్లాలో అత్యధికంగా వేరుశనగ సాగైనట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మూడు ప్రధాన మార్కెట్లలో పెరిగిన వ్యాపారం జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని వ్యవసాయ మార్కెట్లకు పెద్ద ఎత్తున వేరుశనగ తరలివస్తోంది. నేరుగా కమీషన్ ఏజెంట్లే రైతుల నుంచి వేరుశనగను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనప్పటికీ వేరుశనగ డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వ మద్దతు ధరను మించి ధర లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటి వరకు గత 15 రోజుల నుంచి వేరుశనగ లావాదేవీలలో గరిష్టంగా క్వింటాల్‌కు రూ.5039 చెల్లించి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. కనిష్టంగా రూ.4029 జిల్లాలో వేరుశనగ ధర నమోదైంది. సరాసరిగా రూ.4735 క్వింటాల్‌కు ప్రైవేటు వ్యాపారులు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు 28వేల 991 క్వింటాళ్ల వేరుశనగను కొనుగోలు చేశారు. వేరుశనగ విక్రయాలు మరో 20 రోజులపాటు ఇదేవిధంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో సాగయిన వేరుశనగ విస్తీర్ణంలో కేవలం 25 శాతం మాత్రమే ఇప్పటి వరకు రైతుల చేతికి వచ్చింది. మొత్తం పంట దిగుబడి అంచనా ఒక లక్షా 61వేల 140 మెట్రిక్ టన్నులుగా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఎకరాకు 6 నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. స్థలాభావంతో ఇబ్బందులు జిల్లాలోని రబీ పంట ఒక్కసారిగారైతుల చేతికి రావడంతో మార్కెట్ యార్డులలో స్థలాలు సరిపోక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల రాష్ట్ర మార్కెటింగ్ శాఖా మంత్రి హరీశ్‌రావు జిల్లాలో పర్యటించిన సందర్భంలో వసతులు పెంచాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో రైతులకు మార్కెట్ యార్డులలో పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనాలు లేకపోవడం, భోజనం చేయటానికి వేర్వేరుగా రూములు లేకపోవడంతో ఆరు బయటనే భోజనాలు చేసి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. మలమూత్ర విసర్జనకు సైతం మూత్రశాలలు లేకపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మార్కెట్ చుట్టూ ప్రహరీ గోడ లేక పందుల బెడదతో పంటకు రక్షణ లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ పనులకు కూలీల కొరత అధికమైంది. వేరుశనగ పంట తొలగింపునకు ఒక్కో మహిళా కూలీకి రూ.300 దాకా కూలి చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూలీలు దొరకక చాలామటుకు భూముల్లోనే వేరుశనగ మిగిలి ఉంది. ఇలా మరికొద్ది రోజులు గడిస్తే వేరుశనగ కాయలు మొలకెత్తే ప్రమాదం లేకపోలేదు. వ్యవసాయ శాఖాధికారులు వేరుశనగ పంట తీసేందుకు ప్రత్యేకంగా యంత్రాల వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ముందస్తు వ్యూహం లేక రైతులకు వచ్చే లాభమంతా కూలీలకే చెల్లించాల్సి వస్తోంది. ఒక ఎకరం వేరుశనగ సాగుకు రూ.10వేలు విత్తనాలకు, మరో 10వేలు ఎరువులు, కూలీల ఖర్చులు అవుతాయి. ఇలా ఎకరానికి ఒక్కో రైతు రూ.20వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎకరా దిగుబడి సరాసరి ఐదు క్వింటాళ్లు అనుకుంటే రైతుకు ప్రస్తుతం అందుతున్న ధర ప్రకారం రూ.25వేలు చేతికొస్తాయి. అంటే రైతు పెట్టిన పెట్టుబడి రూ.20వేలు పోగా ఎకరాకు కేవలం రూ.5వేలు మాత్రమే రైతు చేతికి అందుతుండటంతో నష్టం లేకుండా రైతులు కొద్దిపాటి లాభంతో బయట పడుతున్నారు. కొల్లాపూర్ మార్కెట్ నిరుపయోగం కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మార్కెట్ యార్డు ఉన్నా అక్కడి మార్కెట్లో వేరుశనగ కొనుగోలు చేసే ట్రేడర్లు లేక ఆ ని యోజకవర్గంలోని రైతులంతా నాగర్‌కర్నూ ల్ మార్కెట్ యార్డుకు తరలి వస్తున్నారు. దీంతో వారికి ట్రాన్స్‌పోర్టు ఖర్చు అధికంగా వస్తోంది. మిగిలే ఆ డబ్బులు కూడా రైతులు పొందలేకపోతున్నారు. అధికారులు అక్కడే కొనుగోళ్లు ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. కొల్లాపురం నుంచి వచ్చినా.. నాలుగు ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశాను. 27 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే కొల్లాపూర్ మార్కెట్లో వ్యాపారులు లేక ఇంత దూరం రావాల్సి వచ్చింది రూ.3వేలు పెట్టి ట్రాక్టర్ కిరాయి తీసుకుని నాగర్‌కర్నూల్ మార్కెట్‌కు వచ్చాను. ఇక్కడ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.4729 చొప్పున 94 బస్తాలను కొన్నారు. – శ్రీను, ఎల్లూరు, కొల్లాపూర్ మండలం అందరూ ప్రైవేట్‌లోనే విక్రయిస్తున్నారు.. ప్రస్తుతం జిల్లాలో అన్ని మార్కెట్ యార్డుల్లో వేరుశనగ ప్రభుత్వ మద్దతు ధర కంటే ప్రైవేటుగానే రైతులకు అధికంగా వస్తుండటంతో ఎవరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. రానున్న రోజుల్లో ప్రైవేటు వ్యాపారుల వద్ద ధర తగ్గితే అప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభించి ధాన్యం కొంటాం. – బాలమణి, మార్కెటింగ్ ఏడీ -
బె‘లూన్’ ఇంటర్నెట్!
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్.. ఇంట్లో ఉన్న కంప్యూటర్.. వైఫై.. ఇలా రకరకాల మార్గాల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఇదెంత సౌకర్యంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.. అయితే ప్రపంచంలో నెట్ అనుసంధానం లేని దాదాపు 370 కోట్ల మందికి కూడా నెట్ అందించేందుకు గూగుల్ ఓ సరికొత్త ప్రాజెక్టు చేపట్టింది. దీని పేరే.. ‘ప్రాజెక్టు లూన్’. ఇందులో హీలియం గాలి నింపిన భారీ సైజు బెలూన్లను భూమిచుట్టూ తిప్పుతూ, వాటికి అనుసంధానించిన పరికరాల ద్వారా ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న వారికైనా నెట్ సౌకర్యం అందించవచ్చు. ఇలా పనిచేస్తుంది.. ఈ బెలూన్లు భూమిపై నుంచి దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూంటాయి. విమానాలు ప్రయాణించే దానికన్నా రెట్టింపు ఎత్తు అన్నమాట. ఈ ప్రాంతంలో గాలి పొరలు పొరలుగా ఉండటమే కాకుండా వేగం, దిశ ఒక్కో రీతిలో ఉంటుంది. ఈ పొరల్లో బెలూన్లు పైకి, కిందకు కదులుతూ గాలివాటానికి కొట్టుకుపోతూ ఓ చోటు నుంచి మరో చోటుకు చేరుకుంటాయి. ఒక్కో బెలూన్ దాదాపు 36 అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవు ఉంటాయి. ఇవి గాల్లో వందరోజులపాటు గాల్లో ఎగరగలవు. బెలూన్లకు దిగువభాగంలో సోలార్ ప్యానెల్స్, ఇంటర్నెట్ సమాచారాన్ని ప్రసారం చేసేందుకు ఉపయోగపడే పరికరాలను ఏర్పాటు చేస్తారు. సెల్‌ఫోన్ కంపెనీలు తమ రేడియో ఫ్రీక్వెన్సీలో కొంతభాగాన్ని ఈ ప్రాజెక్టు కోసం కేటాయిస్తాయి. సంకేతాలను అందుకునేందుకు ఆయా ప్రాంతాల్లోని భవనాలపై అక్కడక్కడ రిసీవర్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో బెలూన్ ద్వారా దాదాపు 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని సెల్‌ఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్ను అందుకునే అవకాశముంటుంది. న్యూజిలాండ్‌లో ప్రయోగాలు.. ఈ ప్రాజెక్టును రెండేళ్ల క్రితమే న్యూజిలాండ్‌లో గూగుల్ విజయవంతంగా పరీక్షించి చూసింది. ముందుగా దాదాపు 30 బెలూన్లను ఆకాశంలోకి పంపి కొందరికి ఇంటర్నెట్ సౌకర్యం అందించగలిగారు. ఆ తరువాత మరింత ఎక్కువ ప్రాంతాన్ని, వినియోగదారులను చేర్చారు. అంతేకాకుండా అమెరికాలోని కాలిఫోర్నియా, సెంట్రల్వ్యాలీ, బ్రెజిల్‌లోని కొన్ని చోట్ల జరిపిన ఈ పరీక్షలు విజయవంతమయ్యాయి. అవసరమైన కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే గూగుల్ త్వరలోనే బీఎస్ఎన్ఎల్ సహకారంతో భారత్‌లోనూ ఈ ప్రాజెక్టు చేపట్టే అవకాశముంది. బీఎస్ఎన్ఎల్ అధీనంలోని 2.6 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో మొబైల్ టవర్ల అవసరం లేకుండానే 4జీ ఇంటర్నెట్ను అందుకోవచ్చు. -
సు‘బాబూ’ల్ రైతు గోడు పట్టదా?
ధరల నిర్ణయానికి గడువు ముగిసినా.. మిన్నకుండిపోయిన సర్కారు మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు నిర్ణయించాలని రైతుల డిమాండ్ ధరలు తగ్గించాలని పేపర్ మిల్లుల ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా వేస్తున్న సుబాబుల్, సర్వీ, జమాయిల్ తోటల రైతులు నానా తిప్పలు పడుతున్నారు. పత్తి, పొగాకు, మిర్చి వంటి పంటల స్థానంలో తక్కువ పెట్టుబడితో పాటు వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకుని పెరిగే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపమన్న ప్రభుత్వమే.. ఇప్పుడు సదరు రైతులను పట్టించుకోవడంలో నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తులకు రెండేళ్లకోసారి నిర్ణయించే ధరలను ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరించాలని కోరుతున్న రైతుల గోడు అరణ్యరోదనగానే మిగులుతోంది. మరోపక్క ఈ ఉత్పత్తులను నిర్ణీత ధరలకు కొనుగోలు చేయాల్సిన పేపర్ మిల్లుల యజమానులు.. ధరలను పెంచకుండా ప్రభుత్వంపైఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో విసిగి వేసారిన రైతులు.. తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 20న మార్కెట్ కమిటీ కార్యాలయాల వద్ద ధర్నాలకు సమాయత్తమవుతున్నారు. సాగు గొప్ప..: నీటి అవసరం అంతగా లేని ఈ తోటలను ప్రధానంగా ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో సాగు చేస్తున్నారు. రైతు సంఘాల లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల హెక్టార్లలో సుబాబుల్, సర్వీ(సరుగుడు), జమాయిల్ సాగవుతున్నాయి. వీటి కర్రను పేపర్ తయారీకి ఉపయోగిస్తారు. ఎకరాకు 20 నుంచి 35 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో వాణిజ్య పంటలు వేసి రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి సాగును ప్రోత్సహించాయి. అయితే, ఇప్పుడు మాత్రం ఆయా రైతులను పట్టించుకోవడం లేదు. ధర నిర్ణయానికి గడువు ముగిసినా..! ప్రస్తుతం సుబాబుల్ టన్ను రూ.4,400, జమాయిల్, సర్వీ రూ.4,600గా ఉంది. రెండేళ్లకోసారి నిర్ణయించే ధర గడువు గత ఫిబ్రవరి 20తో ముగిసింది. తిరిగి ధర నిర్ణయించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో రైతులు ఇప్పటికైనా ధరలు నిర్ణయించాలని, మార్కెట్ ధరలకు అనుగుణంగా వాటిని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. మిల్లర్లది విపరీత వాదన.. సుబాబుల్ సహా ఇతర తోటల దిగుబడి ప్రస్తుత ధరలను తగ్గించాలని మిల్లర్లు వితండ వాదం చేస్తుండడం గమనార్హం. ఇప్పటికే రెండేళ్ల కిందట నిర్ణయించిన ధరలు తమకు గిట్టుబాటు కావడంలేదని రైతులు నెత్తీనోరూ బాదుకుంటుంటే.. మిల్లర్లు మాత్రం ధరలను తగ్గించాలని కోరుతూ తమదైన శైలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో ప్రైవేటు పేపర్ మిల్లుల యజమానులు ఈ విషయాన్నే స్పష్టం చేశారు. ఈ సమయంలో వారి వాదనకు ఫుల్స్టాప్ పెట్టి.. రైతుల గోడు పట్టించుకోవాల్సిన ధరల నిర్ణాయక కమిటీ(వ్యవసాయ మంత్రి, మార్కెటింగ్ శాఖ, జిల్లాల కలెక్టర్లు) మౌనపాత్ర పోషించింది. దీంతో మిల్లర్ల వాదనకు బలమేర్పడినట్టయింది. దళారులదే పైచేయి.. ప్రస్తుత నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలే ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే, ఈ విషయంలో అడుగడుగునా దళారులదే పైచేయిగా సాగుతోందని రైతులు వాపోతున్నారు. దళారులే రైతుల్ని నేరుగా సంప్రదించి ఉత్పత్తులను కొంటున్నారు. దీంతో రైతులు నిర్ణీత ధరలకన్నా తక్కువకే తమ ఉత్పత్తులను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఈ సమయంలో రంగంలోకి దిగాల్సిన మార్కెటింగ్ శాఖ కూడా దళారులకు లోబడి.. మిన్నకుండిపోతోందని రైతులు పేర్కొంటున్నారు. వాణిజ్య పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడంలోను, ప్రత్యామ్నాయ పంటలకు ధరలను నిర్ణయించడంలోనూ తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయి. మరోపక్క, ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన మిల్లుల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. దీంతో విసుగెత్తిన ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతన్నలు ప్రభుత్వంతో సమరానికి సిద్ధమవుతున్నారు. రూ. 22 కోట్ల బకాయి సిర్పూరు మిల్లుపై కేసు సిర్పూర్ పేపర్ మిల్లు, ఏపీ పేపర్ మిల్లు, ఐటీసీ, బిల్ట్, వెస్ట్ కోస్ట్, సుభోద్ ఎంటర్ప్రైజెస్, జేకే పేపర్ మిల్స్ వంటివి ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రత్యామ్నాయ పంట ఉత్పత్తులను కొంటున్నాయి. సరుకును మార్కెట్ కమిటీలు కొని మిల్లులకు సరఫరా చేయాలనేది నిబంధన. కానీ దళారులే నేరుగా కొనుగోళ్లు చేస్తుండడంతో కొన్ని మిల్లులు రైతులకు పెద్ద ఎత్తున బకాయి పడ్డాయి. సిర్పూర్ మిల్లు రూ.22 కోట్ల మేరకు రైతులకు బకాయి పడింది. దీంతో రైతుల ఫిర్యాదు మేరకు కృష్ణాజిల్లా కలెక్టర్ ఆ మిల్లుపై కేసు నమోదు చేయించారు మినహా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. వాయిదా తీర్మానం తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్, సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. శాసనసభ సోమవారం సమావేశం కాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఎ. సురేష్ ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీనిపై చర్చకు అనుమతించాలని విపక్షం పట్టుబట్టింది. అయితే వేరే రూపంలో చర్చకు అవకాశమిస్తామని స్పీకర్ తెలిపారు. అప్పుడు సమగ్రంగా చర్చించాలని సూచించారు. 20న ధర్నా సుబాబుల్ సహా ప్రత్యామ్నాయ పంటల రైతులు ఈ నెల 20న మార్కెటింగ్ కమిటీల ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. వారి డిమాండ్లు.. ఠ సిర్పూరు మిల్లు బకాయి పడిన రూ.22 కోట్లను మార్కెట్ కమిటీల నిధుల నుంచి తక్షణమే చెల్లించాలి ఠ ఉత్పత్తి విక్రయ సమయంలో మున్ముందు కంపెనీల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలి ఠ రైతులందరికీ గుర్తింపు కార్డులివ్వాలి ఠ దళారీ వ్యవస్థను నిర్మూలించేలా మార్కెటింగ్ కమిటీలు చర్యలు చేపట్టాలి ఠ ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖమంత్రి ప్ర స్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయాలి. -
దరలు కుతకుత!
అనంతపురం రాజు రోడ్డుకు చెందిన రాములమ్మ ఇంటికి బంధువులు రావడంతో బిర్యానీ చేయడానికి సోనామసూరి బియ్యం కోసం మార్కెట్‌కు వెళ్లింది. కిలో బియ్యం (పాతవి) రూ.50 అని వ్యాపారి చెప్పడంతో కంగుతినింది. మొన్నటి వరకు రూ.40 ఉండేవి కదా అని అడిగితే.. ‘ఔనమ్మా అది మొన్నటి మాట. ఇప్పుడు ధర పెరిగింద’ని చెప్పడంతో ఇంటికి తిరుగుముఖం పట్టింది. దారి మధ్యలో మరో అంగడికి వెళ్లి కిలో కందిపప్పు ఎంతని అడగ్గా.. రూ.80 అని చెప్పడంతో ఆమె కళ్లు తేలేసింది. సాక్షి, అనంతపురం : పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచేలా ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండు పూటలా పప్పు చారుతో భోజనం చేసే పరిస్థితులు లేకుండా పోతున్నాయని పేదలు వాపోతున్నారు. మొన్నటి వరకు సన్నరకం బియ్యం (బీపీటీ) ధర కొద్దిగా తగ్గినట్లు కనిపించినా మళ్లీ రెక్కలొచ్చాయి. మూడు నెలల క్రితం వరకు క్వింటాల్ రూ.4 వేలు ఉండగా... ప్రస్తుతం రూ.5 వేలకు చేరాయి. పప్పుల విషయానికొస్తే ఆరు మాసాల క్రితం కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ఉన్న పెసర, ఉద్దులు, కందిపప్పు ధరలు ప్రస్తుతం ఏకంగా రూ.80 నుంచి రూ.100కు చేరాయి. సాధారణంగా పెసర, కందిపప్పులను వారంలో కనీసం నాలుగురోజులైనా వినియోగిస్తుంటారు. పెరిగిన ధరలతో రెండు రోజులు కూడా వినియోగించే పరిస్థితి లేకుండా పోయింది. చట్నీలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మసాల వంటలతో పాటు ముఖ్యంగా చట్నీలకు ఉపయోగించే కొబ్బరి ధర కూడా అమాంతం పెరిగిపోయింది. తె గుళ్ల దెబ్బకు తమిళనాడు, ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి పంట దిగుబడి తగ్గిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో కొబ్బరి రూ.120 పలుకుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయలదీ అదే రూటు కూరగాయలు కొనుగోలు చేయాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రూ.100 తీసుకుని మార్కెట్‌కు వెళ్తే చిన్నపాటి సంచి నిండా కూడా రావడం లేదు. మొన్నటి వరకు కిలో రూ.10 పలికిన టమాట ప్రస్తుతం రూ.24కు ఎగబాకింది. బెండకాయ మినహా ఏ కూరగాయను ముట్టుకున్నా కిలో రూ.30 పైమాటే. కందగడ్డ కిలో రూ.70, కాలీఫ్లవర్ ఒకటి రూ.15 -20, మునక్కాయలు (నాలుగు) రూ.20 పలుకుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో వర్షాభావం కారణంగా కూరగాయల సాగు తగ్గిపోవడంతో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆ రాష్ట్రాల్లో కూడా దిగుబడి పెద్దగా లేకపోవడంతో ధరలకు రెక్కలొస్తున్నాయి. ఉల్లిగడ్డలు మాత్రం రూ.20 పలుకుతుండడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. -
టమాట ధరలు పతనం
మదనపల్లె, న్యూస్‌లైన్: మదనపల్లె టమాట మార్కెట్లో ధరలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం మరింత తగ్గాయి. ఈనెల 6, 7 తేదీల్లో మొదటి రకం 10 కిలోల బుట్ట ధర రూ.27, రెండవ రకం రూ.25, మూడోరకం రూ.20 పలికింది. 8, 9 తేదీల్లో మొదటి రకం రూ.25, రెండవ రకం రూ.20, మూడో రకం రూ.14 పలకగా 11వతేదీ మొదటి రకం రూ.30, రెండవ రకం రూ.22, మూడవ రకం రూ.16 పలికింది. అయితే బుధవారం మొదటి రకం రూ.23లు, రెండవ రకం రూ.18లు, మూడవ రకం రూ.13 పలికింది. మదనపల్లె నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, కాకినాడ, గుంటూరుకు ప్రస్తుతం ఒక్క లోడు కూడా కాయలు వెళ్లడం లేదు. ఆ ప్రాంతాల్లో దిగుబడి అధికంగా రావడంతో ఇక్కడి నుంచి ఎగుమతి నిలిచిపోయింది. ప్రస్తుతం తమిళనాడులోని చెన్నై, కుంభకోణం, తిరుచ్చి ప్రాంతాలకు మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. అంతే కాకుండా ప్రతిరోజు 5 నుంచి 7 లోడ్ల వరకు పలమనేరు, చిత్తూరులోని జ్యూస్ ఫ్యాక్టరీలకు కాయలు తరలుతున్నాయి.