టమాట ధరలు పతనం | Tomato prices fall | Sakshi
Sakshi News home page

టమాట ధరలు పతనం

Published Thu, Feb 13 2014 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM

టమాట ధరలు పతనం

టమాట ధరలు పతనం

మదనపల్లె, న్యూస్‌లైన్: మదనపల్లె టమాట మార్కెట్‌లో ధరలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం మరింత తగ్గాయి. ఈనెల 6, 7 తేదీల్లో మొదటి రకం 10 కిలోల బుట్ట ధర రూ.27, రెండవ రకం రూ.25, మూడోరకం రూ.20 పలికింది. 8, 9 తేదీల్లో మొదటి రకం రూ.25, రెండవ రకం రూ.20, మూడో రకం రూ.14 పలకగా 11వతేదీ మొదటి రకం రూ.30, రెండవ రకం రూ.22, మూడవ రకం రూ.16 పలికింది. అయితే బుధవారం మొదటి రకం రూ.23లు, రెండవ రకం రూ.18లు, మూడవ రకం రూ.13 పలికింది. మదనపల్లె నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, కాకినాడ, గుంటూరుకు ప్రస్తుతం ఒక్క లోడు కూడా కాయలు వెళ్లడం లేదు.

ఆ ప్రాంతాల్లో దిగుబడి అధికంగా రావడంతో ఇక్కడి నుంచి ఎగుమతి నిలిచిపోయింది. ప్రస్తుతం తమిళనాడులోని చెన్నై, కుంభకోణం, తిరుచ్చి ప్రాంతాలకు మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. అంతే కాకుండా ప్రతిరోజు 5 నుంచి 7 లోడ్ల వరకు పలమనేరు, చిత్తూరులోని జ్యూస్ ఫ్యాక్టరీలకు కాయలు తరలుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement